Aquarium fish varieties – Rearing Tips: ఇంటి మొక్కల పెంపకం తో పాటు చాలా మందికి అక్వెరియంలో చేపలు పెంచటం కూడా ఒక ఇష్టమైన అలవాటు. మిల మిల రంగులలో ఉండే ఆ చేపలు నీటిలో హుషారుగా కదలాడుతుంటే చూసే వారికి ఎంతో ఆహ్లదకరంగా, మనస్సు అంతా ప్రశాంతంగా ఉంటుంది.అక్వెరియం గాజు తొట్టెల లో చేపలు పెంచాలి అనుకుంటే వాటిపై కాసింత అవగాహన కలిగి ఉండాలి.
కలపకూడని చేప రకాలను అవగాహన లేకుండా కలిపి వేసామంటే ఒక చేప మరో చేపకు ఆహారం అయిపొతది. ఒక్కోసారి నీటి గుణాలు మారిపోయి ప్రాణవాయువు అందక కూడా చనిపోతూ ఉంటాయి.సముద్రపు నీటిలో పెరిగే చేపలు మంచి నీటిలో పెరిగే చేపలు వేరు వేరుగా ఉంటాయి. అంతే కాదు గ్రుడ్లు పెట్టే చేపలు కొన్ని ఉంటే పిల్లల్ని పెట్టే చేపలు కొన్ని ఉంటాయి. అక్వెరియం అనేది ఒకప్పుడు ధనవంతులు మాత్రమే వారి ఇండ్లల్లో పెట్టుకునే వారు కాని ఇప్పుడు అక్వెరియం మెయిన్టినేన్స్ ఖర్చు తగ్గడం వలన సామాన్యులు సైతం అక్వెరియంను తమ ఇండ్లల్లో పెట్టుకుంటున్నారు.
Also Read: Environmental Impacts of Rice Cultivation: వరి పంట వల్ల కాలుష్యం ఎలా పెరుగుతుంది.?
అక్వెరియంలో సాధారణంగా పెంచే చేపల రకాలు,పెంపకంలో మెళకువలు గురించి తెలుసుకుందాం :
1) ఏంజెల్ ఫిష్
2) ఆస్కార్ ఫిష్
3) సియామిస్ ఫైటింగ్ ఫిష్
4) గౌరామి ఫిష్
5) మోలి ఫిష్
6) క్లౌన్ ఫిష్
7) గోల్డ్ ఫిష్
8) మిక్కీ మౌస్ ప్లాటీ
9) జీబ్రాఫిష్
9) నియాన్ ఫిష్
10) వైట్ క్లౌడ్ ఫిష్
11) జర్మన్ బ్లూ రామ్ ఫిష్
12) టైగర్ బార్బ్ ఫిష్
13) గుప్పి ఫిష్
14) కాంగో టెట్రా ఫిష్
15) బెట్టా ఫిష్
అక్వెరియంలో పెంచే చేపలకు ఎంత ఆహారం ఇవ్వాలో తెలుసుకుందాం.
• చేపలకు ఇవ్వాల్సిన ఆహారం అనేది వాటి పరిమాణం, జాతులు మరియు వయస్సుపై ఆధారపడి ఉంటుంది.
•సాధారణ నియమం ప్రకారం, చాలా చేపలకు రోజుకు ఒకసారి లేదా రెండుసార్లు కొద్దిపాటి ఆహారాన్ని మాత్రమే అందించాలి.
• అతిగా ఆహారం వేయటం వలన, ఆహారం అక్వేరియం పేరుకుపోయి మరియు కలుషితం అయి, నీటి నాణ్యత సమస్యలకు దారితీస్తుంది.
సియామిస్ ఫైటింగ్ ఫిష్ కి ఎలాంటి ఆహారం ఇవ్వాలి:
మాంసాహారం మరియు అధిక ప్రోటీన్ ఆహారం అవసరం. బ్రైన్ రొయ్యలు, రక్తపురుగులు వంటి ఆహారాన్ని తినడానికి ఇష్టపడతాయి. ఈ జాతి కోసం ప్రత్యేకంగా రూపొందించిన బెట్టా ఫిష్ ఫుడ్ లేదా ఫైటర్ ఫిష్ ఫుడ్ ఫీడ్ ఉంటాయి .
గోల్డ్ ఫిష్ కి ఎలాంటి ఆహారం ఇవ్వాలి:
గోల్డ్ ఫిష్ కి గుళికలు, బఠానీలు మరియు బచ్చలికూర వంటి కూరగాయల కలయికతో ఉన్న ఆహారం పెట్టవచ్చు లేదా గోల్డ్ ఫిష్ ఆహారాన్ని కొనుగోలు చేయవచ్చు.
ఎక్కువ చేపలు ఉంటే ఎరియేటర్లు కమ్ ఫిల్టర్లు తప్పని సరిగా ఉండాలి. నీటిని మార్చాల్సి వస్తె 100% నీటిని మార్చితే చేపలు క్రొత్త నీటికి అడ్జెస్ట్ కాక చనిపోయే అవకాశం కలదు కాబట్టి 20-50% నీటిని మాత్రమే మార్చి మిగతా 50% నీటిని అలానే ఉంచాలి అలా ఉంచటం వలన క్రొత్తగా వచ్చిన నీటి గుణాలు అక్వెరియంలో అలానే ఉంచిన నీటి గుణాలకు చేపలు అడ్జెస్ట్
అవ్వగలవు.
Also Read: Foxtail Millet Cultivation: వర్షాధార కొర్రసాగులో అధిక దిగుబడికి మెళకువలు.!