Capsicum Cultivation in Polyhouse: ప్రజల ఆహార అభిరుచులకు అనుగుణంగా కూరగాయల పంటలను.. ముఖ్యంగా నిల్వ ఉండే కూరగాయలను పంటగా ఎంచుకోవడం ద్వార ఉత్తమ ఫలితాలను పొందవచ్చు. క్యాప్సికం ధర మార్కెట్లో ఇతర కూరగాయల కంటే మెరుగ్గా ఉంది. దీంతో రైతులు బాగా సంపాదించవచ్చు. రైతులు ఆర్థికంగా లాభాలను అందుకోవాలంటే కాలానికి, మార్కెట్ కు తగ్గట్టుగా వ్యవసాయాన్ని చేయాల్సి ఉంటుంది. కాప్సికం సాగుతో మంచి ఆదాయం వస్తుంది అంటున్నారు వ్యవసాయ నిపుణులు.
దీనిలో కారం తక్కువగా ఉండడం వల్ల వీటిని పచ్చికూరగాయగా ఉపయోగిస్తారు. దీనిని సిమ్లా మిర్చి, బెల్‌పెప్పర్, కూరమిరప, బెంగుళూరుమిర్చి అని కూడా పిలుస్తారు. వీటిలో విటమిన్ ఎ,సి అధికంగా ఉంటుంది. ఇవి ఆకుపచ్చ, ఎరుపు, నారింజ, పసుపు రంగులో ఉంటాయి. పాలీహౌస్లో పండించడం వల్ల పంటకు కావాల్సిన టెంపరేచర్ మాత్రమే అందుతుంది కనుక కాయలు ఒకే సైజులోనూ ఒకే కలర్‌లోనూ ఉంటాయి. పంట కాలం ఎక్కువగా ఉంటుంది. బయట నాలుగు నెలల వచ్చే పంట ఇందులో ఆరు నెలల వరకు వస్తుంది. చీడపీడల బెడద తక్కువగా ఉంటుంది.
క్యాప్సికమ్ మొక్క 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతను తట్టుకోగలదు. మొక్క నాటిన 75 రోజుల తర్వాత దిగుబడిని ఇవ్వడం ప్రారంభిస్తుంది. ఒక హెక్టారులో దాదాపు 300 క్వింటాళ్ల క్యాప్సికం ఉత్పత్తి అవుతుంది. వెంటిలేటెడ్ హౌస్‌లో క్యాప్సికమ్ పండించిన సంవత్సరములో 10 నెలలు దిగుబడి పొందుటకు అవకాశం ఉంది. షేడ్‌నెట్ లలో అయితే సంవత్సరములో 6 నెలలు పంటను పొందవచ్చు. పాలిహౌస్ ను గాలి తక్కువగా వీచే ప్రాంతాలలో నిర్మించుకొన్న ఎక్కువకాలము మన్నుతుంది. తీరప్రాంతాలు, బయలు భూములలో కొత్త పాలిపౌస్లు వేయకుండా ఉండటమే మంచిది.
Also Read: Bicycle Weeder: రైతు వినూత్న ప్రయత్నం.. పాత సైకిల్ తో కలుపు తీసే గుంటుక యంత్రం.!

Capsicum Cultivation in Polyhouse
నీరు బాగా యింకు బరువైన సారవంతమైన నేలలు ఈ పంటసాగుకు అనుకూలమైనది. చవుడు నేలలు ఈ పంట సాగుకు పనికి రావు. 1 మీటరు వెడల్పు 5 మీటర్లు పొడవు గల ఆరునారుమళ్ళని నారు, ఒక ఎకరంలో నాటటానికి సరిపోతుంది. వాతావరణంలో తేమ 50-60 శాతం కన్నా తగ్గకుండా ఉంచుకోవడానికి, నాల్గు వైపులా నీటిని విరజిమ్మే ఫాగర్స్‌ను పాలిహౌస్ పై భాగంలో ఏర్పాటు చేసి, తేమ పెంచడము ద్వారా మొక్కల ఉష్ణోగ్రత బాగా తగ్గించుటకు వీలు కల్గుతుంది. మొక్కలు నాటిన 10-15 రోజులలో ఏపుగా పెరగని మొక్కలను గుర్తించి తీసివేసి వాటి స్థానంలో బాగా పెరిగే మొక్కలను నాటుకుంటే దిగుబడి బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది
మొక్కల ఆకులపై రంధ్రాలు కనిపించినప్పుడు వెంటనే చెట్లపై తగిన మొత్తంలో సల్ఫర్‌ను పిచికారీ చేయాలి. మొజాయిక్ వ్యాధి, ఉత్త వ్యాధి, కాండం తొలిచే పురుగు వంటి శిలీంధ్ర తెగుళ్ల వల్ల పంట ఎక్కువగా దెబ్బతింటుంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. క్యాప్సికం సాగుకు పెట్టుబడి తక్కువ ఆదాయం ఎక్కువగా ఉంటుంది.
క్యాప్సికం సాగుని బిందు పద్ధతిలో సేద్యం చేయడం మేలైన ఫలితాలను ఇస్తుంది. వ్యవసాయానికి ఇది ఉత్తమమైన నీటిపారుదల పద్ధతి. బిందు పద్ధతిలో సేద్యం నీటిని ఆదా చేయడంతోపాటు అవసరాన్ని బట్టి నీటిని వాడుకోవచ్చు. ఖర్చు ఆదా అవుతుంది. అలాగే ఉత్పత్తి బాగుంటుంది. ఈ పద్ధతి ద్వారా ఎరువును కూడా సరైన పద్ధతిలో వాడుకోవచ్చు. ఈ పద్ధతిలో సేద్యానికి ప్రభుత్వం భారీ రాయితీలు ఇస్తోంది.
Also Read: Silage Making Process: సైలేజ్ దాణా తయారీ లో మంచి ఆదాయం పొందుతున్న రైతులు.!