Potato Processing: వాణిజ్య పంటలు పండించడం ద్వారా రైతులకు మంచి లాభాలు వస్తున్నాయి. ఎక్కువ లాభాలు రావడంతో రైతులు కూడా ఈ పంటలు పండించాలి అనుకుంటున్నారు. ఈ వాణిజ్య పంటలు రైతులు పండించడంతో పాటు వీటిని ప్రాసెస్ చేసి అమ్ముకుంటే మంచి లాభాలు వస్తున్నాయి. ఈ వాణిజ్య పంటలో బంగాళదుంప సాగు కూడా మంచి లాభాలు వస్తున్నాయి. బంగాళదుంప పంటను సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ రైతులు ఎక్కువగా సాగు చేస్తున్నారు.
జహీరాబాద్ ప్రాంతంలో ఎక్కువగా నల్ల రేగడు నేలలు ఉంటాయి. ఈ నేలలో బంగాళదుంప పంట దిగుబడి ఎక్కువ వస్తుంది. ఎర్రమట్టి నెలలో కూడా మంచి దిగుబడి వస్తుంది. కానీ ఈ మట్టిలో సాగు చేసిన బంగాళదుంప రంగులో కూడా కొంచెం ఎరుపులో ఉంటుంది. కొంచెం ఎరుపు రంగులో ఉండటం ద్వారా మార్కెట్లో తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు.
నల్ల రేగడు నేలలో పండించే బంగాళదుంప తెలుపు రంగులో ఉంటాయి. అందువల్ల వీటిని మార్కెట్లో ఎక్కువ ధరకి అమ్ముతున్నారు. బంగాళదుంప పంటను అక్టోబర్ లేదా నవంబర్ నెలలో మొదలు పెట్టి జనవరి నెలలో కోతలు చేస్తారు. ఒక ఎకరంలో పండించడానికి దాదాపు 40 వేల రూపాయలు పెట్టుబడి అవసరం అవుతుంది.
Also Read: Mini Rice Mill Machine: మినీ రైస్ మిల్ ఎలా వాడాలి…?
ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టిన కూడా దిగుబడి మంచిగా వస్తుంది. ఒక ఎకరంలో ఈ పంటకు 8-9 టన్నుల దిగుబడి వస్తుంది. రైతులు మార్కెట్లో ఎక్కువ దిగుబడి ఉన్న సమయంలో బంగాళదుంపలను అలాగే అమ్ముతున్నారు. మార్కెట్లో ధర తగ్గినప్పుడు ఈ బంగాళదుంపలను ప్రాసెస్ చేసి చిప్స్ తయారు చేసి రిటైల్ దుకాణాల్లో అమ్ముతున్నారు.
బంగాళదుంప కంటే ఇలా చిప్స్ తయారు చేసి అమ్ముతే మంచి లాభాలు వస్తున్నాయి. వీటిని నిల్వ చేసుకోవడం కూడా చాలా సులువు. ఒక్కసారి చిప్స్ తయారు చేసుకుంటే ఒక సంవత్సరం వరకు నిల్వ ఉంటాయి. రైతులు అందరూ వాళ్ళు పండించిన పంటలో కొంత భాగం ఇంటి దగ్గర ప్రాసెస్ చేసి అమ్ముకుంటే రైతులకి భారీ లాభాలు వస్తాయి.
Also Read: PJTSAU: ఎరువులు, పురుగు మందులు తగిన మోతాదులో వాడాలి