
కూరగాయలలో ఉత్పత్తి పెంచడం సస్యరక్షణ మరియు తెగుళ్ల నివారణ కోసం మోతాదుకు మించి అధిక పరిమాణంలో రసాయన పురుగు మరియు తెగులు కలుపు మందులు ఉపయోగించడం వల్ల, ఈ హానికరమైన రసాయన ఎరువులు, పురుగుమందులు మిగులు అవశేషాలుగా ఉండిపోయే అవకాశముంది. ఇవి మన శరీరానికి తక్షణ మరియు దీర్ఘకాలికంగా చాల తీవ్ర ఆరోగ్య సమస్యలను కలిగించే అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రభావాలు మన జీవనశైలిని దెబ్బతీయడమే కాకుండా, శారీరక మరియు మానసిక ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావాలను చూపుతాయి.
1. నరాల వ్యవస్థపై ప్రభావం:
కూరగాయలలో పురుగుమందుల అవశేషాలు నరాల వ్యవస్థ పనితీరును దెబ్బతీస్తాయి.
ఇంద్రియ సమస్యలు: పురుగుమందుల అవశేషాలు వున్న ఆహారం తినడం వలన తలనొప్పులు, వాంతులు, మరియు మెదడుకు సంబంధించిన సమస్యలు వస్తాయి.
మంచి నిద్ర లోపం: నరాల పై ప్రభావం పడటం వలన ఆందోళన మరియు నిద్రలేమి సమస్యలు తలెత్తుతాయి.
మెదడు అభివృద్ధి: ముఖ్యంగా చిన్న పిల్లలలో మెదడు అభివృద్ధికి ఆటంకం కలిగించవచ్చు.
2. గుండెజబ్బులు మరియు రక్తప్రసరణలో లోపాలు
కూరగాయలలో ని రసాయన అవశేషాలు రక్తప్రసరణ వ్యవస్థ పై ప్రతికూల ప్రభావం చూపుతాయి.
రక్తంలో విష పదార్థాలు మోతాదు పెరుగుదల: ఇది గుండెపోటు మరియు హృదయ సంబంధిత సమస్యల కు దారి తీస్తుంది..
రక్తపోటు సమస్యలు: రసాయన అవశేషాల వల్ల రక్తపోటు అస్తవ్యస్తంగా మారి, దీర్ఘకాలిక సమస్యలకు దారి తీస్తుంది.
3. క్యాన్సర్ ముప్పు
కూరగాయలలో అవశేషాలుగా మిగిలిపోయిన పురుగుమందులు మరియు కలుపు మందులు క్యాన్సర్‌ను కలిగించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
కాలేయ క్యాన్సర్: అవశేషాలు శరీరంలో పేరుకుపోవడం వలన కాలేయంపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
పొట్ట క్యాన్సర్: క్రమంగా హానికరమైన రసాయనాలు శరీర కణాలను దెబ్బతీసి క్యాన్సర్ ముప్పును పెంచుతాయి..
4. గర్భిణీ స్త్రీలు మరియు గర్భస్థ శిశువులపై ప్రభావం
గర్భిణీ స్త్రీలు కూరగాయలలోని రసాయన అవశేషాలను తినడం వలన శిశువుల అభివృద్ధి పై ప్రతికూల ప్రభావంలు ఉంటాయి.
జనన లోపాలు: శిశువులో జనన లోపాలు, మానసిక అభివృద్ధి లోపాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
రోగ నిరోధక శక్తి: శిశువు జననానంతరం బలహీన రోగ నిరోధక వ్యవస్థ తో పుట్టే ప్రమాదం ఉంది.
5. అలర్జీలు మరియు శ్వాసకోశ సమస్యలు
కూరగాయలలో ని రసాయన అవశేషాలు శ్వాస సంబంధిత సమస్యలను మరియు అలర్జీలను కలిగించే అవకాశం ఎక్కువగా ఉంటుంది..
శ్వాసకోశ సమస్యలు: అవశేషాలు శ్వాసకోశాల్లో చేరి కఫం మరియు ఇతర సమస్యలు తలెత్తిస్తాయి.
చర్మ అలర్జీలు: అవశేషాల ద్వారా శరీరంపై చర్మ సమస్యలు కలుగుతాయి.
ఆస్తమా: శ్వాస సంబంధిత సమస్యలు దీర్ఘకాలిక ఆస్తమా సమస్యలకు దారితీస్తాయి.
6. జీర్ణ వ్యవస్థపై ప్రభావం:
కూరగాయలలోని రసాయన అవశేషాలు జీర్ణ సంబంధిత సమస్యలను కలిగిస్తుంది.
అసిడిటి: అవశేషాలు శరీరంలో అసిడిటిను పెంచి, అజీర్ణం మరియు అకలి తగ్గడం, తదితర సమస్యలకు దారి తీస్తాయి.
కడుపు సమస్యలు: ఇవి కడుపు ఉబ్బరం, విరేచనాలు, మరియు ఇతర జీర్ణ సంబంధ సమస్యలను కలిగిస్తాయి. అదే విధంగా రసాయనాలు శరీరంలో మంచి బ్యాక్టీరియాల్ని తగ్గించి, జీర్ణక్రియలో లోపాలను సృష్టిస్తాయి.
7. శారీరక బలహీనత:
రసాయన అవశేషాల వలన శరీరంలో పోషకాల పునశ్చరణకు ఆటంకం కలుగుతుంది.
శరీర బలహీనత: శక్తి తగ్గడం, మరియు అలసట తరచుగా ఎదురవుతుంది.
కండరాల నొప్పులు: రసాయన అవశేషాల ప్రభావం కండరాల పనితీరును దెబ్బతీస్తుంది..
8. నరాలవ్యవస్థ మరియు హార్మోన్ల అసమతుల్యత
పురుగుమందుల అవశేషాలు శరీరంలోని హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతుంది.
థైరాయిడ్ సమస్యలు: హార్మోన్ ఉత్పత్తిలో లోపాలు ఎర్పడే అవకాశాలు ఉంటాయి.
నరాల కుదింపు సమస్యలు: ఇది శరీర నరాల తిమ్మిర్లు మరియు కంపింపులకు దారితీస్తుంది. అదే విధంగా మెటబాలిజం సంబంధించిన సమస్యలకు దారితీస్తాయి
ముగింపు
కూరగాయలలో హానికరమైన రసాయన అవశేషాలు శారీరక, మానసిక, మరియు జీవన నాణ్యత ప్రామాణాల పై తీవ్రమైన ప్రతికూల ప్రభావాలు చూపుతాయి. ఈ అవశేషాలను నివారించేందుకు శుభ్రతా పద్ధతులు పాటించడం, సేంద్రియ ఆహారాన్ని ప్రోత్సహించడం, మరియు కూరగాయలను సరైన పద్ధతిలో శుభ్రపరచడం కీలకమైనవి. మన ఆరోగ్యం, ఈ మార్గాలను అనుసరించడం మీద ఆధారపడి ఉంది. మార్కెట్ నుండి తెచ్చినటువంటి కూరగాయలను మరియు పండ్ల ను ఉప్పు కలిపిన ద్రావ ణం లేదా వెనిగర్ కలిపిన నీటిలో లేదా తీనే వేసిన నీటిలో 5-10 నాన పెట్టడం ద్వారా పురుగుమందుల అవశేషాలను కొంతవరకు తగ్గించవచ్చు