Curry leaves Cultivation: మన భారతదేశంలో ప్రతి వంటలో కర్వేపాకు వాడుతారు. కరివేపాకు లేనిదే అసలు వంటలు లేవు. కరివేపాకులో చాలా పోషక విలువలు ఉన్న చాలా వరకు వాటిని తిన్నారు. వాటి పోషక విలువలు తెలిసాక ఈ మధ్య కాలంలో బాగా తింటున్నారు. ఈ కరివేపాకు కూరలో తాలింపులోనే కాకుండా, వాటితో పుడులు కూడా తయారు చేస్తున్నారు. కరివేపాకుకు ప్రతి కాలంలో డిమాండ్ ఉంటుంది. కరివేపాకుకు ఉన్న డిమాండ్, పోషక విలువలు చూసి బాపట్ల జిల్లా, చిన్నకొత్తపల్లి గ్రామంలోని రైతులు ఎక్కువగా సాగు చేస్తున్నారు.
ఎక్కడి రైతులు రెండు సంవత్సరాల నుంచి ఈ పంటని సాగు చేస్తున్నారు. ఈ పంటని ఎక్కడ సాగు చేసి హైదరాబాద్, విజయవాడ. ముంబయిలలో ఉన్న పెద్ద పెద్ద మార్కెట్కి వ్యాపారులు ఎగుమతి చేసి మంచి లాభాలు పొందుతున్నారు. ఏ ప్రాంతంలో అయిన వీటికి డిమాండ్ ఉంటుంది.
Also Read: Yellow Chilli: పసుపు రంగు మిర్చిని మీరు చూశారా.!
కరివేపాకును ప్రతి నాలుగు నెలలకి ఒక్కసారి కోసుకోవచ్చు. రెండు సంవత్సరాల నుంచి సాగు చేస్తున్న ఈ పంట మూడు అడుగుల ఎత్తులో ఉంది. మొక్కల మధ్య దూరం 50-90 సెంటీమీటర్లు ఉండాలి. ఈ కరివేపాకుకు రసాయన ఎరువులు, పురుగుల మందులు అవసరం ఉండదు. ప్రతి రోజు ఈ మొక్కలకి నీళ్లు ఇస్తే చాలు.
నాలుగు ఎకరాల్లో కర్వేపాకును సాగు చేస్తే ఒక్కసారి కొత్తలో 25-30 టన్నుల దిగుబడి వస్తుంది. ఈ మొక్కలు 4-5 అడుగుల పొడవు పెరిగి నప్పుడు కోతలు కోయాలి. కర్వేపాకుకు మార్కెట్లో ఒక టన్నుకు 20-30 వేల రూపాయలకి రైతులు అమ్ముకుంటున్నారు. వీటిని సాగు చేస్తూ రైతులు మంచి లాభాలని పొందుతున్నారు. ఈ కరివేపాకును వ్యాపారులు విదేశాలకి ఎగుమతి చేస్తూ కూడా మంచి లాభాలు పొందుతున్నారు.
Also Read: Onion Price Rise: నాలుగు రోజులుగా పెరుగుతున్న ఉల్లిపాయ ధర..