ఉద్యానశోభ

Jafra Cultivation: ఈ చెట్లు పెంచడం వల్ల రైతులకి మంచి లాభాలు..

2
Jafra Cultivation
Jafra Cultivation

Jafra Cultivation: రైతులు సాధార పంటలు పండించడం తగ్గించి, వాణిజ్య పంట వైపు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. వాణిజ్య పంటలకి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఈ మధ్య కాలంలో అమెరికా ప్రభుత్వం ఆహార పదార్థాల్లో రంగులు వాడకూడదు అని ఆదేశాలు ఇచ్చారు. దీనిని అనువుగా తీసుకొని మన దేశంలోని రైతులు జాఫ్రా చెట్లని పెంచడం మొదలు పెట్టారు. గద్వాల్ జిల్లా భీమ్ రెడ్డి రైతులు ఈ చెట్లని పెంతున్నారు.

ఈ చెట్ల గింజలు లిప్ స్టిక్, మేక్ అప్ వస్తువులో, ఆహార రంగుల తయారు చేయడానికి వాడుతారు. ఈ మొక్కలు మందుల తయారీలో వాడుతారు. ఈ మొక్క షుగర్ వ్యాధి, కాన్సర్ వ్యాధి చికిత్సలో వాడుతారు. దీని వల్ల మన దేశంతో పాటు విదేశాల్లో కూడా మంచి డిమాండ్ ఉంది.

Jafra Cultivation

Jafra Cultivation

Also Read: Long Special Cultivator: వరి పొలం దున్నడానికి కొత్త నాగలి…

ఈ చెట్టు ఎలాంటి వాతావరణంలో అయిన పెరుగుతుంది. ఎరువులు, పురుగుల మందులు కూడా అవసరం ఉండదు. ఈ చెట్లు ఎక్కువగా అడవుల్లో పెరిగేవి. ఆవు పేడని ఎరువుగా వాడితే మంచి దిగుబడి వస్తుంది. ఈ చెట్లకి ఎలాంటి చీడ పురుగులు పట్టవు. వీటిని పెంచుకోవడం కూడా చాలా సులువు.

భీమ్ రెడ్డి 7 ఎకరాలో ఈ జాఫ్రా చెట్లని పెంచుతున్నారు. ఒక మొక్క నాటిన సంవత్సరం తర్వాత కాపు వస్తుంది. ఒక ఎకరంలో 450 చెట్ల వరకు పెంచుకోవచ్చు. ఈ ఆవు పేడని ఎరువుగా వాడటం వల్ల ప్రతి సంవత్సరం దిగుబడి పెరుగుతుంది. ఒక ఎకరం నుంచి 10 టన్నుల వరకు దిగుబడి వస్తుంది.

Jafra Seeds

Jafra Seeds

ఈ గింజల నుంచి తీసిన నూనె విటమిన్ ఈ మందులో వాడుతారు. ఈ మొక్కలు పెంచడానికి ఎటువంటి పెట్టుబడి అవసరం ఉండదు. ఈ గింజల నుంచి హనుమాన్ దేవుడి సింధూరం తయారు చేస్తారు. దీని వల్ల కూడా మార్కెట్లో ఈ పంటకి మంచి డిమాండ్ ఉంది. రైతులు కూడా ఈ చెట్లని పెంచడం కూడా చాలా లాభాలు ఉన్నాయి, ఎలాంటి పెట్టుబడి పెట్టకుండ.

Also Read: Anjeer fruit Drying Process: అంజీర పండ్లని పాలీ హౌస్లో ఎలా ఆరపెట్టుకోవాలి.!

Leave Your Comments

Long Special Cultivator: వరి పొలం దున్నడానికి కొత్త నాగలి…

Previous article

Onion Price: రాబోయే రోజులో ఉల్లిపాయల ధర కూడా టమాటా ధర బాటలోనే సాగుతుందా… ?

Next article

You may also like