ఉద్యానశోభ

Avocado Cultivation: అవకాడో సాగు విధానం.!

0
Avocado
Avocado

 Avocado Cultivation అవకాడో లేదా వెన్న పండు అనేది మధ్య మెక్సికో ప్రాంతానికి చెందిన వృక్షం. అవకాడో యొక్క శాస్త్రీయనామం పెర్సీ అమెరికాన. దీన్ని అల్లెగటర్‌ పీయర్‌ లేక బట్టర్‌ ఫ్రూట్‌ అని అంటారు. ప్రపంచంలో ఉండే మొత్తం అవకాడోలో సగం కేవలం అమెరికా ప్రజలు తింటారు. అవకాడో పియర్‌ పండు మాదిరిగా మరియు గుడ్డు ఆకారంలో లాగా కనిపిస్తుంది. దీనిలో కేవలం ఒకటే విత్తనం ఉంటుంది. ఈ విత్తనం చుట్టూ పండు యొక్క గుజ్జు ఉంటుంది. దీని యొక్క చర్మం చూడటానికి కొంచెం కఠినంగా ఎగుడు దిగుడుగా కనిపిస్తుంది. బాగా పండిన అవకాడో మాత్రం పర్పల్‌ బ్లాక్‌ రంగులో ఉంటుంది దీని యొక్క రుచి కొంచెం తియ్యగా మరియు వెన్న లాగా ఉంటుంది. ఒక్కసారి తింటే మనకు అసలు రుచి తెలుస్తుంది.

Avocado Cultivation

Avocado Cultivation

వెన్న పండు చెట్టు సుమారు 20 మీటర్లు (66 నుండి 67 అడుగుల) ఎత్తు పెరుగుతుంది. 12 సెంటీమీటర్ల నుండి 25 సెంటీమీటర్ల పొడవు ఆకులు ఐదు నుండి పది మీటర్లు వెడల్పు పువ్వు ఏడు నుండి ఎనిమిది అంగుళాల పొడవు గల కాయ కలిగిఉంటుంది. అవకాడో వ్యాపారపరంగా మంచి విలువ గల పంట కాబట్టి ఈ పంటకు వాతావరణం గల ప్రపంచంలోని అన్ని శీతోష్ట మరియు సమశీతోష్ణ ప్రాంతాలలో ఈ చెట్లను పెంచుతారు.

Also Read: Avocados Importance: అరటిపండ్ల కంటే మేలైన అవొకాడోస్.!

అవకాడో సారవంతమైన ఎర్ర నేలల్లో సాగు చేయవచ్చు. వెన్న చెట్లను పెరు, పోర్చుగీస్‌, మొరొకొ, క్త్రెతె, లెవాంట్‌, దక్షిణాఫ్రికా, కొలంబియా, చిలీ, వియత్నాం, ఇండోనేషియా, శ్రీలంక, దక్షిణ భారతదేశం, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, ఫిలిప్పీన్స్‌, మలేషియా, కరేబియాన్‌, మెక్సికో, హవాయి, ఈక్వేడర్‌ మరియు న్యూమెక్సికో.
విత్తనం నాటిన నాలుగు నుండి ఆరు సంవత్సరాలకు వెన్న చెట్లు కోతకు వస్తాయి. ఇవి చెట్టున ఉన్నప్పుడే మగ్గుతాయి. కానీ వాణిజ్యంగా పండిరచే వారు వీటిని పచ్చిగానే ఉన్నప్పుడు కోసి 3.3 నుండి 5.50సెం. మగ్గడం కోసం భద్రపరుస్తారు.

పోషక విలువలు (100 గ్రాములకు):
పేరు మొత్తం
శక్తి 160 కేలరీలు
నీరు 73.32 గ్రా.
కొవ్వు 14.66 గ్రా.
కార్భోహైడ్రేట్లు 8.53 గ్రా.
ప్రొటీన్‌ 2 గ్రా.
పీచు పదార్ధాలు 6.7 గ్రా.
పొటాషియం 485 మి.గ్రా.
ఫాస్ఫరస్‌ 52 మి.గ్రా.

Avocado Nutrition Facts

Avocado Nutrition Facts

ఉపయోగాలు :

  • అద్భుతమైన పోషక విలువలు ఉంటాయి.
  • కంటి ఆరోగ్యానికి సహాయపడుతుంది.
  • అల్జీమర్స్‌ వ్యాధి నుండి కాపాడడంలో ఉపయోగపడుతుంది.
  • గుండె, ఎముకల, జీర్ణవ్యవస్థకు మరియు చర్మ ఆరోగ్యానికి సహాయపడుతుంది.
  • శరీర బరువును తగ్గించడంలో సహాయపడుతుంది.
  • క్యాన్సర్‌ నుండి కాపాడాలని సహాయపడుతుంది. .
  •  పొటాషియం పుష్కలంగా సమకూరుతుంది

Also Read: Avocado: జుట్టు ఆరోగ్యం కోసం అవకాడో

Must Watch:

Leave Your Comments

Aquatic Weed Management: చేపల/ రొయ్యల చెరువులలో కలుపు మొక్కలు ఆల్గేనివారణ యాజమాన్య పద్ధతులు.!

Previous article

Soybean Cultivation and Processing: సోయాబీన్‌ సాగు, ప్రాసెసింగ్‌తో ఆదాయం`ఆరోగ్యం.!

Next article

You may also like