Cotton Marketing: తెలుగు రాష్ట్రాల్లో ఈసారి పత్తి పంట విస్తీర్ణం బాగా పెరిగింది. ఖరీఫ్ ముగిసే సమయంలో కురిసిన ఈ భారీ వర్షాలు దిగుబడుల్ని తీవ్రంగా ప్రభా వితం చేశాయి. తెలంగాణ సహా రాయలసీమ, కోస్తా ప్రాంతాల్లో నాలుగైదు రోజుల పాటు పత్తి చేలల్లో నీరు నిలిచి నాణ్యత దెబ్బతింది. ఫలితంగా ఈ పత్తిని మార్కెట్లకు తీసుకువచ్చిన రైతుకు వ్యాపారులు హీనపక్షం ధరలు అంటగడుతుండటంతో చూసి గుండెలు బాదుకున్నారు. వర్షాల కారణంగా తేమశాతం పెరిగి పత్తి ధరలు దారుణంగా పతనమయ్యాయి.
మెరుగైన పరిస్థితి-
దీని ఫలితంగా నవంబరులో మార్కెట్లకు చేరిన పత్తికి నాణ్యతను బట్టి మంచి ధరలే అందాయి. నవంబరు ఆరంభంలో తీసిన పత్తికి వ్యాపారులు క్వింటాకు రూ.3400 వరకు ధర చెల్లిస్తున్నారు. మద్దతు ధర క్వింటాకు రూ.4320 ఉన్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల రైతుల ఆందోళనల ఫలితంగా ఎట్టకేలకు కేంద్ర పత్తి సంస్థ (సి.సి.ఐ) రంగంలోకి దిగి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. తెలంగాణలో అత్యధిక విస్తీర్ణంలో పత్తి సాగవుతున్న దృష్ట్యా సి.సి.ఐ, మార్కెట్ యార్డులు, జిన్నింగ్ మిల్లులను కొనుగోలు పాయింట్లుగా గుర్తించి మొత్తం 240 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటయ్యాయి. అలానే ఆంధ్రప్రదేశ్లో 98 కి పైగా సిసిఐ కేంద్రాలు ఏర్పడ్డాయి. అక్టోబరులో పతనమైన ధరలు నవంబరులో మెరుగుప డ్డాయి రెండో తీతలో నాణ్యత కలిగిన పత్తి వస్తుండటంతో మద్దతు ధర దక్కు తోంది.
సి.సి.ఐ మార్గదర్శకాలు: సి.సి.ఐ నిబంధనల ప్రకారం తేమ శాతం ఉన్న నాణ్యత కలిగిన పత్తికి మద్దతు ధర చెల్లిస్తామని సి.సి.ఐ అధికారులు ప్రకటించారు. అయితే గతానుభవాల దృష్ట్యా ఈ నిబంధన లకు భయపడి చాలామంది రైతులు వ్యాపారులకే అయినకాడికి అమ్మేసు కుంటున్నారు. కింద పేర్కొన్న మార్గ దర్శకాలు పాటించడం ద్వారా పత్తి రైతులు మంచి ధరలు దక్కించుకోగ లుగుతారు.
Also Read: Organic Manure from Cotton Plant: పత్తి కట్టెతో సేంద్రియ ఎరువు తయారీ.!
పత్తిని తొక్కేటప్పుడు ఎటువంటి పరిస్థితిలోను నీళ్లను చల్లరాదు. ఇలాచేస్తే తేమశాతం పెరిగి రైతుకు దక్కే ధర పడిపోతుంది. పత్తిని గోనె సంచుల్లో తొక్కి మార్కెట్కు తరలిస్తే విక్రయానికి అనుమ తించరు. ఎడ్లబండ్లు లేదా ట్రాక్టర్లు, వ్యాన్లలో గుట్టలుగా పత్తిని తరలించాలి.
తేమశాతాన్ని పరిశీలించిన తర్వాతే తూకం ఆధారంగా సొమ్ముచెల్లిస్తారు. కేంద్రంలో పత్తిని విక్రయించాక రైతులు విధిగా రశీదులు తీసుకోవాలి. ఆన్లైన్లో జరిగే సొమ్ము చెల్లింపుల్లో జాప్యం జరిగితే అధికారులకు ఈ రశీ దులు చూపించవచ్చు.రైతులు పత్తిని విక్రయించాక సి.సి.ఐ అధికారులు దాదాపు వారం రోజుల్లో పల సొమ్మును రైతుల బ్యాంకు ఖాతాలో జమచేస్తారు. కాబట్టి రైతులు తప్పనిసరిగా తమ బ్యాంకు ఖాతా పుస్తకాలు, జిరాక్స్, ఆధార్ కార్డు కాపీలను తీసుకెళ్లాలి.తేమ శాతం 13కు మించితే సి.సి.ఐ పత్తిని కొనుగోలు చేయదు. ఈ మేరకు తేమ శాతం ఆధారంగా ఎంతెంత ధరలు ఇస్తామన్నది సి.సి.ఐ ప్రటించింది. రైతులు ఈ అంశాల పట్ల అవగాహన పెంచుకుంటే వ్యాపారులకు హీన పక్షం ధరలకు పంటను విక్రయించుకోవాల్సిన అవసరం లేదు. ఈ సూచనలు పాటించి పత్తికి మంచి ధరలు పొందే అవకాశముంది.
Also Read: Cotton Quality Checking: ప్రత్తి నాణ్యత పరిశీలించుటకు గమనించవలసిన అంశాలు
Also Watch: