Crop Rotation: రైతులు తమ పొలాల్లో ఒకే పంటని మళ్లీ మళ్లీ వేయడం ద్వారా బాగా సంపాదించాలని అనుకుంటారు. కానీ అది జరుగదు. వారి కష్టానికి తగినంతగా పంట పండదు.
కారణం భూమిలో వచ్చిన మార్పులు. అందుకే వ్యవసాయ శాస్త్రవేత్తలు పంట మార్పిడి పాటించాలని, ఇలా చేస్తే ఆదాయం కూడా పెరుగుతుందని చెబుతున్నారు. వాస్తవానికి ఈ సంప్రదాయ వ్యవసాయ పద్ధతిని ‘మోనోకల్చర్’ (Mono Culture) అంటారు. ఇప్పటికీ చాలామంది రైతులు ఇదే పద్దతిని అనుసరిస్తున్నారు. దీనివల్ల నష్టాలే కానీ లాభాలు ఉండవు. అందుకే పంటమార్పిడి చేయాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
పంట మార్పిడి అంటే నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, నేలలోని పోషకాలను వృద్ది చేయడం. ఉదాహరణకు ఒక రైతు మొక్కజొన్న పంట వేశాడనుకుందాం. ఆ పంట అయిపోయాక అతను పప్పుధాన్యాల పంటను వేయాలి. ఎందుకంటే మొక్కజొన్న చాలా నత్రజనిని వినియోగిస్తుంది అదే పప్పు ధాన్యాలు పోయిన నత్రజనిని మళ్లీ నేలకి తిరిగి ఇస్తాయి. అప్పుడు భూమి సారవంతంగా మారుతుంది.
Also Read: సేంద్రీయ వ్యవసాయంలో యాజమాన్య పద్దతులు
ఒక రైతు ప్రతి సంవత్సరం అదే పంటను అదే ప్రదేశంలో పండిస్తే ఎటువంటి ఫలితం ఉండదు. అతను నిరంతరం నేలలోని పోషకాలను వెలికితీస్తాడు. ఇలా చేయడం వల్ల నేల నిస్సారంగా మారుతుంది. తెగుళ్లు, వ్యాధుల ప్రభావానికి తట్టుకోలేదు. దిగుబడి తక్కువగా వస్తుంది. ఈ రకమైన వ్యవసాయం వల్ల కీటకాలు, వ్యాధులను దూరం చేయడానికి రసాయన ఎరువులు, పురుగుమందుల వాడవలసి ఉంటుంది. అదే పంట మార్పిడి అయితే ఆ అవసరం ఉండదు. అంతేకాదు సహజసిద్దమైన పోషకాలు నేలలోకి తిరిగి రావడానికి అవకాశం ఉంటుంది.
Also Read: ఖర్భూజ సాగులో యాజమాన్య పద్దతులు