ఉద్యానశోభ

Jamun Fruits: ఈ పండ్ల సాగుతో రైతులకు మంచి లాభాలు.!

0
Jamun
Jamun

Jamun Fruits: ఎండాకాలంలో మామిడి పండ్ల కోసం ఎదురు చూస్తూ ఉంటాము. ఎండాకాలం పూర్తి కాగానే వర్ష కాలం మొదటిలో నేరేడు పండ్లు వస్తాయి. నేరేడు పండ్లు సీసానాల్గే వస్తాయి. ఈ పండ్లని అందరూ ఇష్టపడుతారు. నేరేడు పండ్లలో ఔషద గుణాలు, యాంటీ ఆక్సిడెంట్ కలిగి ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్ ఉండటం వల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

ఈ నేరేడు పండ్లలో ఐరన్, కాల్షియం, పొటాషియం, విటమిన్ సి ఎక్కువగా ఉంటాయి. ఐరన్, కాల్షియం శాతం ఎక్కువ ఉండటం వల్ల శరీరంలోని ఎముకలు గట్టిపడుతాయి. నెరేడు పండ్లు మామిడి, జామ పండ్ల కంటే ఖరీదు ఎక్కువ. ఈ నేరేడు పండ్లకి ఖరీదు, డిమాండ్ ఎక్కువ ఉండటంతో రైతులందరూ ఈ పండ్లని పండిస్తే మంచి ఆదాయం పొందవచ్చు. ప్రభుత్వం కూడా నేరేడు చెట్లని పెంచడానికి రైతులకి సబ్సిడీ అందిస్తుంది.

Also Read: Bok Choy: బోక్ చోయ్.. పంట తెలుసా?

Jamun Fruits

Jamun fruit health benefits

ఈ మొక్కలు 4-5 సంవత్సరాల తర్వాత కాపు వస్తాయి. మొత్తం కాపు రావడానికి 8 సంవత్సరాల సమయం పడుతుంది. 8 సంవత్సరాల తరువాత ఎక్కువ దిగుబడి వస్తుంది. ఒక చెట్టుకి దాదాపు 80-90 కిలోల నేరేడు పండ్లు వస్తాయి. ఒక ఎకరంలో 100-125 నేరేడు మొక్కలు నాటుకోవచ్చు. ఒక ఎకరంలో 10000 కిలోల దిగుబడి రావచ్చు. నేరేడు పండ్లు కిలో 140 రూపాయలకి అమ్ముతున్నారు. మార్కెట్లో మంచి రేట్, డిమాండ్ ఉన్న పండ్లు, రైతులు ఈ నేరేడు పండ్లని సాగుచేస్తే మంచి లాభాలు పొందుతారు.

Also Read: Liquid Fertilizer Vermiwash: ద్రవరూప ఎరువు వర్మివాష్ తయారీ విధానం – తీసుకోవాల్సిన జాగ్రత్తలు

Leave Your Comments

Pulses Rate: ఉత్పత్తి తగ్గడంతో కొండెక్కుతున్న కంది పప్పు ధర.!

Previous article

Drone Pilot Training: వ్యవసాయానికి ప్రత్యేకమైన డ్రోన్స్ తయారీ.!

Next article

You may also like