ఉద్యానశోభ

Machi Patri Cultivation: ఒకసారి వేసుకుంటే 10 సంవత్సరాలు సులువుగా సాగు చేసే ఈ పంటతో నెలకి 20 వేలు లాభాలు ఎలా… ?

2
Machi Patri Cultivation
Machi Patri

Machi Patri Cultivation: ఈ మధ్య కాలంలో రైతులు పూవ్వుల తోటలు పెంచి కూడా మంచి ఆదాయం పొందుతున్నారు. రైతులు ఈ పువ్వుల తోట ద్వారా వ్యాపారులతో కాంట్రాక్టు పద్దతిలో వ్యవసాయం చేస్తూ మార్కెట్లో డిమాండ్ ఉన్న పూవులని పండిస్తున్నారు. ఇలాంటి సాగులోనే కొత్తగా మసుపత్రి పండిస్తున్నారు. నంద్యాల జిల్లా యూ బొల్లవరం గామంలో పసుపులేటి శ్రీనివాసులు గారు ఈ మసుపత్రి సాగు చేస్తున్నారు.

మసుపత్రిని ఎక్కువగా పువ్వుల దండలలో, ఇంటిలో అలంకారానికి, పెళ్లిళ్లలో అలంకారానికి వాడుతారు. ఈ రైతు 30 సంవత్సరాల నుంచి మసుపత్రిని సాగు చేస్తున్నారు. పువ్వుల దండలో వాడే దవనం కూడా సాగు చేసే వాళ్ళు. మార్కెట్లో డిమాండ్ తాగడంతో ఇప్పుడు సాగు చేయడం లేదు.

ప్రస్తుతం ఎకరం పొలంలో సాగు చేస్తున్నారు. ఈ మసుపత్రిలో మంచి ఔషధ గుణాలు ఉన్నాయి. వీటి ఆకులని తిన్నడం ద్వారా జలుబు, దగ్గు లాంటి రోగాలు తగ్గుతాయి. దాని వల్ల కూడా మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఈ మసుపత్రిని కోతలు కోసిన నెల రోజులకి మళ్ళీ కోతకి సిద్ధంగా ఉంటుంది.

Also Read: Dry grass Packing Machine: వ్యవసాయంలో కొత్త వ్యాపారం చేస్తూ రెండు నెలలో 30 లక్షలు లాభాలు.!

Machi Patri Cultivation

Machi Patri Cultivation

కేవలం కలుపు రాకుండా నివారించుకుంటే ప్రతి నెల దిగుబడి మంచిగా ఉంటుంది. ఒకసారి ఈ పంటని వేస్తే 10 సంవత్సరాలు వస్తుంది. మూడు నుంచి నాలుగు రోజులకి ఒకసారి నీళ్లు ఇస్తే చాలు. పంట దిగుబడి మంచిగా రావడానికి ఎరువులు వేయాలి. ప్రతి రోజు ఈ రైతు 3000 కట్టలు అమ్ముతారు.

రోజుకి దాదాపు డిమాండ్ బట్టి 300 పార్సెల్ అమ్ముతున్నారు. మొత్తం పెట్టుబడి ఖర్చులు పోను రోజుకి 5000 రూపాయలు ఆదాయం వస్తుంది. మసుపత్రిలో అంతర పంటగా సన్నజాజులు పండిస్తున్నారు. ఈ మసుపత్రి వల్ల సన్నజాజుల మొక్కలకి మంచి బలం వస్తుంది. ఈ రైతు నెలకి దాదాపు 20 వేల వరకు లాభాలు పంపాదిస్తునాడు. ఈ రైతు చుటూ ప్రక్కల గ్రామాలకి మసుపత్రిని సప్లై చేస్తున్నాడు. మీకు ఈ పంట పై ఎలాంటి సందేహాలు లేదా ఈ మసుపత్రిని కొనుగోలు చేయాలి అనుకుంటే 9963776325 నెంబర్ సంప్రదించండి.

Also Read: Bucket Sprayer: హ్యాండ్ లేదా బక్కెట్ స్ప్రేయర్ ఎలా వాడాలి..

Leave Your Comments

Dry grass Packing Machine: వ్యవసాయంలో కొత్త వ్యాపారం చేస్తూ రెండు నెలలో 30 లక్షలు లాభాలు.!

Previous article

Cow Dung Bricks: పర్యావరణాన్ని కాపాడుకునే పద్దతిలో కొత్తగా.. ఆవు పేడ టైల్స్.!

Next article

You may also like