Buffalo Types: ముర్రా జాతి గేదెలు – ఈ జాతి ముర్రా గ్రూపుకు చెందినది. దీని స్వస్థలం హర్యానా మరియు ఢిల్లీ. దీనినే ఢిల్లీ బఫెల్లో అని కూడా అంటారు. ఈ జాతిని ఉత్తరప్రదేశ్, పంజాబ్, రోతక్, పాకిస్థాన్ సింధు ప్రాంతాలలో విరివిగా పెంచుతున్నారు. ఈ జాతి గేదెలు అధికంగా పాల ఉత్పత్తి చేయు సామర్థ్యం కలవి. దేశవాళీ గేదె జాతుల నుండి అధిక దిగుబడిని పొందడానికి మరియు వాటిని సంకరం చేయుటకు దేశంమంతట వీటి వీర్యాన్ని విరివిగా ఉపయోగిస్తున్నారు. ఈ జాతి మన దేశంలోనే కాక ప్రపంచంలోనే అత్యధిక పాలను ఉత్పత్తి చెయ్య గల గేదె జాతి. వీటి శరీరం పెద్దదిగా ఉండి, తల, మెడ, తేలికగా, చిన్నగా ఉంటాయి. వీటి కొమ్ములు వంపు తిరిగి ఉంటాయి. అది ఈ జాతి ప్రత్యేక లక్షణం. శరీరపు వర్ణం పరిపూర్ణమైన బ్లాక్ కలర్ లో ఉంటుంది. ఈ జాతిలో డ్యూలాప్ ఉండదు.
40 నెలల వయస్సులో మొదటి దూడను ఈనుతుంది. ఈతకు ఈతకు మధ్య 480 రోజుల కాలం ఉంటుంది. ఒక పాడి కాలంలో సరాసరి 1800 కిలో గ్రాముల పాలను ఉత్పత్తి చేస్తాయి. ఈ జాతిలోని అనేక గేదెలు ఒక పొడి కాలంలో 3500 కిలో గ్రాముల పాలను ఉత్పత్తి చేస్తున్నాయి. ఈ జాతిలోని కొన్ని గేదెలు రోజుకు 25 కిలో గ్రాముల పాలను కూడా ఇస్తున్నాయి. ఆడ పశువులు సుమారు 450 కిలో గ్రాముల బరువును మరియు మగవి 550 కిలో గ్రాముల బరువులను కలిగి ఉంటాయి.
ఈ జాతిని పోలాండ్, మలేషియా, ఇండోనేషియా, ఫిలిఫైన్స్, బ్రెజిల్ దేశాల వారు దిగుమతి చేసుకొని ఈ జాతిని అభివృద్ధి చేస్తున్నారు.
Also Read: Bovine Herpes Virus in Cattles: ఆవులలో బోవైన్ హెర్పిస్ వైరస్ వ్యాధి ఇలా వ్యాపిస్తుంది.!
నీలి రావి గేదె జాతి:- ఈ జాతి గేదె ముర్రా గ్రూపు కు చెందినది. ఇవి పంజాబ్.. జాతి, ఇవి పూర్వం నీలి మరియు రావి అనే రెండు జాతులుగా ఉండేవి. కాల క్రమంలో ఇవి రెండు ఒకే రాష్ట్రానికి చెందిన జాతి అని నిర్దేశించి నీలి రావి అని నామకరణం చేశారు. వీటి శరీర ఆకృతి మధ్యస్థంగా ఉండి, తల పొడవుగా ఉంటుంది. కొమ్ములు చిన్నవిగా ఉండి పై బాగంలో మెలిక తిరిగి ఉంటుంది. రెండు కళ్ళ మద్య డిప్రెషన్ ఉంటుంది. వీటి ముఖం ముందు బాగాలను చూసి ముర్రా జాతితో వేరు చేయ్యవచ్చు. తోక పొడవుగా ఉండి, భూమిని తాకుతూ ఉంటుంది. శరీర వర్ణం నలుపు రంగులో ఉండి, పొదుగు మరియు మెడ మీద పింక్ కలర్ మచ్చలుంటాయి. సుదురు, ముఖం, మజిల్ భాగాలలో తెల్లటి మచ్చలు కూడా ఉంటాయి. ఈ జాతి పశువులలో పొడుగు బాగా అభివృద్ధి చెంది ఉంటుంది.
Also Read: Rinderpest Disease in Buffaloes: గేదెలలో ముసర వ్యాధిని ఇలా నయం చెయ్యండి.!
మొదటి దూడను 40-50 నెలల వయస్సులో వేయును. దూడకు దూడకు మధ్య 440-525 రోజులు కాల వ్యవధి ఉంటుంది. ఇవి రోజుకు సగటున 9-10 లీటర్ల పాలు ఇస్తుంది. పాలలో సగటున వెన్న శాతం 4-4.5 వరకు ఉంటుంది. ఈ జాతి మన దేశంలో ముర్రా తరువాత అత్యధిక పాలను ఇవ్వగల జాతి. అందుకే మన దేశంలోని చాలా రాష్ట్రాలలో ఈ జాతిని అభివృద్ధి చేస్తున్నారు.
సూర్తి గేదె జాతి:- ఇవి గుజరాత్ గ్రూపుకు చెందిన జాతి. ఇవి గుజరాత్ రాష్ట్రానికి చెందినవి. ఆనంద్, బరోడా, కైరా జిల్లాలో వీటిని అత్యధికంగా పెంచుతున్నారు. వీటి తల పెద్దదిగా మరియు పొడవుగా ఉండి, కుంభాకారంగా ఉంటుంది. కొమ్ములు కొడవలి ఆకారంలో ఉండి, చివరిలో హుక్ మాదిరి వంగి ఉంటుంది. మెడ పొడవుగా ఉంటుంది. పొదుగు బాగా అభివృద్ధి చెంది, టీట్స్ మీడియం సైజులో ఉంటాయి. ఈ జాతి పశువులు సాధు స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఇవి బ్లాక్ లేదా బ్రౌన్ కలర్ తోక చివరి భాగం తెలుపు రంగులో ఉంటుంది.
Also Read: Paratuberculosis Disease in Cattle: పశువులలో జోన్స్ వ్యాధి లక్షణాలు.!