ఉద్యానశోభ

Tunnel Farming: టన్నెల్ ఫార్మింగ్ తో రైతులకి అదిరే రాబడి.!

0

Tunnel Farming: ఈ మధ్య కాలంలో వ్యవసాయం కూడా బాగా అభివృద్ధి చెందుతోంది. వ్యవసాయం లో కూడా వివిధ రకాల టెక్నిక్స్ ని వాడుతున్నారు. అయితే వీటిలో టన్నెల్ ఫార్మింగ్ అనేది ఒక కొత్త రకం. అయితే అసలు దీనిని ఎలా ఫాలో అవ్వాలి..?, పంటల్ని ఎలా పండిస్తారు..?, ఏయే పంటల్ని ఈ పద్దతి ద్వారా పండించచ్చు అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం.

Tunnel Farming

కొన్ని రకాల పంటలు పండించడానికి ఈ పద్ధతిని ఉపయోగిస్తారు. దీనితో బాగా పంటలు పండుతాయి. ఎప్పుడైనా సరే ఈ పంటల్ని వేయొచ్చు. ఆలస్యంగా కానీ త్వరగా కానీ విత్తనాలు నాటి పంటలు పండించవచ్చు. వేసవిలో పండే పంటలు కూడా చలికాలంలో పండించడానికి అవుతుంది. ఆర్టిఫిషియల్ హీట్ పద్ధతి ఉపయోగించి ఈ ప్రాసెస్ లో పంటల్ని పండించవచ్చు.

Also Read: నిమ్మలో బోరాన్ లోపం – నివారణ
అయితే కొన్ని రకాల పంటలు మనం కేవలం వాటి యొక్క సీజన్లో మాత్రమే పండించడానికి అవుతుంది. కానీ ఈ పద్ధతి ఉపయోగిస్తే ఎప్పుడైనా ఏ పంటలైన పండించవచ్చు. అయితే పంటల్ని పండించాలంటే మట్టి యొక్క పీహెచ్ వాల్యూ ఆరు నుండి ఏడు ఉండాలి.

ఆర్గానిక్ కంటెంట్ అయిదు శాతం నుంచి 10 శాతం ఉండాలి. నీరు అందుబాటులో ఉండే ప్రాంతంలో పంటలు పండించవచ్చు అలానే జంతువుల నుంచి దూరంగా ఉండాలి. స్థలంలో కేవలం తక్కువ చెట్లు మాత్రమే చుట్టుపక్కల ఉండాలి. అయితే దీనిని రైతు యొక్క బడ్జెట్ ని బట్టి ఫాలో అవ్వొచ్చు యు షేప్, వి షేప్ లో వీటిని తయారు చెయ్యచ్చు.

టన్నెల్స్ లో రకాలు:

  • హై టన్నెల్.
  • మీడియం & వాకింగ్ టన్నెల్.
  • లో టన్నెల్

ఈ ఫార్మింగ్ పద్ధతి ద్వారా కీరదోస, టమాటా క్యాప్సికం, కాకరకాయ మొదలైన కూరగాయలు పండించవచ్చు. అలాగే పుచ్చకాయ, స్ట్రాబెరీ లాంటి పండ్లని పండించవచ్చు. ఈ పద్ధతి ప్రకారం ఈ కూరగాయలను ఈ పండ్లని మనం బాగా పండించడానికి అవుతుంది. విత్తనాలని తెచ్చుకుని వాటిని నాటితే జాగ్రత్తగా ఈ పంటలు పండించవచ్చు.

Also Read: మామిడిలో పూత, పిందె సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు..

Leave Your Comments

Mulching: వ్యవసాయంలో మల్చింగ్ యొక్క ప్రాముఖ్యత.!

Previous article

Rabbit Farming: కుందేళ్ళ పెంపకంతో ప్రతి నెల రూ 80 వేల సంపాదన.!

Next article

You may also like