Bougainvillaea: తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్లో రైతులు సంప్రదాయ పంటలకు మార్కెట్లో సరైన ధర ఉండటం లేదు. ఇప్పుడు రైతులు లాభాల కోసం వాణిజ్య పంటలని ఎక్కువగా పండిస్తున్నారు. వాణిజ్య పంటలకి మార్కెట్లో మంచి డిమాండ్ ఉండటంతో రైతులు లక్షల్లో లాభాలు పొందుతున్నారు. విబిన్నమైన పంటలు పండిస్తున్న రైతులు ప్రస్తుతం కాగితం పూవ్వులను కూడా సాగు చేసి మంచి లాభాలని ఆదాయంగా పొందుతున్నారు.
బంతి, చామంతి, మల్లెపూలు, గులాబీలతో పాటు కాగితపు పూవ్వులకి కూడా మంచి ఆదాయం ఉంది. ఇంటిలో అలంకారానికి వాడుకునే పూవ్వులతో ఆదాయం ఎలా చేసుకోవచ్చు అనుకుంటున్నారా. ఈ పూవ్వులని వ్యాధుల చికిత్సలో, మందుల తయారీలో వాడుతారు. ఈ పూవ్వులని ఆయుర్వేద మందులో దగ్గు, ఉబ్బసం, విరేచనాలు, కడుపు, ఊపిరితిత్తుల రోగాలు వాడుతారు. ఈ పూవ్వులని ఎక్కువగా వేడుకుల అలంకరణకి వాడుతారు.
Also Read: Minister Niranjan Reddy: వరిలో స్వల్పకాలిక వంగడాలు సాగుచేయాలి – మంత్రి
ఇంటి అలంకరణలో ఈ మొక్కలని వాడడం ఎక్కువగా చూస్తాం. ఇప్పుడు కాగితపు పూవ్వులతో లక్షలు సంపాదిస్తున్నారు రైతులు. ఈ కాగితపు పూవ్వులు విత్తనాలు విత్తుకోవచ్చు, కొమ్మని కూడా నాటిన ఈ మొక్క వస్తుంది. ఈ పూవ్వులు వైద్యంలో వాడడం ద్వారా వీటి విలువ కూడా మార్కెట్లో ఎక్కువగా ఉంది.
ఈ కాగితపు పూవ్వులకి నీళ్లు ఎక్కువ వాడితే మొక్కలు వాడిపోతాయి, వేర్లు మురిగిపోతాయి. ఈ మొక్క నాటిన తర్వాత మట్టి పై భాగం అందిపోయాక నీళ్లు పొయ్యాలి. ఎక్కువ నీళ్లు ఇస్తే మొక్కలు చనిపోతాయి. ఎండాకాలంలో మాత్రం ప్రతి రోజు ఈ మొక్కలకి నీళ్లు పొయ్యాలి. కాగితపు పూవ్వులకి ఎరువులు వాడాల్సిన అవసరం లేదు.
ఈ కాగితపు పూవ్వులు పెంచడం ద్వారా నెలకి దాదాపు 50000-60000 వేలు పంపాదించుకోవచ్చు. మార్కెటింగ్లో మంచి అనుభవం ఉన్న వాళ్ళు ఈ పూవ్వులతో మంచి ఆదాయం చేసుకోవచ్చు. గ్రామంలో ఇంటి దగర ఉండి మంచి ఆదాయం చేసుకోవచ్చు ఈ కాగితపు పూవ్వుల పంట పండించి.
Also Read: Drone Technology In Agriculture: వ్యవసాయంలో డ్రోన్స్ ఎలా వాడాలి..?