Kambala Teku Fish సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు అరుదైన చేప చిక్కింది. దాదాపుగా 300 కిలోల బరువు, 2 మీటర్ల పొడవు, 4 మీటర్ల మేర వెడల్పు ఉన్న చేప చిక్కడంతో మత్స్యకారులు అవాక్కయ్యారు. బంగాళాఖాతం సముద్ర జలాల్లో తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడ UPPADA కు చెందిన మత్స్యకారులు వేట ప్రారంభించిన కొద్దిసేపటికే వలలో భారీ చేప వచ్చి పడింది. అంత పెద్ద చేప చిక్కడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. దీనిని అతి కష్టంపై బోటు నుంచి క్రేన్‌తో ఆటో పైకి ఎక్కించి, కాకినాడకు తరలించారు. అర డజను మంది మత్స్యకారులు తాళ్ల సాయంతో కిందకు దింపి విక్రయించగా వెంకన్న అనే వ్యాపారి ఆ చేపను రూ.16,500కు కొనుగోలు చేశాడు. అయితే చిక్కిన చేప పేరు కంబాల టేకుగా పిలుస్తున్నారు వారు. Kambala Teku Fish
Leave Your Comments