ఉద్యానశోభ

Terrace Cauliflower Farming: డాబాపై కాలీఫ్లవర్ ను పెంచుతున్న రైతులు.!

2
Terrace Cauliflower Farming
Terrace Cauliflower Farming

Terrace Cauliflower Farming: ఇంటి వద్దే మనకు కావాల్సిన తాజా కూరగాయలను ఎప్పటికప్పుడు పండించుకోవచ్చు. ఇంటి పెరటిలోగాని, టెర్రస్ పైనగాని, అపార్ట్మెంట్ వాసులైతే బాల్కనీల్లో గాని తాజాగా కూరగాయ మొక్కలు పెంచుకోవచ్చు. మనలో చాలా మందికికాలీఫ్లవర్ అంటే ఇష్టం కానీ మార్కెట్లో అన్ని సమయాల్లో ఇది మనకు దోరకదు.అలాంటప్పుడు మన ఇళ్లలో కూడా పెంచుకోవచ్చు. సంవత్సరమంతా కాలీఫ్లవర్ కూరను రుచిచూడవచ్చు. దీనిని హైబ్రిడ్ విత్తనాల ద్వారా ఏడాది పొడవునా పెంచవచ్చు. 1522 రకాల విత్తనాలను పొలాల్లో లేదా డాబాపై కుండీలలో వేసి, పండించవచ్చు.

కాలీఫ్లవర్ లో పోషకాలు కూడా అధికంగా ఉంటాయి. మరీ ముఖ్యంగా అధికంగా సీ విటమిన్ తో పాటు కె విటమిన్, పోటాషియం, మాంగనీస్, ప్రొటీన్ లు ఉన్నాయి. అందువల్ల కాలీఫ్లవర్ ను ఆహారంగా తీసుకోవడంతో శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. గుండె సంబంధిత వ్యాధులు, వివిధ రకాల క్యాన్సర్ల ప్రభావాన్ని సైతం కాలీఫ్లవర్ తగ్గిస్తుంది. డాబాపై, కొద్ది ప్రదేశంలో కూడా దీన్ని పండించవచ్చు. కాలీఫ్లవర్‌ మొక్కను నాటితే 55 నుంచి 60 రోజుల్లో ఫ్లవర్‌ తయారవుతుంది.

ప్రస్తుతం మార్కెట్లో మూడు రకాల కాలీఫ్లవర్ విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. అవి స్వల్పకాలిక రకాలు,మధ్యకాలిక రకాలు, దీర్ఘకాలిక రకాలు ఉన్నాయి.వాటిల్లోని మన సాగు చేసే నేలకు అనువైన రకాలను ఎంచుకోవాలి. స్వల్ప కాలిక రకాలు -జులై-ఆగష్టు,మధ్య కాలిక రకాలు -ఆగష్టు -సెప్టెంబర్, దీర్ఘ కాలిక రకాలు -సెప్టెంబర్ – అక్టోబర్. విత్తనాలను మీకు దగ్గరలో ఉన్న నర్సరీల నుండిగాని, ఉద్యానశాఖ నుంచి కొనుగోలు చేసుకోవాలి.

Also Read: Ag.BSc Career Opportunities: అగ్రికల్చర్ బీఎస్సీ కెరీర్ అవకాశాలు.!

Cauliflower

Cauliflower

కాలిఫ్లవర్ నారు పెంచి నాటుకోవాలి. నారు వయస్సు 25 – 30 రోజుల మద్య మొక్కలను నాటుకోవడానికి సిద్ధం చేసుకోవాలి. మొక్కలను నాటుకునేప్పుడు మొక్కల మద్య దూరం 45 సెం. మీ. దూరాలు ఉండేలా చూసుకోవాలి. క్యాలిఫ్లవర్ పెరుగుదల ఉష్ణోగ్రత మరియు కాంతి సమయం పై ఆధారపడి ఉంటాయి. కావున సరైన సమయానికి సరైన రకం ఎన్నుకోవడం చాలా ముఖ్యం. సాధారణంగా స్వల్ప కాలిక రకాలు చిన్నావిగా పసుపు రంగు గల ఫ్లవర్ ను, మధ్యస్థ రకాలు పెద్ద ఫ్లవర్ ను మాములు తెలుపు రంగులో మరియు దీర్ఘ కాలిక రకాలు దిట్టంగా పాల తెలుపు గల ఫ్లవర్ ను ఇస్తాయి.

క్యాలీఫ్లవర్ కుసేంద్రియ పదార్థం సమృద్ధిగా ఉండే మట్టి అవసరం అవుతుంది. 6.0 నుంచి7.0 మధ్య pH పరిధిలో బాగా పెరుగుతుంది.మట్టి బాగా ఎండిపోవాలి, కానీ క్యాలీఫ్లవర్ కు బటన్ లు నిరోధించడానికి స్థిరమైన తేమ అవసరం అవుతుంది. క్యాలిఫ్లవర్ పువ్వు తెల్లగా మరియు మచ్చలు లేకుండా నాణ్యంగా ఉండాలంటే పెరుగుతున్న పువ్వులోనికి సూర్య రశ్మి చేరకుండాజాగ్రత్త పడాలి.దీనికి గాను పువ్వు చుట్టు ఉన్న ఆకులలో చివరి వరుస ఆకులను కప్పుతూలేదా రబ్బరు బాండ్ తో కట్టాలి. పువ్వు సరైన పరిమాణం అయినా తర్వాత కోయాలి.క్యాలీఫ్లవర్ ని గది ఉష్ణోగ్రత దాదాపు 4-5 రోజులు నిల్వ చేయవచ్చు.

Also Read: Jasmine Pruning: మల్లెలో కొమ్మ కత్తిరింపులు, యాజమాన్య పద్దతులు.!

Leave Your Comments

Ag.BSc Career Opportunities: అగ్రికల్చర్ బీఎస్సీ కెరీర్ అవకాశాలు.!

Previous article

Heavy Rains Damage Crops: పంటలపై అధిక వర్షాల ప్రభావం – నష్ట నివారణకు యాజమాన్యం

Next article

You may also like