Cut Flowers Farming: ప్రకృతిలో పువ్వులు అనేవి అత్యంత అద్భుతమైన అందమైన. పువ్వులు సంతోషకరమైన భావోద్వేగాలను పెంపొందించడం ద్వారా మన మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.. పువ్వులు మనస్సుకు ఒత్తిడి నుంచి మంచి ఉపశమనం కల్గిస్తాయి. రైతులు పువ్వులను రెండు రకాలుగా కోస్తారు. మొదటి రకం విడిపువ్వులు, రెండవ రకం కట్ ఫ్లవర్స్. విడి పువ్వులను పూజలకు, పూలజడ కు, పూమాల తయారీలో ఉపయోగిస్తారు. కాడలతో పాటుగా కోసే పువ్వులను కట్‌ఫ్లవర్స్ అంటారు. శుభకార్యాలలో, అలంకరణ బోకే రూపంలోను అందిస్తారు. మనం ఈరోజు కట్‌ఫ్లవర్స్ కోత సమయంలో కోసిన తరువాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
సహజంగా లభించే పదార్థాలు
పువ్వులను కొయ్యడం అనేది ఉదయం లేదా సాయంత్ర సమయాల్లో మాత్రమే చెయ్యాలి. కటింగ్ టూల్స్ అనేది చాలా పదునైనవై ఉండాలి, అంతేకాకుండా క్రమం తప్పకుండా శుభ్రపరచుకోవాలి. కోసిన పూలను శుభ్రమైన, నీడ ఉన్న ప్రదేశాలలో ఉంచుకోవాలి. కాడలపై ఉన్న ఆకులను తొలగిస్తూ ఉండాలి. కృత్రిమంగా పూలకి నీరు తో పాటు, జీవన ప్రక్రియ కు కావలసిన పదార్థాలను అందించడం ద్వారా మరికొన్ని రోజులు పూలు అనేవి తాజాగా ఉంటాయి.వ్యాపారులు తాజాగా ఉంచడం కోసం ఎన్నో రకాల రసాయనాలను వాడతారు. అలా కాకుండా మనకు సహజంగా లభించే పదార్థాలను ఉపయోగించడం వలన పూలను తాజాగా ఉంచుకోవాలి.
Also Read: Ridge Gourd Farming: బీర సాగులో అద్భుతాలు.. లక్షల ఆదాయం.!
కట్‌ఫ్లవర్ తాజాదనాన్ని పెంచే కొన్ని సహజ పదార్థాలు
కట్ పువ్వులను తాజాగా ఉంచడానికి చక్కెరను ఉపయోగిస్తారు. పూలు కత్తిరించి ఉంచిన నీటిలో చక్కెరను కలపడం వలన మరికొన్ని రోజులు పూలు తాజాగా ఉంటాయి. గులాబి మరియు కార్నేషన్ లాంటి పూలు ఉంచిన నీటిలో చక్కెర వాడటం వలన పూల యొక్క రంగు అనేది మరింత మెరుగుపరుస్తుంది. మరియు స్ప్రైట్, సెవన్ అప్ లాంటి కూల్‌డ్రింక్స్ కూడా పూల తాజాదనాన్ని పెంచడానికి ఉపయోగిస్తారు. పూలను ఉంచిన నీటిలో జీవులను నియంత్రించటం చాలా ముఖ్యం. స్ప్రైట్, సెవన్ అప్, కార్బొనేటెడ్ మరియు ఆమ్లీకృత నీరు కావడం వల్ల సూక్ష్మజీవుల పెరుగుదలను నియంత్రిస్తాయి. ఇలా సులువుగా మనకి అందుబాటులో ఉండే వాటి ద్వారా పూలను మరిన్ని రోజులు తాజాగా ఉంచవచ్చు.
పూలు కత్తిరించి ఉంచిన నీటిలో బ్లీచింగ్ పౌడర్, ఆస్పిరిన్, కర్పూరం వాడడం వలన కట్‌పూలను తాజాగా ఉంచవచ్చు. పుల్లని నారింజ సారం, యాపిల్ ఎక్స్ ట్రాక్ట్ కట్ ఫ్లవర్స్ యొక్క తాజాదనాన్ని మెరుగుపరచడానికి కూడా ఉపయోగిస్తారు. ఈవిధంగా సహజంగా మరియు సులువుగా అందుబాటులో ఉండే పదార్థాలను ఉపయోగిస్తూ కట్ ఫ్లవర్స్‌ని తక్కువ ఖర్చుతో మరికొన్ని రోజులు తాజాగా ఉంచవచ్చు.
Also Read: Minister Niranjan Reddy: రైతుల శ్రేయస్సే ధ్యేయంగా పనిచేస్తున్నాం – మంత్రి నిరంజన్ రెడ్డి