Grow Plants Without Soil: కరోనా పుణ్యమా అని అందరిలోనూ ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. ఇక లక్డౌన్ కారణంగా చాలామంది ప్రకృతి ప్రేమికులు తమ ఇంటిని కూరగాయలు, పండ్ల మొక్కలు, పూల మొక్కలతో అందంగా తీర్చిదిద్దారు. ముఖ్యంగా అనేక రకాల మిద్దె తోటలు వెలిశాయి. రసాయన ఎరువులని పక్కనపెట్టేసి సేంద్రియ పద్దతిలో మొక్కలని పెంచుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇక కొందరు మట్టి లేకుండా మొక్కలను పెంచుతూ ఆశ్చర్యపరుస్తున్నారు.
ప్రస్తుతం కిచెన్ గార్డెనింగ్ ఆవశ్యకత నానాటికి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మట్టిని వాడకుండా, కొబ్బరి పొట్టుతో కూరగాయల సాగుకు ప్రాముఖ్యతనిస్తున్నారు. అయితే చాలామందికి మట్టి లేకుండా మొక్కలను పెంచాలని ఉన్నప్పటికీ సరైన అవగాహనా లేక పెంచలేకపోతున్నారు. మట్టి లేకుండా మొక్కలను పెంచాలి అనుకుంటే ముందుగా మొక్కల రకాన్ని మరియు ఎన్ని రకాల మొక్కల్ని పెంచాలో ముందే ఎంచుకోవాలి. గార్డెన్ కు అవసరమైన పంపులు, నీటి డ్రమ్ములను సిద్ధం చేసుకోవాలి. అనంతరం మొక్కలకు కావాల్సిన పోషకాలను నీటిలో కరిగించాలి. ఇక మొక్క సైజుని బట్టి రంధ్రాలను చేస్తే సరిపోతుంది. మొక్కలకు అవసరమైన నీటిని అందించాలి. ఇక నీటిలో పోషకాల శాతాన్ని పరీక్షించాలనుకుంటే ఒక పిహెచ్ టెస్టర్, సిఎఫ్ మీటరు కొనుగోలు చేసుకోవాలి. మొక్కలకు ముఖ్యంగా సూర్యరశ్మి అందేలా చూసుకోవాలి. అలాగే గాలి కూడా ఎంతో అవసరం.
Also Read: పూల మొక్కల్లో తెగుళ్ళు – నివారణ
మరో పద్దతి :
కొబ్బరి పీచు(కోకోపేట్): దీనికి నీటిని పట్టుకునే సామర్థ్యం
వర్మిక్యులైట్: ఇది నీటిని ఆవిరి కానివ్వకుండా కంట్రోల్ చేస్తుంది.
పర్లైట్: దీన్ని గాలి ప్రసరణ కోసం ఉపయోగించాలి.
కోకోపేట్ 75శాతం, పర్లైట్ 15 శాతం, వర్మిక్యులైట్ 5 శాతాన్ని వినియోగించాలి. ఈ మూడింటిని మిక్చర్ గా చేసుకుని మిశ్రమాన్ని సీడ్ ట్రేలో వేసుకోవాలి. తర్వాత విత్తనాలను ట్రే రంద్రాల్లో పెట్టేసుకుని పైన మరో లేయర్ మిశ్రమంతో కప్పేసుకోవాలి. తర్వాత వాటర్ ని స్ప్రే చేసుకోవాలి. తర్వాత తేమ కోసం పైన ప్లాస్టిక్ కవర్ తో ట్రే మొత్తాన్ని కప్పేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా మొక్క ఎదుగుదల తొందరగా ఉంటుంది.
Also Read: 10వ తరగతి డ్రాపౌట్ కానీ పద్మశ్రీ !