పశుపోషణ

దీని ధర తెలిస్తే షాక్ అవుతారు..

0
Worlds Most Expensive Buffalo

Worlds Most Expensive Buffalo సాధారణంగా మనకు తెలిసిన గేదెలు, ఆవులు, దున్నపోతుల ధర మహా అయితే వేలు, లక్షలల్లో ఉంటుంది. కానీ ఆ దున్నపోతు విలువ కోట్లలో ఉంది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన దున్నపోతు పేరు హారిజోన్ Horizon. 56 అంగుళాల కొమ్ము విస్తీర్ణంతో ఉన్న దీని ధర రూ. 81.6 కోట్లు. సాధారణంగా దున్నపోతుల సగటు కొమ్ము 36-40 అంగుళాలు ఉంటుంది. కానీ హారిజోన్ దున్నపోతు కొమ్ములు 56 అంగుళాల పొడవుతో అతి భయంకరమైన ఆకారంలో ఉంటుంది.

Horizon

Worlds Most Expensive Buffalo ఈ దున్నపోతు ఎంత హాట్ ప్రాపర్టీ అంటే ప్రతి రైతు హారిజోన్ జన్యు పదార్ధాన్ని కోరుకుంటాడు. ఎందుకంటే ఆ దున్నపోతుతో ఆవుని కలిపినప్పుడు ఆవు విలువ మూడు రేట్లు పెరుగుతుందట. ఈ దున్నపోతును మొదట జాక్వెస్ మలన్‌కు విక్రయించగా.. ఇప్పుడు దీనిని నలుగురు దక్షిణాఫ్రికా వ్యాపారులు ఉపయోగించుకుంటున్నారు. ఒక్కొక్కరికి జంతువులో 25% వాటా ఉంది. హారిజోన్ దున్నపోతు మరో స్పెషల్ ఏంటంటే.. దీని జన్యు పదార్ధంతో కచ్చితంగా హారిజోన్ జాతి వస్తుందట. దీన్ని జన్యుశాస్త్రం కూడా ఆమోదించింది. ఇక దక్షిణాఫ్రికా ఈ తరహా జాతులకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఆ దున్నపోతుల జన్యువుల కోసం రికార్డు స్థాయిలో చెల్లిస్తారు. Horizon

Leave Your Comments

నష్టపోయిన మిర్చి రైతుల్ని ఆదుకుంటాం…

Previous article

ఆధార్ ను పీఎం-కిసాన్ ఖాతాకు లింక్ చేశారా ?

Next article

You may also like