ఉద్యానశోభ

తూజ మొక్కల సాగు విధానం…

0

తూజ మొక్కలు: తూజ గుబురుగా పెరిగే బహువార్షిక మొక్క. వ్యాపారపరంగా పెంచటానికి తూజ బరియన్ టాలిస్, తూజ ఆక్సిడెంటాలిస్ మాత్రమే ఉపయోగపడుతాయి.  

నాటడం: చిన్న చిన్న మొక్కలను ఎన్నుకొని నాటుకుంటే మొక్కలు మొదటి నుంచి గుబురుగా పెరుగుతాయి. తూజ మొక్కలను జూన్ నుంచి జనవరి వరకు నాటవచ్చు.  

ఎరువులు: మొక్క మొదలు దగ్గర ప్రతి 3-4 నెలలకోసారి తవ్వి పశువుల ఎరువు 2 గంపలు, 19-19-19 కాంప్లెక్స్ ఎరువు 100-150 గ్రా. ఏడాదికి 3 సార్లు వేయాలి. అవసరాన్ని బట్టి నీరు పెట్టాలి.  

కోత: నాటిన ఏడాది తర్వాత ఆకులను కొమ్మలుగా కత్తిరించి మార్కెట్ కు పంపాలి. ఒక ఏడాదికి బాగా పెరిగిన చెట్టు నుంచి 25-30 కిలోల ఆకులు వస్తాయి.  

 

Leave Your Comments

తోటకూర ఆరోగ్య ప్రయోజనాలు..

Previous article

వేరుశనగలో చీడ పీడలు-నివారణ

Next article

You may also like