China Education: బాగా చదివే విద్యార్థులకు సాధారణంగా టీచర్లు బహుమతులు ఇవ్వడమో, అందరిముందు ప్రశంసించడమో చేస్తారు.కానీ అక్కడ మాత్రం వినూత్నంగా అలోచించి వింతైన బహుమతులు ప్రధానం చేశారు. అదెక్కడో కాదు చైనాలోనే. చైనాలో ఓ ప్రయివేటు పాఠశాలలో బాగా చదివే విద్యార్థులకు పందులను బహుమతులుగా ఇచ్చారు సదరు పాఠశాల యాజమాన్యం. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. వివరాలలోకి వెళితే…
చైనా దేశంలోని యునాన్ ఇలియాంగ్ ప్రాంతంలో ఓ పాఠశాలలో చదువుతున్న 20 మంది విద్యార్థులకు సదరు పాఠశాల యాజమాన్యం పంది పిల్లల్ని ఇచ్చారు. అయితే ఆ పాఠశాలలో 65 మంది విద్యార్థులు ఉండగా.. నాలుగు టీచర్లు మాత్రమే ఉన్నారు. కాగా పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు అందరూ పేదవారేనట. దాతలు ఇస్తున్న విరాళాలతో విద్యార్థులు చదువుకుంటున్నారు. అయితే ఆ పేద విద్యార్థుల కోసం పాఠశాల యాజమాన్యం వినూత్నంగా ఆలోచించింది.
Also Read: కోడి పిల్లల సంరక్షణ విధానం
గ్రామీణ ప్రాంతాల్లో పేద విద్యార్థుల కుటుంబాలకు సాయం చేసేందుకే పందుల్ని ఇచ్చినట్టు ఆ స్కూల్ టీచర్లు చెప్పారు. స్కూల్లో కష్టపడి చదువుకుంటున్న ప్రతిభ గల విద్యార్థులకు పందుల్ని ఇస్తే అది వారి కుటుంబాలకు హెల్ప్ అవుతుందని, పందుల పెంపకంతో భవిష్యత్తులో మంచి ఆదాయం వస్తుందని పాఠశాల ఉపాధ్యాయులు చెప్పారు. పందులను కొంతకాలం పెంచి వాటికి అమ్ముకోవచ్చు దాంతో డబ్బు వస్తుందని, ఆ డబ్బు చిన్నారుల చదువుకు ఉపయోగపడుతుందని ఆ పాఠశాల యాజమాన్యం తెలిపింది.
Also Read: ఆన్లైన్లో జోరుగా పందెం కోళ్ల విక్రయాలు