Watermelon Cultivation: పుచ్చ సాగు రైతులకు సిరులు కురిపిస్తుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం వచ్చేలా చేస్తుంది. రైతులు ఎక్కువగా ఈ పంటలపై ఆసక్తి కనబరుస్తున్నారు. అంతేకాకుండా వాతావరణం అనుకూలిస్తే ఎకరానికి రూ. 50 నుంచి 60 వేల వరకు ఆదాయం వస్తుందని రైతులు అంటున్నారు. సుమారు ఎకరానికి 15 వేల నుంచి 20 వేల వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని 10 నుంచి 15 టన్నుల వరకు దిగుబడి వస్తుందని మార్కెట్లో టన్ను రూ 3 నుంచి 5 వేల వరకు ధర పలుకుతుందని రైతులు తెలియజేస్తున్నారు. నీటి తడులు ఎక్కువగా ఉంటే కాయల సైజు పెద్దగా ఉంటుందని మిగతా వాణిజ్య పంటలతో పోల్చుకుంటే పుచ్చ సాగుకు ఖర్చు చాలా తక్కువ అని రైతు అంటున్నారు. మారుతున్న సాంకేతికత అభివృద్ధితో గందర్‌బల్ జిల్లాలోని రైతులు పుచ్చకాయ పంటను పండించడం ప్రారంభించారు మరియు పంటలు ఇతర రైతులను ఆకర్షించాయి.
ప్రయోగాత్మకంగా పుచ్చకాయను సాగు
ద్రాక్ష (Grapes) మరియు చెర్రీ రకాలను పండించడానికి ప్రసిద్ధి చెందిన సెంట్రల్ కాశ్మీర్‌లోని గందర్‌బల్ జిల్లా ఇప్పుడు మరొక రకం అయినా పుచ్చకాయలను పండించడం ప్రారంభించారు. అహన్ మరియు బట్వినా గ్రామాలతో సహా బ్లాక్ వకురాలోని వివిధ ప్రాంతాలలో బంజరు భూముల్లో ఇప్పుడు పుచ్చకాయలను పండిస్తున్నారు. సెంట్రల్ కాశ్మీర్‌లోని గండేర్‌బల్ జిల్లాలో సాగు చేయడం ప్రారంభించిన రైతులు మంచి రాబడిని ఆర్జిస్తున్నారు. అంతేకాకుండా కొన్ని ప్రాంతాల్లో పుచ్చకాయ పండ్లను పండించే ధోరణి ఇక్కడ ఊపందుకుంటుంది. అయితే ప్రయోగాత్మకంగా పుచ్చకాయను సాగు చేశామని, ఇప్పటివరకు వచ్చిన ఆదాయంతో మంచి లాభాలు పోందుతున్నామని అంటున్నారు.
Also Read: రైతు భరోసా పథకానికి కొత్త దరఖాస్తుల స్వీకరణ.!
గత సంవత్సరం నష్టాలను చవిచూసిన మేను పుచ్చసాగుతో మంచి ఆదాయాన్ని ఆశిస్తున్నామని అన్నారు. కాశ్మీర్ లోయలోని ప్రజలు పుచ్చకాయలను ఇష్టపడతారని, డిమాండ్ బాగా ఉంటుందని, ప్రజలు స్థానికంగా పండించే పుచ్చకాయలను ఇష్టపడతారని మరో రైతు తెలిపారు. పుచ్చకాయ సాగుకు సంబంధించి ఉద్యాన శాఖ, వ్యవసాయ శాఖ మరింత సమాచారం అందజేస్తే రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుందని, అలాగే రైతుల ఆదాయాన్ని పెంచవచ్చని అంటున్నారు.
పుచ్చను పలు పంటల్లో అంతర పంటగా కూడా సాగు చేయొచ్చు. మేలైన యాజమాన్య పద్ధతులను పాటిస్తే.. పుచ్చకాయలు మంచిగా తయారవుతాయి. వీటికి మార్కెట్లలో మంచి ధర పలుకుతుంది. దీంతో రైతులు లాభాలను పొందొచ్చు.
Also Read: రైతులకు ప్రతినిత్యం ఆదాయాన్నిచ్చే పంటలు తప్పనిసరి.!