Vannamei Prawns – వర్షాకాలంలో వెన్నామీ రొయ్యల చెరువులలో జాగ్రత్తలు: ఆంధ్రరాష్ట్రంలో నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు గల కోస్తాతీర ప్రాంతంలో ఆక్వా సాగు విస్తరించి వుంది. వర్షాకాలపు పరిస్థితులు జల జీవులను ప్రభావితం చేస్తాయి. శీతల జీవులైన జలచరాలలో ముఖ్యంగా వెన్నామి రొయ్యల పెంపకం చేపట్టే చెరువుల్లో ఒక్కసారిగా చల్లబడిన వాతావరణానికి చెరువు నీటిలోని గుణగణాలు మారిపోతాయి. నీటి ఉదజని సుచికలో వ్యత్యాసాలు ఏర్పడతాయి. హఠాత్తుగా కురిసే వర్షాలతో చెరువులలో ప్రాణవాయువు లోపం తలెత్తే అవకాశం కలదు. ఇలాంటి పరిస్థితులలో రొయ్యల్లో వ్యాధి నిరోధక శక్తి తగ్గి, బలహీనపడి పలు రకాల వ్యాధులకు గురవుతాయి. కాబట్టి వెన్నామి రొయ్యల పెంపకం చేపట్టే రైతులు వర్షాకాలంలో తగిన జాగ్రతలు తీసుకోవాలి.
వర్షాకాలంలో ఎక్కువగా 3 రకాలైన మార్పులను గమనిస్తాం.
1) భౌతిక చర్యలలో మార్పు
2) రసాయన చర్యలలో మార్పు
3) జీవన చర్యలలో మార్పు
ఈ మార్పులు ఒకదానికి ఒకటి సంబంధించి ఉంటాయి.
భౌతిక చర్యలలో మార్పు:
భౌతిక చర్యలలో మార్పు అనగా ఉష్ణోగ్రతలలో మార్పులు ఎక్కువగా వస్తాయి. ఈ వర్షపు నీటిలో 3-5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది అనగా వాతావరణంలో వున్న ఉష్ణోగ్రత కన్నా తక్కవగా వుంటుంది.ఇలా వుండటం వలన రొయ్యలు మేతను తక్కువగా తీసుకోవటం గమనిస్తాం.
రసాయన మరియు జీవన చర్యలలో మార్పు:
నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్, క్షారత్వం , హర్డ్నేస్ అనే వాటిమీద ఎక్కువగా ప్రభావం చూపెడుతుంది. ఇందులో ముఖ్యంగా గమనించినట్లైతే pH వర్షపు నీటిలో తక్కువ ఉంటుంది కాబట్టి చెవులలో కూడా ఉదజని సూచిక తగ్గిపోవడం గమనిస్తాం. అంతేకాక చెరువుల్లో ఉన్న క్షారత్వం, హర్డ్నేస్ ఇవి వర్షపు నీటి కారణంగా డైల్యూషన్ అయి తగ్గడం అనేది గమనిస్తాం.అంతేకాకుండా విషవాయువులు అయిన హైడ్రోజన్ సల్ఫైడ్, అమ్మోనియా వంటివి ఎక్కువ అవుతాయి.
Also Read: Vannamei Prawns Cultivation: ఆంధ్రప్రదేశ్ లో విస్తృతంగా వనామి రొయ్యల సాగు.!
ముఖ్యంగా వర్షాలు పడక ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు :
వర్షపు నీరు ఎక్కువగా పడితే, నీరు బయటకు పోవడానికి వీలుగా కాలువలు ఏర్పాటు చేసుకోవాలి. అంతే కాకుండా వర్షము పడేటప్పుడు ఏప్పుడు గమనించుకోవాల్సింది ఏమిట అంటే నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ మరియు pH వీటిని ఎప్పటికప్పుడు గమనించి దానికి అనుగుణంగా ఎరియేటర్లు ఆన్ చేసుకోవాలి.pH తగ్గినట్లైతే కాల్షియం కార్బోనేట్ చెరువు నీటిలో కలుపుకోవాలి.
