పశుపోషణపాలవెల్లువ

Heat Signs in Cattle: పశువులలో వేడి చిహ్నాలు గుర్తింపు

2
Heat Signs in Cattle
Monsoon Diseases in Cattle

Heat Signs in Cattle: భారత దేశం పశవులకు నిలయం. ప్రపంచ పశు జనాభాలో దాదాపు 15% వరకు భారతదేశంలోనే ఉన్నాయి. పశు సంపదలో చెప్పుకోదగ్గ సాంకేతికతగా కృత్రిమ గర్భధారణ అంటారు శాస్త్రవేత్తలు. ఆర్టిఫిషల్ ఇన్ సెమినషన్ అంటే మగ పశువుల నుండి సజీవ వీర్యాన్ని సేకరించి, వివిధ పరికరాలను ఉపయోగించి స్త్రీ పశువు వేడిలో ఉన్న సమయంలో స్త్రీ పునరుత్పత్తి భాగాలలో జమ చేసే సాంకేతికత. దీనివల్ల సాధారణ సంతానం కలుగుతుంది. ఈ పద్ధతిలో, సరైన సమయంలో, పరిశుభ్రమైన పరిస్థితులలో యాంత్రిక పద్ధతులను పాటించి సేకరించిన వీర్యాన్ని గర్భాశయంలోకి విడుదల చేయడం వలన, ఆ వీర్యం అండాన్ని ఫలదీకరణం చేయడం వలన స్త్రీకి గర్భధారణ చేయబడుతుంది. పెంపుడు జంతువులలో కృత్రిమంగా గర్భధారణ చేయవచ్చని 1780లో ఇటాలియన్ శాస్త్రవేత్త లాజాన్నో స్పల్బంజానీచే కుక్కలపై జరిపైన పరిశోధనలో కనుగొన్నారు.

Heat Signs in Cattle

Heat Signs in Cattle

కృత్రిమ గర్భధారణ అనేది ఆవులలో ఫలదీకరణం జరిపే కొత్త, విప్లవాత్మక పద్ధతి మాత్రమే కాదు. ఇది పశు సంపదను అభివృద్ధి పరచడానికి ఎక్కువగా ఉపయోగించబడే శక్తివంతమైన సాధనం కూడా. ఈ ఆర్టిఫిషల్ ఇన్ సెమినషన్ పద్దతిలో మంచి నాణ్యత గల ఎద్దుల జెర్మ్‌ప్లాజమ్ ను సేకరించి, అతి తక్కువ శ్రమతో మంచి నాణ్యతగల వీర్యాన్ని పరిశుబ్రమైన పరిస్థితులలో సేకరించి, తక్కువ శ్రద్ధతో సమర్థవంతంగా ఉపయోగించవచ్చు. కృత్రిమ గర్భధారణ వలన పశువులలో జననేంద్రియ మరియు జననేతర వ్యాధులలో గణనీయమైన తగ్గుదల ఉంటుందని గుర్తించారు.అయితే ఈ ఆర్టిఫిషల్ ఇన్ సెమినషన్ పద్దతిలో మొదటిగా గుర్తించాల్సినది పశువులలో వేడి దినాలు. ఇది సక్రమంగా జరిగితే సగం విజయం సాధించినట్టే. చాలా మంది రైతులు వేడిని గుర్తించుటలో విఫలం అవుతున్నారు. ఈ కింది లక్షణాలు చూసి శ్రమలేకుండా పశువులలో వేడి దినాలను గుర్తించవచ్చు.

Also Read: సోలార్ పంపుకు సబ్సిడీ

పశువులలో వేడి యొక్క లక్షణాలు:

1.జంతువు మునపటి కన్నా ఉత్సాహంగా ఉంటుంది. రోజులో చాలా సందర్భాలలో అశాంతిగా, భయపడుతూ ఉంటుంది.
2.పశువు బెలో ఫ్రీక్వెన్సీగా ఉంటుంది.
3.పశువు ఆహారం తీసుకోవడం చాలా వరకు తగ్గిస్తుంది.
4.లింబో సక్రల్(నడుము భాగం) దగ్గర విచిత్రమైన కదలికలు గమనించవచ్చు.
5.వేడిలో ఉన్న పాశువులు ఇతర జంతువులను ప్రేమగా లాలిస్తాయి. ఇతర జంతువులను నిమురుతూ వాసన చూస్తాయి.
6.కనిపించిన జంతువుల మీదకు ఎక్కడానికి ప్రయత్నిస్తాయి. కొన్ని సార్లు అలానే నిలిచిపోతాయి దీనిని స్టాండింగ్ హీట్ అంటారు. ఇది 14-16 గంటల పాటు ఉంటుంది.
7.తరచుగా మూత్ర విసర్జన చేయడం గమనించవచ్చు.
8.తోక ఎత్తుగా ఉంచి, యోని ఉబ్బి దాని కింద భాగం అనగా వల్వా నుండి స్పష్టమైన శ్లేష్మము జారుతూ ఉంటుంది, అపుడపుడు శ్లేష్మం వాల్వాకు సమీప భాగాలకు అంటుకుని కనిపిస్తుంది. ఇది స పాస్తంగా తీగ లాగ ఉంటుంది.
9.వాల్వా వాపు కనిపిస్తుంది.

Also Read: అత్తి పండ్ల మంచి దిగుబడి కోసం ఈ పద్ధతిని అనుసరించండి

Leave Your Comments

Spirulina Health Benefits: స్పిరులీనాలో పోషకవిలువలు ఆరోగ్య లాభాలు

Previous article

Organic Farming in Terrace Garden: టెర్రస్ గార్డెన్లో ఆర్గానిక్ వ్యవసాయం

Next article

You may also like