Chekurmanis Plant: విదేశీ పంటలను కూడా భారతదేశంలో రైతులు విస్తారంగా సాగుచేస్తున్నారు. లాభాలు వచ్చే ఏపంటైనా సరే రైతులు తమకున్న కమతంలోనే సాగు చేస్తు దిగుబడులను పొందుతు మార్కెట్ లో లాభాలను చవిచూస్తున్నారు. ఇండోనేషియా, సింగపూర్ దేశాలకే పరిమితమైన చెకుర్మనీస్, ప్రస్తుతం భారత్‌లో కూడా సాగు చేస్తున్నారు. దీన్ని శాశ్వత ఆకు కూరగా పిలుస్తారు. ఇది అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకుని అధిక దిగుబడినిస్తుంది. దీనిలో అనేక పోషకాలు ఉండటంతో ఔషధాల తయారీతో కూడా దీనిని వాడుతున్నారు. ఈపంటను కేరళలలో పెంచుతున్నారు. దీనిని పెరటి మొక్కగా కూడా పెంచుతారు. కంటి సమస్యల నివారణకు, జ్వరం తగ్గడానికి దీనిని ఎక్కువగా వాడుతారు.
ఒక్కో మొక్క రూ.25
చెకుర్మనీస్ మొక్క విదేశాలలో బాగా విస్తరించింది. అంతేకాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని దేశ విదేశాలకు ఈమొక్క బాగా పాకింది. దీనిలో విటమిన్ a ఎక్కువగా ఉంటటం వల్లన ఇది కంటి సమస్యలను నివారిస్తోంది. దీని ఆకులతో పశువుల మేతగాను, కోళ్లకు మేతగాను దీనిని వాడుతున్నారు. అంతేకాకుండా సలాడ్, సూప్ గా వాడుతున్నారు. చెకుర్మనీష్ మొక్క అన్ని రకాల నేలల్లో పెరుగుతుంది. ఇది కొంతవరకు నీడను తట్టుకోగలదు. కాండం కటింగ్ ద్వారా మరియు తాజా విత్తనాల ద్వారా కూడా వేస్తారు.
Also Read: Crop Protection In Agriculture: వ్యవసాయంలో రక్షక పంటల ప్రాముఖ్యత.!
ఈమొక్కలు వెంకటరామన్నగూడెం, హార్టీకల్చర్ రీసెర్చ్ స్టేషన్, డా. వై.యస్.ఆర్. హార్టీకల్చర్ యూనివర్సిటీలో అందుబాటులో ఉన్నాయి. ఒక్కో మొక్కను రూ. 25/-కు విక్రయిస్తున్నారు. వరుస నుండి వరస దూరం 30 సెం.మీ. మరియు మొక్క నుండి మొక్క మధ్య దూరం 10-15 సెం.మీ ఉండాలి. ఒక మొక్కకు వార్షిక దిగుబడి 3 కిలోల ఆకులు మరియు హెక్టారుకు 30 టన్నుల ఆకులను సంవత్సరంలో పండించవచ్చు.