Honey Bee Farming: తేనెటీగల పెంపకం (లేదా ఎపిక్చర్) అనేది తేనెటీగ కాలనీల నిర్వహణ, సాధారణంగా మానవ నిర్మిత దద్దుర్లు, మానవులు. అటువంటి తేనెటీగలు చాలా వరకు అపిస్ జాతికి చెందిన తేనెటీగలు, కానీ మెలిపోనా స్టింగ్‌లెస్ తేనెటీగలు వంటి తేనెను ఉత్పత్తి చేసే ఇతర తేనెటీగలు కూడా ఉంచబడతాయి.
తేనె తీయుట :
- సామాన్యంగా మన వాతావరణంలో సంవత్సరానికి రెండుసార్లు తేనె దిగుబడి బాగా వస్తుంది.
- వసంతంలో చెట్లన్నీ చిగురు పూత మీద ఉన్నప్పుడు. బి) సెప్టెంబరు అక్టోబరు మాసాల్లో, ఈ తరుణంలో వచ్చే తేనె ఎక్కువ. అంతేకాకుండా మనం గనుక తేనెటీగల కాలనీలను చూసుకుంటే కొద్దో గొప్పో సంవత్సరం పొడవునా తేనె తీసుకోవచ్చు. తేనెను తీయుటకు ముందుగా తేనెతుట్టెలకు దగ్గర పొగ వెయ్యాలి. దీనివలన ఈగలు మెత్తబడి వీలయినంత గుట్టవు.
- తేనె అరలో తుట్టె గదులన్నీ తేనెతో నింపిన పిమ్మట ఈగలు ఆ గదులపై మైనంతో మూసివేస్తాయి.
- అలా 75 శాతం గదులు తేనెతో నింపి మూసివేసినపుడు తేనెను తీయవచ్చును. తుట్టెలను యంత్రాలతో పెట్టి తేనె తీయటానికి ముందు వాటిని పెట్టె నుంచి వేరు చేయాలి. పెట్టి మూత తీసి తేనె అరలోని తుట్టెలు ఒక్కొక్కటిగా బయటకు తీసి మెల్లగా త్రడి బ్రష్ →
- సహాయంతో దులిపి ఈగలను తుట్టె నుంచి వేరు చెయ్యాలి అలా వేరుచేసిన తుట్టెలని ఆ కాలనీకి దూరంగా వుంచి తేనె తీయాలి.
Also Read: తేనెటీగలలో వయోజన వ్యాధులు, నివారణ మార్గాలు
- తేనె తీయటానికి ముందుగా తేనె తీసే యంత్రాన్ని, చాకును, తేనె నింపుకునే సీసాలను అన్నీ వేడి నీటిలో శుభ్రం చేసి తడి ఏమాత్రం లేకుండా తుడవాలి.
- అన్నీ అమర్చుకున్న పిమ్మట తుట్టె గదులపై మూసివున్న మైనాన్ని మెల్లగా చాకు సహాయంతో ఆ మైనాన్ని రెండు వైపులా తీయాలి. మైనాన్ని తొలగించిన రెండు తుట్టె చక్రాలను తేనె తీసే యంత్రంలో అమర్చి వేగంగా తిప్పాలి. అలా తిప్పటం వల్ల గదులపై మూత తొలగింపబడి కుట్టెలలోని తేనె బలంగా దూరంగా వెదజల్ల బడుతుంది.
- ఇలా ప్రతిసారి రెండు తుట్టెలను అమర్చి అన్ని తుట్టెలలో తేనెను పూర్తిగా తీయాలి. ఇలా తీసిన తేనె యంత్రం అడుక్కి చేరి అడుగున ఉన్న రంధ్రం గుండా బయటకు వస్తుంది. ఆ తేనెను శుభ్రపరచిన సీసాలలో పట్టుకోవాలి.
Also Read: వివిధ కాలాలలో తేనెటీగల యాజామాన్యం
Leave Your Comments