Jamun Fruit Health Secrets: ఏ కాలంలో దొరికే పండు ఆ కాలంలోనే తినాలి – కింగ్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ అయిన నేరేడు ఆరోగ్య రహస్యాల గురించి తెలుసుకుందాము. వర్షాకాలంలో వచ్చే పండు నేరేడు. చూడటానికి పర్పుల్ కలర్ కనిపించే పండు నేరేడు. చాలా రుచకరంగా ఉండే పండు. దీని రుచి కొంచెం వెరైటీగా ఉంటుంది కొంచెం పులుపు, కొంచెం వగరు , కొంచెం తియ్యగా ఉంటుంది. ఒకప్పుడు ఈ నేరేడు పండు తినాలి అంటే పొలాల్లోకొ, తోటల్లోకొ వెళ్ళాలి. కాని ఇప్పుడు ఆ అవసరం లేదు సీజన్ వచ్చిందంటే చాలు బజార్ లో బండ్ల మీద అమ్ముతున్నారు.ప్రకృతి ఏ కాలంలో ఏ పండ్లను, ఏ ఏ ఆహార పదార్దాలను ఇస్తే అవి తినడం వలన ఆ కాలంలో వచ్చే అనారోగ్య సమస్యల నుండి మనల్ని మనం రక్షించుకోవచ్చు.
అలాగే రక్షణ వ్యవస్థను మెరుగుపరుచుకొని ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. నేరేడు పండ్లు మన పూర్వీకుల నుండే దొరికే పండు. తోలి ఏకాదశికి నేరేడు పండ్లు చెట్టుకి రాలుతాయి. ఈ పండును అందరూ తినొచ్చు. షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు.
కింగ్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్ అని ఈ నేరేడును ఎందుకు అంటారు:
ఈ నేరేడు పండును జంబూ ఫలం, జామూన్ అని అంటారు.ఈ వర్షాకాలం వచ్చే సరికి అంటు వ్యాధులు , సీజనల్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. వర్షాకాలంలో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. మనల్ని మనం రక్షించుకోవడానికి ప్రకృతి ప్రసాదించిన ఆ కాలం పండ్లను తినాలి. ఈ వర్షాకాలంలో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ నుండి మనల్ని రక్షించే పండు నేరేడు. నేరేడు పండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మరే పండులో ఉండవు. అందుకే ఈ నేరెడు పండును కింగ్ ఆఫ్ యాంటి ఆక్సిడెంట్స్ అంటారు.
స్పెషల్ గా ఈ పండు షుగర్ పేషంట్స్ కి చాలా మంచిది. రక్తంలో పెరిగిన చెక్కరకు నేరేడు కు మించిన విరుగుడు లేదు. వగరుగా వుంటుంది కదా, వగరుగా ఉన్నవి అన్ని షుగర్ పేషంట్స్ కి మంచివి. అన్నిటికంటే వగరు ఈ నేరేడు పండులో ఎక్కువగా ఉంటుంది కాబట్టీ ఈ పండు షుగర్ పేషంట్స్ కి చాలా మంచిది. ఈ నేరేడు పండులో వగరుకు కారణం గాలిక్ యాసిడ్ ఎక్కువగా ఉండటం. ఈ నేరేడు లో ఉండే యంతోసైనిన్స్ ఇన్సులిన్ రెసిస్టెంట్ ని తగ్గిస్తాయి. అనగా ఇన్సులిన్ పనిచేసేలా చేస్తాయి.షుగర్ పేషంట్స్ కి రక్తం లోపలికి వచ్చిన చెక్కర కణం లోకి త్వరగా వెళ్ళాలి అంటే ఇన్సులిన్ బాగా పనిచేయాలి. అధిక బరువు వల్ల ఇన్సులిన్ పనిచేయకుండా పోతుంది. ఇన్సులిన్ పనిచేసేలా చేయడానికి ఈ నేరేడు పండులో ఉన్న యంతోసైనిన్స్ సహాయపడతాయి. రక్తంలో చెక్కర స్థాయిలను బాగా తగ్గించడానికి నేరేడు పండు ఉపయోగపడుతుంది.
నేరేడు స్పెషల్ బెనిఫిట్(ప్రత్యేక లాభం)
LDL అను చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. గుండె జబ్బులు, బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి చెడు కొలెస్ట్రాల్ కారణం . దీని వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతాయి. ఈ నేరుడు LDL అను చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది.
నేరేడు పండులో ఉండే పోషకాలు :
100 గ్రాములు నేరేడు పండులో నీటి శాతం: 84%, సుమారుగా 15 మిల్లీ గ్రాములు పిండి పదార్ధాలు, 4 గ్రాములు పీచు పదార్థాలు,60-70 కేలరీల శక్తి ఉంటుంది. వీటితో పాటు విటమిన్ ఎ, సి రైబోప్లెనిన్ ఫోలిక్ ఆమ్లం, సోడియం, పొటాషియం, కాల్షియం, ఫాస్ఫరస్, మాంగనీస్ జింక్ పుష్కలంగా ఉంటాయి.
నేరేడు పండ్లు నలుపుగా, వగరుగా ఉండటానికి కారణాలు:
నేరేడు పండుకి నలుపు రంగు యంతోసైనిన్స్ వలన వస్తుంది. అలాగే వగరు నేరేడు లో ఉండే గాలిక్ యాసిడ్ వలన వస్తుంది.
మరి కొన్ని నేరేడు ఆరోగ్య రహస్యాలు :
• కణజాలంలో ఉన్న DNA డామాజ్ అవ్వకుండా సహాయపడుతుంది.
• ఈ నేరేడు పండలో ఉండే యాంటి ఆక్సిడెంట్స్ క్యాన్సర్ రాకుండా కాపాడుతాయి.
• ప్రేగులలో ఉండే బాక్టీరియా ఇన్ఫెక్షన్లు తగ్గించడానికి బాగా ఉపయోగపడతాయి.
• పైల్స్ వ్యాధి నివారిణిగా కూడా ఉపయోగపడుతుంది.
• నేరేడు లో పుష్కలంగా ఉండే ఐరన్ రక్తంలో హిమగ్లోబిన్ ను పెంచుతుంది.
• ఈ పండ్ల గుజ్జు దీర్ఘకాలంగా ఉన్న దగ్గు, ఆస్తమా తగ్గిస్తుంది.
• చర్మం కాంతి వంతంగా తయారవుతుంది.
• నేరేడు పండ్లు తినడం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.
• వర్షా కాలంలో వచ్చే రోగాలు నుండి ఇట్టే కాపాడుతుంది.
• అధిక రక్త పోటు (హై బీపీ) సమస్యను తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.
• నేరేడు పండ్లు తినడం వలన దంత సమస్యలు తగ్గించుకోవచ్చు. దంతాలు, నోటి చిగుళ్ళను ఆరోగ్యంగా ఉంచుతాయి. నోటిలో కురుపులు, నోటి అల్సర్లు తగ్గిస్తుంది. దంత క్షయాన్ని నివారిస్తుంది.
• చెట్టు ఆకులు ఎండబెట్టి, పొడి చేసుకొని కొద్దిగా ఉప్పు కలుపుకొని బ్రేష్ చేస్తే పళ్లు గట్టి పడతాయి.
• మూత్ర సమస్యలు, కిడ్నీలో రాళ్లు ఉన్న వాళ్ళు ఈ నేరేడు పండు తింటే ఉపశమనం కలుగుతుంది.
Also Read: Lipstick Seeds Farming: లిప్‌స్టిక్ తయారీకి వాడే గింజలు ఇవే… ఆంధ్రప్రదేశ్‌లో సాగు