మన వ్యవసాయంసేంద్రియ వ్యవసాయం

Farm Yard Manure: పశువుల ఎరువులతో పంటకు మేలు

0

Farm Yard Manure పైరుకి కావలసిన అన్ని రకాల పోషకాలు కొంత పరిమాణములో నేలలో సహజంగానే ఉంటాయి. ఇది తయారై పైర్లకులభ్యం కావడం అనేది నేల భౌతిక రసాయనిక లక్షణాలు సూక్ష్మజీవుల చర్య వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది వీటిలో ఎంతో తేడాలు ఉంటే అవకాశం ఉంది. పోషకాలలో భారత నేల చాలా తక్కువగా ఉందని పేర్కొంది. సాంపిల్స్‌లో దాదాపు 85 శాతం మట్టిలో ఆర్గానిక్ కార్బన్ లోపం ఉంది. వీటిలో దాదాపు 15 శాతం శాంపిల్స్‌లో ఆర్గానిక్ కార్బన్ తక్కువ స్థాయిలో ఉంది.

పశువుల ఎరువు (Farm Yard Manure- FYM)

  • ఇంటి దగ్గర గాని, పశువుల కొట్టాల వద్ద గాని, సాధ్యమైనంత వరకు చెట్ల నీడ గల ప్రాంతాన్ని పశువుల ఎరువు నిల్వ చేయుటకు ఎన్నుకోవాలి.
  • పశువుల మల మూత్రాదులు, పశువులు తినగా మిగిలిపోయిన గడ్డి, వ్యవసాయం నుండి వచ్చే వ్యర్ధ పదార్థాలు, చెత్త చెదారాలు, ఆహార పదార్ధాలలో మిగిలిన వ్యర్ధాలు రోజూ కుప్పగా వేస్తారు.
  • ఈ కుప్పగా వేసిన పదార్థాలు సూక్ష్మ జీవుల వలన చివికి – క్రుళ్ళి తొలకరి (జూన్ – జూలై) సమయానికి ఎరువుగా తయారవుతుంది.
  • ఈ ఎరువును హెక్టేరు కు 10 టన్నులు పైగా వేసుకోవచ్చు.

పశువుల ఎరువు నాణ్యత:

  • పెరిగే / పాలిచ్చే పశువుల మల మూత్రాదులలో పోషక పదార్ధాలు వట్టిపోయిన లేదా వయస్సు ముదిరిన పశువుల కంటే తక్కువ గా వుంటాయి.
  • వరి గడ్డి, జొన్న, మొక్కజొన్న మొదలైన గడ్డి తినే పశువుల కంటే పప్పు జాతి పశు గ్రాసాలు (పిల్లి పెసర, జనుము) మరియు నూనె గింజల నుండి తయారయ్యే చెక్క / పిండి తోనే పశువుల వ్యర్ధాలు అధిక పోషకాలు కలిగి ఉంటాయి.
  • పశువుల పేడ, మూత్రం నేలలో ఇంకకుండా పెంట పోగుకు చేర్చిన ఎరువు పోషక విలువ పెరుగుతుంది.

  • గోబర్ గ్యాస్ తయారీకి వాడిన – ఎరువు పోషక విలువలు పెరగడమే గాక, మన నిత్యావసరాలకు గ్యాసు వినియోగించు కోవచ్చు.
  • ఎండకు ఎండి, వానకు తడిసిన ఎరువు కంటే పైన నీడను కల్పించి (sheds) ప్లాస్టరింగ్ చేసిన గోతులలో నిల్వ చేసిన ఎరువు ఎక్కువ పోషక విలువలు కలిగి వుంటుంది.
Leave Your Comments

Bio Remediation On Soil: పైసా ఖర్చు లేకుండా వ్యర్థాలను తొలగించే బయోరేమిడియేషన్ పద్ధతి.!

Previous article

Weed management in horticulture: పండ్ల తోటల్లో కలుపు మొక్కల నివారణ చర్యలు

Next article

You may also like