Grape cultivation: భారతదేశంలో ద్రాక్షను కాండం ముక్కలతో అంటే స్వీయ వేరు వ్యవస్థ మీద ఇటీవల కాలం వరకు సాగు చేస్తున్నారు. ఎందుకంటే, ద్రాక్ష సాగవుతున్న పలు ప్రాంతాల్లో సాగుభూమి అనుకూలం, సురక్షితం, నేల నుంచి సంక్రమించే తెగుళ్లు, నులిపురు గులు లేవని భావించటం వల్ల ఈ విధంగా ప్రవర్ధనం సాగుతుంది. కానీ ఇటీవల కాలంలో కొన్ని ప్రాంతాల్లో నులిపురుగులు, తెగుళ్లు, (జీవ సంబం ధమైన) చౌడు, క్షార భూముల వల్ల, కొన్ని లవణాలు, పోషకాలు నేలలో అధికంగా ఉండటం వల్ల (అజీవ సంబంధమైన) ద్రాక్షలో సరైన పెరుగుదల లేకపోవటం, తక్కువగా పూత కాతలుండటం, ద్రాక్ష తీగలు క్రమంగా క్షీణించటం, దిగుబడులు వాణిజ్య పరంగా లాభదాయకంగా లేకపోవటం వల్ల, ద్రాక్ష సాగులో కూడా వేరుమూ లాలు అవసరమని భావిస్తున్నారు.
అమెరికా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ మొదలైన దేశాల్లో వేరు మూలాలనుపయోగించి పై సమస్యలను అధి గమిస్తున్నారు. వేరు మూలాలు నులి పురుగులు మొదలైన జీవ, అజీవ (నేల ఉదజని, చౌడు, అమ్మ, క్షారనేలలు, నీటి ఎద్దడి, తక్కువ నాణ్యత గల సాగు నీరు, అధిక సున్నం మొదలైన) సమస్యలను కలుగజేస్తాయి. అందుకు భిన్నంగా భారతదేశంలో ద్రాక్ష ప్రవర్ధనం కాండం ముక్కల ద్వారా ఎక్కువగా జరుగు తుంది. ఎందుకంటే మన దేశంలోప్రారంభ దశలో పై సమస్యలు లేవు. ఇతర దేశాల్లోని నులిపురుగులు ఫిల్లోక్సర్ అనే పురుగులు మన దేశంలో లేనందున చాలా కాలం వరకు వేరు మూలాల ఆవశ్యకతను ద్రాక్ష శాస్త్రవేత్తలు గుర్తించలేదు.
ద్రాక్ష సాగులో వేరు మూలాల ఆవశ్యకత-
ఇటీవలి కాలం వరకు భారత దేశంలో మనం ద్రాక్ష సాగులో వేరు మూలాలనుపయోగించలేదు. కానీ ఇటీవల కాలంలో ద్రాక్ష సాగులో కొన్ని జటిలమైన సమస్యలు కు వచ్చాయి. అవి చౌడు, క్షార నేలలు, సాగు నీటిలో హానికరమైన లవణాలు (క్లోరైడ్స్) సాగు నేలలో అధిక సున్నం, అధిక సోడియం, వర్షాభావ పరిస్థితులు, నీటి ఎద్దడి, తక్కువ – పూతకాతలు, నులిపురుగుల ఉనికి వల్ల వేరుమూలాల ఉపయోగం ప్రాధాన్యతను సంతరించుకుంది. వేరు మూలాలు నేల సంబంధమైన సమ స్యలను పరిష్కరించటమే కాకుండా, తీగల పెరుగుదలకు, మెరుగైన ఉత్పా దకతకు తోడ్పడుతాయి.
Also Read: Grapes Hormonal Control: ద్రాక్షలో హార్మోన్లు ఎప్పుడు వాడాలి.!
యాజమాన్య చర్యలు (మల్చింగ్, పచ్చిరొట్ట పైర్లు, హానికర లవణాలను ఒక భూమిలోని లోపలి పొరల్లోకి, వేరు వ్యవస్థకు అందనంత లోతుల్లోకి జారి పోయేలా చేయటం) నేల క్రమబద్ధీక రసాయనాలనుపయోగించి పై సమస్యలను రైతులు అధిగమిస్తున్నప్పటికీ వాటివల్ల ప్రయోజనాలు అంతంత మాత్రమే. ఖర్చు ఎక్కువ, లాభదాయకత తక్కువ. అందువల్ల ప్రతికూల పరిస్థితుల్లో కూడా సుస్థిర ఉత్పాదకతకు వేరుమూ లాల ఉపయోగం ఊపందుకుంది.
వేరు మూలాల ఎంపిక: ద్రాక్షసాగులో వేరుమూలాలను ఉపయోగించటానికి నిర్ణయించుకునే ముందుగా, ద్రాక్షసాగులో రైతులు ఎదుర్కొనే సమస్యలేమిటో తెలుసుకో వాలి. వాటి గురించి అవగాహన కలిగి ఉండాలి. అలాగే వివిధ వేరు మూలాల లక్షణాలను ఆకళింపు చేసుకుని ఉండాలి. ఎందుకంటే, సమస్యను బట్టి వేరుమూలాన్ని ఎంపిక చేసుకోవాలి. భిన్న ప్రాంతాల్లో సమ స్యలు వేరువేరుగా ఉంటాయి. అలాగే సాగు చేసే రకాన్ని బట్టి కూడా సమస్యలు మారుతుంటాయి. అన్ని సమస్యలకు ఒకే వేరుమూలం ఉపయోగ పడదు. భారతదేశంలో, ముఖ్యంగా మనరాష్ట్రంలో చాలావరకు ద్రాక్ష పాక్షిక మెట్ట ప్రాంతాల్లో సాగవుతుంది. కొన్ని ప్రాంతాల్లో పరిమితమైన నీటివ నరులున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వర్షాభావ, నీటి ఎద్దడి ప్రాంతాలున్నాయి. అలాంటి ప్రాంతాల్లో ద్రాక్షదిగుబడి, పండునాణ్యతను బాగా ప్రభావితం చేసేది, వాటిని పరిమితం చేసే ముఖ్యమైన అంశం నీరు. అందువల్ల ఈ ప్రాంతాల్లో నీటి ఎద్దడిని సమర్ధ వంతంగా తట్టుకునే వేరుమూలం ఎంతో అవసరం. అలాగే క్రమబద్ధం కానీ వర్షాలవల్ల, దీర్ఘకాల వర్షాభావ పరిస్థితుల వల్ల దిగుబడులు ప్రభా వితం కావటమే కాకుండా ద్రాక్షతోటల నిర్వహణ కూడా కష్టం. అందువల్ల తగిన వేరుమూలం ఎంపికకు ప్రాధాన్యత ఏర్పడింది.
Also Read: Grape Cultivation: ద్రాక్ష సాగులో మెళుకువలు.!
Must Watch: