ఆహారశుద్ది

Benefits of Saraswati Leaves: సరస్వతి ఆకులతో ఎన్నో ఉపయోగాలు..!

0
Sarawati Leaves
Saeawati Leaves

Benefits of Saraswati Leaves: ఈ మొక్క మాగాణి భూముల్లోను, పంటకాలువ గట్ల మీద, నీటి వనరులకు దగ్గరలో నేల మీద పెరిగే బహువార్షిక మొక్క ఆకులు కణుపుకు ఒకటి చొప్పున వృత్తాకారంలో లేక మూత్రపిండాకారంలో పొడవైన కాడలు కలిగి ఉంటాయి. కొమ్మలు 2-3 మీ. వరకు వ్యాపించి కణుపు కణుపుకి వేర్లు వస్తాయి. ఆకులు 2-5 సెం.మీ. వెడల్పుగా ఉండి ఉపరితలం నున్నగా ఉంటుంది. క్రింద భాగంలో నూగు ఉంటుంది. పూవులు చాలా చిన్నవిగా ఊదారంగులో ఉండి 4-5 ఒకే కాడపై ఉంటాయి. కాయలు ధనియాల పప్పు పరిమాణంలో ఉంటాయి. ఈ మొక్కను వేర్లున్న కొమ్మల ద్వారా వ్యాప్తి చేయవచ్చు.

Benefits of Sarawati Leaves

Benefits of Saraswati Leaves

ఉపయోగాలు: ఔషధరంగంలో                                                                            ఈ మొక్కను సమూలంగా ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. దీనిలో ఏసియాటికోసైడ్, బ్రహ్మోసైడ్, ట్రైటెర్పినాయిడ్, ట్రెశాకరైడ్ విటమిన్ సి ఉంటాయి.ఆ సరస్వతి ఆకు జ్ఞాపక శక్తిని పెంచుతుంది. కంఠస్వరాన్ని సరిచేస్తుంది. ఉన్మాదం, అపస్మారం, ఆందోళన, మానసిక ఉద్రేకం, పచ్చకామెర్లు, కుష్టు, చర్మ వ్యాధుల నివారణకు కూడా ఉపయోగించబడుతుంది.

Also Read: Mint Leaves Uses: పుదీనా వల్ల వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలి పెట్టరు.!

దీని నుండి తీసిన నూనె కేశవర్థినిగా ఉపయోగించబడుతుంది.ఆ సరస్వతి ఆకు ద్రావణం ఫ్యుజేరియం ఆక్సిస్పోరంపై యాంటి ఫంగల్ చర్యను ప్రదర్శించింది. సరస్వతి ఆకు ఎసెన్షియల్ ఆయిల్ మలేరియల్ వెక్టర్ అనోఫెలెస్ స్టెఫెన్సిపై లార్విసైడల్ మరియు అడల్టిసైడల్ చర్యలను ప్రదర్శించింది0దీని నుండి తీసిన నూనె కేశవర్థినిగా ఉపయోగించబడుతుంది.

వ్యవసాయరంగంలో : సరస్వతి ఆకుల రసాన్ని తీసి 3 లీ. నీటిలో కలిపి పిచికారి చేసి ఎండుతెగులు, మాగుడు తెగులు, కాండం మరియు వేరుకుళ్ళు తెగులు (ఫ్యుజేరియం), ఎక్జిబ్రైట్, కర్టిటాప్, లీఫ్బెట్ (హెల్మింతోస్పోరియం)లను నివారించవచ్చు. సరస్వతి ఆకు ఇథనాల్ ద్రావణం క్యూలెక్స్ క్వింక్విఫేసియేట్స్ప లార్విసైడల్, అడల్ట్ ఎమర్జెన్స్ ఇన్హెబిటర్ చర్యలను ప్రదర్శించ వచ్చు సరస్వతి ఆకు క్రూడ్ అసిటోన్, హెక్సేన్, ఇథైల్ అసిటేట్, మిథనాల్ ద్రావణాలు క్యూలెక్స్ క్వింక్విఫేసియేటస్ 4వ దశలార్వాలపై రిపెల్లెంట్, యాంటిఫీడెంట్, ఓవిసైడల్ చర్యను ప్రదర్శించాయి. సరస్వతి ఆకు రైజోపెడ్తా డామినికపై అతి తక్కువ కీటకనాశక చర్యను ప్రదర్శించింది కాని ట్రెబోలియం కాష్టానియం కాల్లసోబ్రూకని మాక్యులేటస్ పై చూపలేదు.

 Sarawati Leaves

Benefits of Saraswati Leaves 

లెమ్నామైనర్పై పెరుగుదల క్రమబద్ధీకరణ చర్యను ప్రదర్శించవచ్చు. బేసిల్లస్ సల్టైలిస్, సూడోమోనాస్ ఈరూజినోసా, కాండిడా అల్టికాన్స్పై తక్కువ యాంటి బాక్టీరియల్, యాంటి ఫంగల్ చర్యలను ప్రదర్శించవచ్చు. సరస్వతి ఆకు, పునర్నవ కొల్లసోబ్రూకన్ కైనెన్సిస్ లార్వా దశలను, పెద్ద పురుగులను సమర్ధవంతంగా నివారించాయి. ఈ రెండు మొక్కల నుండి తయారు చేసిన గ్రాన్యూల్స్ పురుగు లార్వాలను, పెద్ద పురుగులను గణనీయంగా చంపవచ్చు. ఆ విధంగా ఈ రెండు మొక్కలు కాల్లసోబ్రూకసి కైనెన్సిస్ని సమర్ధవంతంగా నివారించవచ్చు. సరస్వతి ఆకు మిథనాల్ ద్రావణం, నీటి ద్రావణం స్టెఫైలోకోకస్ ఆరియస్, మైకోబాక్టీరియం లైపే పై యాంటీ బాక్టీరియల్ చర్యను ప్రదర్శించవచ్చు.

Also Read: Kafal Leaves: కఫాల్ ఆకుల నుండి మానసిక వ్యాధులు తొలగించబడతాయి

Must Watch:

-Rakesh Jhadi
Ph.D. Research Scholar
Department of Agronomy
Bidhan Chandra Krishi Viswavidhyalaya
Contact no:9505410171

Leave Your Comments

Chilli Seed Production :మిరప విత్తనోత్పత్తి లో మెళుకువలు.!

Previous article

Importance of Quality Milk Production: పరిశుభ్రమైన పాల ఉత్పత్తి లో మెళుకువలు.!

Next article

You may also like