పశుపోషణ

పశుపోషణలో అధిక లాభాలు ఆర్జిస్తున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగి ..

0

కిషోర్ అమెరికాలోని పెద్ద కంపెనీలో ఉద్యోగం, ఐదంకెల జీతం అందమైన కుటుంబం, హాయిగా సాగిపోతున్న జీవితంలో ఏదో తెలియని అసంతృప్తి మరో ఆలోచన చేయకుండా కుటుంబంతోపాటు హైదరాబాద్ వచ్చేశాడు. స్వచ్ఛమైన పాలు పదిమందికి అందేలా చేస్తున్నాడు. ఇదంతా వ్యవసాయంపై మక్కువతో పాటు అని చెప్తున్నాడు ఇందుకూరి కిషోర్.
దిగువ మధ్య తరగతి కుటుంబానికి చెందిన కిషోర్ కు బాగా చదువుకుని అమెరికా వెళ్లాలని కలలుగన్నాడు. ఒక్కో కలను నిజం చేసుకుంటూ ఐఐటీ ఖరగ్ పూర్ లో ఇంజినీరింగ్ చదివాడు. అమెరికాలోని మాసాచుసెట్స్ యూనివర్శిటీ నుంచి పాలిమర్ సైన్స్ లో పీహెచ్ డీ పూర్తిచేసి ఇంటెల్ సంస్థలో ఉన్నతోద్యోగంలో చేరాడు. రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతున్నా సంతృప్తి లభించడంలేదు. తన వ్యవసాయ మూలాలను మరిచిపోలేక పోతున్నాడు. కూరగాయలు, పాలు, పండ్లు ఇలా అన్నీ కలుషితమైన పోతుండటంతో తానెందుకు స్వచ్ఛమైనవి అందించకూడదనే ఆలోచన ఆయనను ఇండియాకు రప్పించింది. హైదరాబాద్ శివారు షాద్ నగర్ లో 2012 లో తొలుత 20 ఆవులతో డెయిరీ ప్రారంభించాడు. తన కుటుంబంతోపాటు మరికొందరికైనా స్వచ్ఛమైన పాలు అందివ్వాలన్న ఆయన కోరిక ఈ డెయిరీ ఏర్పాటుకు దారితీసింది.
2016 లో సిద్స్ ఫార్మ్ పేరుతో సంస్థను రిజిస్టర్ చేసి 120 మందికి ఉపాధి కల్పించేస్థాయికి డెయిరీని అభివృద్ధి పరిచాడు. ఈయన ఫార్మ్ నుంచి నిత్యం దాదాపు 10,000 మంది వినియోగదారులకు ఆవుపాలు అందిస్తున్నారంటే ఎంతలా కష్టపడ్డారో అర్థం చేసుకోవచ్చు. గత ఏడాదిలో రూ. 44 కోట్ల వ్యాపారం చేసిన కిషోర్.. స్విగ్గి, అమెజాన్, డుంజో, బిగ్ బాస్కెట్, క్యూబ్యాగ్ వంటి ఆన్ లైన్ సరఫరా దారులతో ఒప్పందం చేసుకుని ఇంటి వద్దకే తన ఉత్పత్తులను అందజేస్తూ మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటున్నారు.

Leave Your Comments

ప్రతి రైతు తన ఇంట అరుదైన ఉత్తమ పశు సంపద..

Previous article

రైతులు, వ్యవసాయ సిబ్బందితో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ముఖాముఖి..

Next article

You may also like