ఉద్యానశోభ

పండ్లను మగ్గబెట్టేందుకు అందుబాటులోకి.. ఎన్ రైప్ పౌడర్

0

ఎన్ రైప్ అనే సరికొత్త పౌడర్ ను తెలంగాణ ఆగ్రోస్ మామిడి పండ్లను మగ్గబెట్టేందుకు అందుబాటులోకి తెచ్చింది. నిషేధిత కార్బైడ్, చైనాకు చెందిన ఇథెఫాన్ తో ప్రజల ఆరోగ్యం దెబ్బతింటున్న నేపథ్యంలో సహజసిద్ధంగా తయారుచేసిన ఈ పౌడర్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది. మూడేండ్లపాటు అనేక ప్రయోగాలు చేశాకే దుష్ప్రభావాలు, ఇతర అనారోగ్యాలు రావని తేలాకే దీన్ని అనుమతించారు. ఎన్ రైప్ పౌడర్ ఉపయోగించడం వల్ల ఏ రకం పండ్లు అయినాసరే సహజసిద్ధంగా పండుతాయని ప్రయోగాల్లో తేలింది. ఈ పౌడర్ కు ఎఫ్ ఎస్ ఎస్ ఏ ఐ , ఐఐహెచ్ ఆర్, ఐఐసీటీ అనుమతులు కూడా తీసుకోవడం గమనార్హం. మామిడి పండ్లనే కాకుండా నిమ్మ, బత్తాయి, ద్రాక్ష, టమాట వంటి అన్నిరకాల సిట్రస్ జాతి పండ్లను కూడా మగ్గపెట్టొచ్చు. మూడ్రోజుల్లోనే పండ్లు పక్వానికి వస్తాయి. ఎన్ రైప్ ఐదు గ్రాముల ప్యాకెట్ ధర రూ. 4.86 గా నిర్ణయించారు. ఒక ప్యాకెట్ 10 కిలోలకు సరిపోతుంది.
కరోనా నేపథ్యంలో ప్రజలు విటమిన్ సి పండ్లను ఎక్కువగా తింటున్నారు. దీన్ని ఆసరాగా చేసుకొన్నా వ్యాపారులు తొందరగా మగ్గించేందుకు చైనా పౌడర్ ను వాడుతున్నారు. ఆ పౌడర్ తో 24 గంటల్లోనే పండ్లు మగ్గుతాయి. అయితే వీటివల్ల క్యాన్సర్ తో పాటు శ్వాసకోశ, చర్మవ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

Leave Your Comments

రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయం.. పచ్చిరొట్ట పైర్లు

Previous article

“రౌండ్ చిల్లి” ప్రపంచంలోనే ఘాటైన మిరపకాయలలో.. ఒకటి

Next article

You may also like