Korameenu Fish: చేపలు పెంచడానికి కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కొంచం అజాగ్రత్తగా ఉన్న కూడా చేపలు చనిపోయే అవకాశం లేదా చేపల పెరగడం తగ్గుతుంది. చేపల పెంపకాని సులువు చేయడానికి నగర్ కర్నూల్ జిల్లా, తిమ్మాజీపెట్ గ్రామంలో బాలరాజు రైతు సిమెంట్ ట్యాంక్ ద్వారా చేపల్ని పెంచెంచుతున్నాడు.
ఈ సిమెంట్ ట్యాంక్లో కొర్రమీను చేపల్ని పెంచుతున్నారు. ఒక చేప ఖరీదు 16 రూపాలయలు. దాదాపు 10 వేల చేప పిల్లలని ట్యాంక్ ద్వారా పెంచుతున్నారు. కొర్రమీను చేపలు 10 నెలలు పెంచి అమ్ముకోవాలి. ఈ చేప పిల్లలకి దాన ఖర్చు సుమారు 10 లక్షల రూపాయలు వస్తుంది.
Also Read: Sundakkai Health Benefits: ఈ కాయ 100 విటమిన్ టాబ్లెట్స్ తో సమానం…
ఈ సిమెంట్ ట్యాంక్ 42 అడుగుల పొడవు, 41 అడుగుల వెడల్పుతో రెండు ట్యాంక్ కట్టారు. ట్యాంక్ పై భాగం నుంచి పక్షులు నుంచి చేపలకి హాని లేకుండా ఒక వల కట్టుకోవాలి. ఈ ట్యాంక్ కట్టడానికి 8 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఒక చేపకి సుమారు ఒక కిలో ఫీడ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒక కిలో చేపల ఫీడ్ 110 రూపాయలు.
ఇప్పుడు ఒక చేప కిలో నుంచి కిలోన్నర దాకా పెరిగాయి. మార్కెట్లో కోరమీను చేపలకి మంచి రేట్ వస్తుంది. ఒక కిలో చేపలకి 400-500 రూపాయలు ఉంది. ఈ చేపల పెంపకం చాలా పెట్టుబడి పెట్టిన మంచి దిగుబడి రావడంతో మంచి లాభాలు వస్తున్నాయి. మొత్తం పెట్టుబడి పోయాక కూడా 30 లక్షలు వరకు లాభాలు రావచ్చు. ఇలా చేపలు పెంపకంలో మంచి లాభాలు వస్తున్నాయి.
Also Read: Check Tray Management: చెరువులో చెక్ ట్రే టేబుల్ వీటిలో నిర్మిస్తే పెట్టుబడి చాలా వరకు తగ్గుతుంది..