వర్షాలు పడిన తీసుకోవాల్సిన జాగ్రత్తలు :
ఉష్ణోగ్రత వర్షం పడిన తరువాత కొంచం కొంచం పెరుగుతుంది. దానికి తగ్గట్టుగానే రొయ్యలు ఎంత మేత తింటున్నాయో గమనించి మనం మేత వేయాలి. ఒకవేళ కాల్షియం, మెగ్నీషియం స్థాయిలు తక్కువగా ఉండటం గమనించినట్లైతే దానికి తగ్గట్టుగా సూక్ష్మ పోషకాలు చెరువులో కలుపుకోవాలి. వీటితో పాటు మేతలో విటమిన్ సి, ప్రోబిటిక్స్ కలిపి పెడితే మంచిది. అంతే కాకుండా ఈ వర్షాకాలం ప్రభావం వలన ది కంపోజింగ్ బ్యాక్టీరియా పెరగటం వల్ల విబ్రియో గ్రోత్ కూడా పెరగటం గమనిస్తాం. దిని వలన కుడా వైట్ గట్, వైట్ పికల్ మాటర్ ఎక్కువగా రావటం గమనిస్తాం. అంతే కాకుండా వైరల్ వలన తెల్ల మచ్చల వ్యాధి వచ్చే అవకాశం కలదు కాబట్టి తెల్ల మచ్చల వ్యాధి రాకుండా విటమిన్ సి, ప్రోబిటిక్స్ మెతలో కలిపి ఇవ్వాలి.
చెరువుల తయారీ మరియు నీటి నాణ్యత :
రొయ్యల సాగులో గత దశాబ్దకాలం క్రితం అడుగు పెట్టిన వెన్నామీ ప్రారంభంలో వైట్ గోల్డ్ గా పిలవబడుతూ దిగుబడుల సునామినే సృష్టించినా, అటు తర్వాత వడిదుడుకులను ఎదుర్కొంటుంది. దీనికి కారణాలు ఎన్ని వున్నా విత్తన నాణ్యత లోపం, యాజమాన్య లోపాలను ప్రధానంగా చెప్పుకోవాలి. దీంతో రొయ్యలు తొందరగా వ్యాధుల బారిన పడుతున్నాయి. అంతే కాదు ఇటివలి కాలంలో వైట్ గట్ వ్యాధి వలన రొయ్యలను మధ్యలోనే పట్టుబడి చేసిన సందర్భాలు అనేకం. అందుకే సాగు ప్రారంభం నుంచే చెరువు తయారీ మొదలు,పిల్లల ఎంపిక, నీరు,మేత యాజమాన్యం మరియు వ్యాధుల పట్ల సరైన అవగాహనతో శాస్త్రీయ యాజమాన్య పద్ధులు పాటించాలి.
పాత లేదా పట్టుబడి చేసిన చెరువులను కనీసం 15 రోజులు ఎండబెట్టాలి.ఎండబెట్టిన తర్వత మాత్రమే తరువాత కల్చర్ కి వెళ్ళాలి. చేరువంతా 15 రోజులు ఎండగట్టిన తర్వత చెరువు మట్టిని పరిక్షిoచి , రొయ్యల పెంపకానికి అన్ని అనుగుణంగా ఉన్నాయా లేదా అని తెలుసుకోవాలి.పట్టుబడిన చెరువుల అడుగు భాగాన్ని ఒకసారి పరిశీలించి బ్లీచింగ్ పౌడర్ 50 కిలోలు ఒక ఎకరాకు వేసి ఒకసారి నీరు పెట్టీ 2-3 రోజులు వుంచి ఆ తర్వత నీటిని తీసివేయాలి. ఒకసారి అడుగు భాగాన్ని అంతా కలియబెట్టి అందులో మనం ఎకరాకు 100 కిలోల రాతి సున్నం జల్లుకొని కలియదున్ని 4-5 రోజులు వదిలివేసిన తర్వాత భూమిని పరీక్షించి వర్మికంపోస్ట్ దొరికినట్లతే ఎకరాకు150 కిలోలు జల్లుకొని ఆ నేలలో సూక్ష్మ పోషకాల లోపం ఉంటే ఎకరాకు 10-20 కిలోల ముడి జింక్ జల్లుకోవాలి.
వెన్నామీ రొయ్యల పెంపకంలో ఎప్పుడు కూడా నీటిని 6 అడుగుల వరకు పూర్తిగా నిపుకోవాలి. నింపిన తర్వత ఒక 2 రోజులు వుంచి అందులో అమ్మోనియా, కార్బోనేట్, బై కార్బోనేట్ కాల్షియం, మెగ్నీషియం ఇవన్ని కూడా పరిశీలించి రిపోర్ట్ ని బట్టి మనం అందులో ఏం వాడాలి అనేది తెలుసుకోవాలి. వేన్నామి రొయ్యలలో ఈ లవణీయత అనేది పంట పూర్తి కాలం కూడా ఒకేరకమైన లవణీయత ఉండేలా చూసుకోవాలి. బోరు, కాలువ నీరు కలిపి పెట్టినట్లైతే కనీసం 5 PPT లవణీయత ఉండేలా చూసుకుంటే వెన్నామి రొయ్యల పెంపకం లాభదాయకంగా ఉంటుంది. ఈ జాగ్రత్తలు అన్ని పాటిస్తే రొయ్యల పెంపకం లాభదాయకంగా ఉంటుంది.
Also Read: Vannamei Prawn Cultivation: వెన్నామి రొయ్యల సాగు లో మెళుకువలు.!