పశువుల ఆరోగ్య పరిరక్షణలో పరాన్నజీవుల నివారణ ముఖ్యమైన అంశమని దూడల్లో ఇవి ప్రాణాంతకంగా మారుతాయి. అవి రెండు రకాలు
బాహ్య పరాన్నజీవులు:
పశువులను రోజూ నీటితో కడిగితే వీటి బెడద తగ్గుతుంది. మూడు నెలలకోసారి పాకలు, వాటి పరిసరాల్లో నివారణకు మందులు పిచికారీ చేయాలి. పాక పరిసరాల్లో మురుగు నిల్వకుండా పొడిగా ఉంచాలి.
అంతర పరాన్నజీవులు:
నీరు ఎక్కువగా నిలిచే ప్రదేశాల్లో నత్తలు ఎక్కువగా ఉండి జలగవ్యాధి సోకుతుంది. జీర్ణ వ్యవస్థలో చేరిన పరాన్నజీవులతో దూడల్లో ఎదుగుదల తగ్గి బలహీనపడి సరైన వైద్యం అందకుంటే మరణిస్తాయి. పాడి పశువుల్లో బలహీనత, పారుడు, అజీర్తి లక్షణాలు కనిపించి ఉత్పాదకత తగ్గుతుంది. వీటి నివారణకు దూడలకు 10 రోజుల వయస్సులో మొదటి సారి, తిరిగి 15 రోజులకు రెండోసారి, నెలకోసారి చొప్పున ఆర్నెల్ల వరకు మందులు తాగించాలి.
పశువుల ఆరోగ్య పరిరక్షణలో పరాన్నజీవుల నివారణ..
Leave Your Comments