ఉద్యానశోభ

కోతల అనంతరం పొలాన్ని కాల్చడం వల్ల కలిగే ప్రమాదాలు..

0

యాసంగి వరి కోతలు ముగిసి, ధాన్యం విక్రయం చివరి దశకు వచ్చిన నేపథ్యంలో రైతులు వానాకాలం పంటకు పొలాన్ని సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా పొలాల్లోని పశుగ్రాసాన్ని ఇతర వ్యర్థాలను కాల్చివేస్తున్నారు. ఈ పరిణామం భూభౌతిక పరిస్థితితో పాటు రైతులకు నష్టాన్ని కలిగిస్తోంది. పొలాల్లోని గడ్డి తొలగింపు కోసం పెట్టే నిప్పు పెద్దఎత్తున వ్యాపిస్తూ అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. మంటలకు భానుడి ప్రచండ వేడి తోడై ఎండు గడ్డితో పాటు పచ్చని చెట్లూ కాలిపోతున్నాయి. నిండు వేసవి కావడంతో మంటలు అదుపులోకి రావడం లేదు. రోహిణి కార్తె ప్రవేశంతో కొద్ది రోజుల్లో వరి నార్లు పోసుకునేందుకు చాలా మంది రైతులు సమాయత్తమవుతున్నారు. ఇందులో భాగంగా యాసంగిలో వరి కోతల తర్వాత మిగిలిన పశుగ్రాసానికి నిప్పు పెడుతున్నారు. పొలాల నుంచి వేసిన విద్యుత్తు తీగలూ నిప్పు రాజుకునేందుకు కారణమవుతున్నాయి. తద్వారా మిగతా రైతులకు నష్టం జరగడంతో పాటు భూసారం దెబ్బతింటోంది.
పొలాల్లోని గడ్డిని కాలిస్తే వేసిన పంట ఆరోగ్యంగా పెరిగేందుకు అవసరమైన సేంద్రియ కర్బనం, నత్రజని, సూక్ష్మ పోషకాలు పూర్తిగా నశిస్తాయి.
భూభౌతిక స్థితి దెబ్బతినడంతో పంట ఎదగదు.
వరి గడ్డిని కాల్చివేస్తే పొలానికి నష్టం కలిగించే క్రిములు, క్రిమికీటకాలు కాలిపోవడంతో పాటు కలుపు తగ్గుతుందనేది రైతుల ఆలోచన. కానీ కాల్చివేయడం ద్వారా ప్రధాన పంటకు నష్టం జరుగుతుంది.
నిప్పు పెట్టడం ద్వారా వానపాములు, మిత్ర పురుగులు చనిపోతాయి. భూసారం దెబ్బతింటుంది.
పశుగ్రాసం కాల్చడం ద్వారా వాతావరణంలోకి కార్బన్ మోనాక్సయిడ్ విడుదలవుతుంది. ఇది పర్యావరణాన్ని దెబ్బతీస్తుంది. ఓజోన్ పొరకు నష్టం కలుగుతుంది.
సూక్ష్మ పోషకాలు అందక పైరు ఎదగదు. దిగుబడి గణనీయంగా తగ్గుతుంది.
నేలకూ.. ఆరోగ్యానికి హానికరమే..

 

Leave Your Comments

కొమ్మ కత్తిరిస్తే గుత్తులు గుత్తులుగా కాయలు..

Previous article

బ్లూ టీ తాగడం వలన కలిగే ప్రయోజనాలు..

Next article

You may also like