Effects and Management of Parthenium Hysterophorus: వయ్యారి భామ కలుపు మొక్క వలన మొక్కలకే కాక,మనుషులకు, పశువులకు కూడా చాలా ఇబ్బoదులు కలుగుతున్నాయి. మనుషులకు జ్వరం, ఉబ్బసం, వంటి వ్యాధులతో పాటు చర్మనికి సంబందించిన అలర్జీ కలుగజేస్తోంది. దీని పుప్పొడి వలన జలుబు, కళ్ళు ఎరపడడమ్ , కనురెప్పలు వయడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. పశువులకు ఇది విషపురితమే కాక వెంట్రుకలు రాలిపోవడం, హైపర్ టెన్షన్ గురికావడం జరుగుతుంది.
అంతే కాకుండా పంట మొక్కలతో నీరు, పోషకాలు పోటీ పాడి 40% వరకు దిగుబడులు తగ్గడానికి కారణం ఆ అవుతుంది.వంగ, మిరప, టమాటా, మొక్కజొన్న, పుష్పలపై వయ్యారి భామ పుప్పొడి పడటం వలన ఫల్లోత్పాత్తి తగ్గిపోతుంది. ఈ మొక్క అధిక సoఖ్య ల్లో చిన్న తెల్ల పువ్వులను కలిగి ఉండడం వలన, వీటి పుప్పొడి పై కొన్ని రకాల వైరస్ లు వేరుశెనగల్లో మొవ్వు కుళ్ళు తెగులు, కాండం కుళ్ళు వైరస్ తెగులు లాంటి వ్యాధులు, ప్రొద్దు తిరుగుడులో నెక్రోసిస్ వ్యాధి కలిగిస్తాయి.
నివారణ
వయ్యారి భామను ఎరువుగా మాలచుకోవడం
పూత కు రాని వయ్యారిభామ మొక్కలను ఉపయోగించి సేంద్రియ ఎరువును తయారు చేసుకోవచ్చు.. ఈ విధంగా చేయడం వలన కలుపు నివారణ జరగడమే కాకుండా, కలుపు వ్యర్థలా నుండి విలువైన సేంద్రియ ఎరువు కూడా లభిస్తుంది.

Effects and Management of Parthenium Hysterophorus
Also Read: Sowing Seeds with Tractor: ట్రాక్టరుతో విత్తనం విత్తుదాం.!
జీవ నియంత్రణ పద్ధతి
వయ్యారిభామ ఆకులను తిని పెరిగే జైగోగ్రమ బైకోలెరేటా పెంకు పురుగును 500- 1000 వరకు హెక్టరుకు విడుదల చేయడం వలన , ఈ పురుగులు ఆతి తక్కువ సమయంల్లో నే 4నుంచి 7 లక్షల వరకు అభివృద్ధి చెంది, ఒక హెక్టర్ లో ఉన్న పార్థినియం మొక్కలను పూర్తిగా నాశనం చేస్తాయి.పార్థినియం మొక్కలు తాగిన్నన్ని లేనప్పుడు ఈ బెటిల్స్ అనేవి చనిపోతాయి. కానీ ఎట్టి పరిస్థితులోను ఇతర కలుపు మొక్కలకు , పంటకు ఎటువంటి హాని కలిగించావు.
ఈ పురుగు వర్షాకాలం లో అంటే జూన్ – అక్టోబర్ వరకు మాత్రమే ఆశిస్తాయి. వయ్యారిభామ తో పొడి పడే మొక్కలు కాసివింద, సీరిసియా, కేసియా, ట్రీఫోసినా పార్పురియా విత్తనాలు వర్షాలు పడిన వెంటనే చల్లడం ద్వారా ఈ విత్తనలు, మొక్కల నుంచి విడుదల అయ్యో రసాయనల వల్ల వయ్యారిభామ విత్తనాలు మొలకెత్తకుండా చేయడమే కాకుండా, కాసివింద బాగా పెరిగి తర్వాత పచ్చి రొట్ట ఎరువు గా పొలం లో వేసుకోవచ్చు. కొన్ని రకాల ఆకుమచ్చ , బూడిద తెగులు వయ్యారిభామ ను ఆశీస్తాయి తెగులు సోకిన మొక్కలను అలాగే ఉంచడం ద్వారా మిగిలిన మొక్కలకు తెగులు ఆసిచవచ్చు. మైకోప్లస్మ తెగులు ద్వారా వయ్యారిభామ లో పెరుగుదల తగ్గిపోయి పూత రావడం మరియు విత్తనొత్పత్తి తగ్గిపోతుంది.
రసాయన పద్దతి
పార్థినియం మొక్కలను పూతకు రాక ముందే గ్లిఫోసెట్ కలుపు మందును 10మిల్లి +యూరియా 10గ్రాములు లీటర్ నీటికి కలిపి మొక్కల మీద పిచికారీ చెయ్యాలి. దీని ద్వారా అధిక సంఖ్య లో తయారు అయ్యి విత్తనోత్ప తి అరికట్టావాచ్చు.
పైన ఉన్న పద్ధతులు పాటిస్తే మన ఆరోగ్యం అలాగే మొక్కలు కలుపు ను తగ్గిచుకోవచ్చు.
Also Read: Backyard Gardening: పెరటి తోటల పెంపకం.!