Terrace Gardening: యాంత్రిక జీవనం నుంచి బయటపడేందుకు మిద్దె మీద పచ్చని వాతావరణాన్ని సృష్టిస్తున్నారు.ఆరోగ్యంతో పాటు మనసుకు ఆహ్లాదాన్ని కలిగించే మిద్దె తోట పనిపై జనాల్లో విపరీతమైన ఆసక్తి మొదలైంది. ఒకప్పుడు గ్రామాల్లో మాత్రమే ఎక్కువగా కనిపించే ఇంటిపంటలు, నేడు నగరాలకు కూడా విస్తరించాయి. రసాయనాలు లేకుండా స్వయంగా కంపోస్టులు తయారు చేసుకుని కూరగాయలు, పండ్లు, పూల మొక్కలు పండిస్తున్నారు.
అయితే మిద్దె తోటను ప్రారంభించాలని అనుకుంటున్న వారికి ప్రకృతి ప్రేమికుడు సంపత్ తన సోషల్ మీడియా ద్వారా సలహాలు, సూచనలు ఇస్తున్నారు. మరి అయన ఏమంటున్నారు?, మిద్దె తోటలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఆయన మాటల్లోనే విందాం.
1. ముందుగా టెర్రస్ గార్డెన్ లో ఎటువంటి మొక్కలను పెంచాలనుకుంటున్నారో తెలుసుకోవాలి. కూరగాయలు, పండ్ల మొక్కలు, పూల మొక్కలు, లేదా ఆర్నమెంట్స్ ప్లాంట్స్ ఏ విధమైన మొక్కలను పెంచాలనుకుంటున్నారో ముందు నిర్ధారణ చేసుకోవాలి. అయితే ఎలాంటి మొక్కల్ని పెంచినా వాటికి తప్పనిసరిగా కుండీలు అవసరం ఉంటుంది. అయితే మొక్క రకాన్ని బట్టి కుండీల సైజు కూడా మారుతుంది.
2. మంచి నాణ్యమైన విత్తనాలను కొనాలి. వ్యవసాయం, మిద్దె తోట లలో విత్తనాల ఎంపిక ప్రాముఖ్యమైంది. ముఖ్యంగా మిద్దె తోటలో విత్తనాలు ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే తక్కువ విస్తీర్ణంలో మొక్కలు పెంచడం వల్ల విత్తనాల ప్రభావం మొక్కపై ఉంటుంది. అంటున్నారు సంపత్.
Also Read: ఇలా కూడా మిద్దె తోట ప్రారంభించొచ్చు !
3. మంచి ఎరువుని తయారు చేసుకోవాలి. అయితే ఎరువులు లేకపోయినా మొక్కలకు పెరిగే సామర్ధ్యం ఉంటుంది. కాకపోతే మట్టి బలాన్ని కోల్పోతే మొక్క నుంచి ఎటువంటి దిగుబడి ఉండదు. అందుకే ఎరువులు వాడటం వల్ల మంచి ఫలితాలు చూడవచ్చు. ఎరువుల తయారీలో ఆవు పేడ , గేదె పేడ వాడుకోవచ్చు. కానీ ఎండిన పేడను మాత్రమే మట్టిలో కలుపుకోవాలి. పచ్చిగా ఉన్న పేడను మట్టిలో కలుపుకుని ఎరువు తయారు చేస్తే మొక్కను చీడపురుగులు ఆశించే ప్రమాదం ఉంటుంది. 60 శాతం మట్టి , 40 శాతం సేంద్రియ ఎరువు , 10 శాతం వేప పిండి కలుపుకోవాలి. అలాగే మొక్కలు ఎదుగుతున్న సమయంలో కుంకుడు కాయ రసాన్ని వారానికి ఒకసారి పిచికారీ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. లీటరు వాటర్ బాటిల్ లో 20 ఎంఎల్ కుంకుడు కలుపుకుని పిచికారీ చెయ్యాలి.
మిద్దె తోట పెంచాలనుకునే వాళ్ళు ముందుగా ఆకుకూరలతో మొదలుపెడితే బాగుంటుంది. ఎందుకంటే మొదలు పెట్టిన 15 నుంచి 20 రోజుల వ్యవధిలోనే పంట చేతికొస్తుంది. అలా చేయడం వలన అనుభవం వస్తుంది అంటున్నారు సంపత్.
Also Read: మిద్దె తోటలలో టమాటా మొక్కల యాజమాన్యం