Shrimp Farmers: డాలర్ పంటగా పేరొందిన రొయ్యల సాగు రైతులకు తీవ్ర నష్టాలను మిగిలిస్తుంది. ఆక్వా రైతులను ప్రభుత్వం నిండా ముంచుతుంది. పడిపోతున్న ధరలు చుక్కలనంటుతున్న ఉత్పత్తి వ్యయం వారిని కష్టాల్లోకి నెడుతున్నాయి. ప్రభుత్వం రైతులకు ధరలను ప్రకటించిన కూడా వ్యాపారులంతా కలిసి రైతులకు మద్దతు ధర ఇవ్వకుండా నష్టాలోకి నెట్టేస్తున్నారు. అమాంతం ధరలు తగ్గిపోవడంతో రైతులు దిగాలు చెందుతున్నారు.
మరోవైపు వైరస్ దిగుబడులు తగ్గడానికి కారణం అయింది. దీంతో ఆక్వా రైతులు పట్టుబడులు చేయలేక, గిట్టుబాటు ధర రాక పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయారు. ప్రస్తుతం 100 కౌంట్ ధర రూ.190 పలుకుతోంది రాష్ట్రంలో 100 కౌంట్ రొయ్యలను కనిష్టంగా రూ.240 లకు కొనుగోలు చేయాలని ప్రభుత్వం దిశానిర్దేశం చేసింది. అయితే ఏ ఒక్క రోజూ కూడా వ్యాపారులు ఈ ధర చెల్లించలేదు. ఇప్పుడు ధరలు పూర్తిగా పతనమయ్యాయి తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు..
100 కౌంట్‌పై రూ.50 తగ్గించి కొనుగోలు
రొయ్యల ఉత్పత్తులపై ఎగుమతులు లేవంటూ వ్యాపారులు ధరలు పూర్తిగా తగ్గించారు.. ఆంధ్రప్రదేశ్ లోని ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రతి సంవత్సరం రూ.10 వేల కోట్ల విలువైన రొయ్య ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఎక్కువగా చైనా వంటి దేశాలకు ఎగుమతి చేస్తుంటారు. ప్రసుత్తం చైనా మన పంటపై పరిమితులు విధించింది. దాంతో ఇక్కడ పంట ఎక్కువగా ఉండి ధరలు తగ్గాయి.
Also Read: Mango Branch Pruning: మామిడిలో కొమ్మ కత్తిరింపులు, యాజమాన్య పద్ధతులు.!
వ్యాపారులంతా 100 కౌంట్‌పై రూ.50 తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతులు పెట్టిన పెట్టుబడులు కూడా రావని వాపోతున్నారు. వాతావరణ మార్పులు వల్లన వైరస్ సోకిందని అందువల్ల నాణ్యమైన పంట చేయలేకపోయామని అంటున్నారు. ఒక దశలో పెట్టుబడులు చేసిన రైతులు విక్రయించుకోవడానికి నానా తంటాలు పడ్డారు. రోజుల తరబడి కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ఆసక్తి చూపడం లేదు. చిన్నా, చితకా రైతులు పూర్తిగా కుదేలయ్యారు. లక్షల రూపాయల పెట్టుబడులను కోల్పోయారు.
ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి
ప్రభుత్వం తరపున ఆక్వా రైతులకు అసలు ప్రోత్సాహం లభించడం లేదు. పైగా ఆక్వా జోన్ పేరుతో రైతుల వెన్ను విరిచింది. అందులోను దీనిలో ఉండే రైతులకు మాత్రమే విద్యుత్ రాయితీ కల్పిస్తున్నది. జిల్లాలో 40 శాతం మంది కూడా విద్యుత్త్ రాయితీని పొందలేకపోతున్నారు. మరో వైపు శీతల గిడ్డంగులు నిర్మిస్తామని చెబుతున్న ప్రభుత్వం నీటిమీద రాతలు లోనే ఉన్నాయాని అన్నారు. కొందరికి సబ్సిడీలు ఎత్తి వేశారు. అధిక లోడు, డెవలెప్‌మెంట్ చార్జీల పేరుతో రైతుల నడ్డి విరిచేస్తున్నారు. ధరలు లేనప్పుడు శీతల గిడ్డంగుల్లో రొయ్యలను నిల్వ చేసుకోవడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.
Also Read: Biochar: పంటల నేల సారాన్ని పెంచుతున్న బయోచార్.!