Coleus Cultivation: పాషాణ భేది వేర్లలో ‘ఫోర్ స్కోలివ్’ అనే రసాయనం ఉంటుంది. ఎక్కువగా ఆస్త్మా హృదయ సంబందిత వ్యాధులు ఊబకాయం తగ్గించుటకు మొదలగు వాటికి దీని వేర్లను ఉపయోగిస్తారు.
నేలలు: మురుగు నీటిని వెలికి తీసే సౌకర్యం గల నేలలు సాగు కు అనుకూలం. నల్ల నేలలు అంతగా పనికి రావు తక్కువ సారం గల భూముల్లో కూడ సాగు చేయవచ్చు.
వాతావరణం: నీటిపారుదల క్రింద లేదా ఆరుతడి పంటగా సాగుచేయవచ్చు.
రకాలు: 8-8 రకం ప్రస్తుతం సాగులో ఉంది.
ప్రవర్థనం: లేత కొమ్ము కత్తిరింపుల ద్వారా వ్యాప్తి చేయాలి. కత్తిరింపులు హార్మోన్ అవసరం లేకుండానే పేర్లు తొడుగుతాయి. సుమారు 30 రోజుల వయస్సు ఉన్న మొక్కలని పొలంలో నాటుకోవాలి. నాటటం: జూన్-జులై, ఆగష్టు నెలల్లో 45 45 సెం.మీ. లేదా 60×25 సెం.మీ. దూరం పాటించి. ఎకరానికి సుమారు 20,000-25,000 మొక్కలు నాటుకోవాలి. పేరు లేని తాజా కత్తిరింపులు కూడ నేరుగా పొలంలో నాటుకోవచ్చు. చదును మళ్ళల్లో లేదా బోదెలపై నాటుకోవచ్చు.
ఎరువులు: ఆఖరి దుక్కిలో ఎకరానికి 5-6 టన్నుల పశువుల ఎరువుతోపాటు 20 కి, నత్రజని, 25 కి, భాస్వరం మరియు ౨0 కిలోల పొటాష్ వేసుకోవాలి. నాటిన 30 రోజుల తరువాత ఎకరానికి 20 కిలోల నత్రజని వేయాలి.
నీటి యాజమాన్యం:- తొలుత 3 నుండి 4 రోజులకు ఒకసారి తరువాత 7 నుండి 10 రోజులకు ఒకసారి నీరివ్వాలి.
అంతరకృషి: మొదటి రెండు నెలలు 20-25 రోజులకు ఒకసారి కలుపు తీయాలి. తరువాత పంట గుబురుగా తయారై కలుపును పెరగనీయదు.
Also Read: Tulasi Cultivation: తులసి సాగులో మెళుకువలు.!
సస్యరక్షణ: రైజోక్టోనియా వేరుకుళ్ళు తెగుళ్ళు కొన్ని ప్రాంతాల్లో సోకినట్లు గమనించబడింది. ఇది ఆశించిన ఆకులు పండుబారి వేరుకుళ్ళ మొక్కలు ఎండిపోతాయి. దీని నివారణనకు లీటరు నీటికి 1 గ్రాం. కార్బండైజిమ్ లేదా 1 గ్రా. బెనోమిల్ కలిపిన ద్రావణంతో మొక్క మొదలు తడిచేటట్లు పిచికారి చేయాలి. మురుగు నీటి వసతి కల్పించాలి.
పంటకు నులిపురుగులు ఆశించి కొంత నష్టం కలిగించే అవకాశం ఉంది. వీటి నివారణకు మే నెల రెండవ వారంలో బంతి వెత్తనాలు చల్లి జూన్ నెలకరి వరకు తోటను పెంచి తర్వాత భుమిలో కలియదున్నాలి. ఆఖరి దుక్కిలో ఎకరాకు 100 కిలోల వేపపిండిని వేయాలి.
కోల్: నాటిన 150-160 రోజులకు పంట తయారవుతుంది. ఒకసారి నీరు కట్టి మరుసటి రోజు మొక్కలను పేర్లతో సహ పీకి వేర్లను మొక్కనుండి కత్తిరించాలి. పేర్లను కడిగి 5 సెం.మీ. ముక్కలుగా కత్తిరించి నీడలో ఆరబెట్టాలి.
దిగుబడి: ఖరోఫ్ లో ఎకరానికి 500-600 కిలోలు, రబీలో 400 కిలోల ఎండు వేర్ల దిగుబడి సాధించవచ్చు.
నికరాదాయం: ఎకరానికి షుమారు రూ.10,000 ఖర్చుతో, రూ. 10,000-15,000 నికరాదాయం వస్తుంది.
ఉపయోగాలు:
ఇది రక్తపు పోటు, కంటి జబ్బులు, శ్వాస, హృద్రోగము, క్యాన్సరు వ్యాధులలో పని చేస్తుంది. వెంట్రుకలు నల్లబడడానికి కూడా దీనిని వాడుతున్నారు. దీనితో భారతదేశంలో కొన్ని చోట్ల పచ్చళ్ళు. చేసుకొంటారు. ఈజిప్టు మరియు యితర ఆఫ్రికా దేశంలో దీని ఆకులను కళ్ళె పడడానికి, మూత్రము జారీగ రావడానికి వాడతారు.
Also Read: Pelargonium Graveolens Cultivation: జిరేనియం సాగులో మెళకువలు.!