Rose Plant Tips: గులాబీ మొక్కలను ఇంటిలో పెంచుకోవడానికి తీసుకునేటప్పుడు మేలైన రకాలు. కొన్ని కొన్ని జాగ్రత్తలు పాటించాలి. చిన్న చిన్న మొక్కలకే ఎక్కువ పువ్వులు పూస్తుంటాయి. కాబట్టి పైన కొంచెం వెడల్పు ఎక్కువగా ఉండేలా కొనుక్కోవాలి. కుండీలను అడుగున నీళ్లు నిలువ ఉండకుండా బయటకు పోయే విధంగా కన్నం ఉండాలి. కుండీలలో నుంచి కారిన నీటిలో ఇల్లంతా పాడవకుండా అడుగున ట్రేలను ఉపయోగించుకోవాలి. కుండీలలో మట్టి నింపేటప్పుడు మట్టిలో ఇసుక, రాళ్లు లేకుండా జాగ్రత్త తీసుకోవాలి. కుండీలలో మట్టితో కంపోస్టు ఎరువును రెండు, ఒకటి నిష్పత్తిలో గుల్లగా చేసి కలిపి నింపుకోవాలి. కుండీలో నీరు పోయడానికి వీలుగా పైన 5 సెం. మీ. వరకు ఖాళీ స్థలాన్ని తప్పకుండా ఉంచాలి.
Also Read: సేంద్రియ విధానంలో గులాబీ సాగు.. గులాబీ రేకులతో రుచికరమైన గుల్కాండ్
గులాబీ మొక్కను నాటేటప్పుడు మట్టిలోకి ఆకులు, మొగ్గలు కలిసిపోకుండా చూసుకోవాలి. మొక్కలు నిటారుగా కుండీలో దించాక చుట్టూ చేతి వేళ్ళతో మట్టిని నెమ్మదిగా నొక్కడం మంచిది. మొక్కలు నాటుకున్నాక రోజూ రెండు పూటలా అవసరమైనన్ని నీళ్లు పోస్తుండాలి. కుండీలలో మట్టి తడి ఆరిపోకుండా వేడి నుంచి తట్టుకోవడానికి పైన ఒక పొరగా ఎండిన ఆకులు, ఆవుపేడను ఉంచాలి. ఇవి ఎరువుగా కూడా పనిచేస్తాయి కూడా. డైమిథోయేట్, మిథైలేట్ స్పిరిట్ లాంటివి వాడుకోవాలి. వీటిని పెంచడం సరదాగా, చాలా తేలికే అని అనిపిస్తుంది. కానీ కాస్త శ్రమపడి వాడిపోయిన ఆకులు, పువ్వులు కత్తిరించి, కలుపు మొక్కలను తీసేస్తుండాలి. గులాబీ మొక్కలు పైన నీళ్ళు స్ప్రే చేయడం వలన అధిక వేడి, దుమ్ము ధూళి నుంచి రక్షణగా ఉంటుంది.
గులాబీ పువ్వు బాగా విచ్చుకున్న తరువాత పువ్వును కోసి జానెడు వరకు కొమ్మలని కత్తిరించాలి. ఉల్లిపొట్టు, బంగాళాదుంప పొట్టు, మిగిలిపోయిన మందులు మొక్క చుట్టూ వేసుకోవాలి. టీ పొడి, కాఫీ పొడి గులాబీ మొక్కలకు మంచి ఎరువుగా పనిచేస్తాయి. రోజ్ మిక్స్ డ్ నెలలో ఒక్కసారి మొక్కకు జానెడు వెడల్పు లో వేసుకోవాలి. ఎప్పటికప్పుడు పండిన, ఎండిన ఆకులు కొమ్మలు తుంచేయాలి. మొక్క ఎంత గుబురుగా ఉంటే అంత ఎక్కువగా పూలు పూస్తాయి అని గుర్తు పెట్టుకోండి.
Also Read: వేసవిలో గులాబీ మొక్కల సంరక్షణ