పశుపోషణ

Parvo Viral Disease: పెంపుడు కుక్కలలో పార్వో వ్యాధి ఎలా వస్తుంది.!

0
Parvo Viral Disease in Dogs
Parvo Viral Disease in Dogs

Parvo Viral Disease: ఈ వ్యాధిని 1978 సంవత్సరంలో మొదట కనుగొన్నారు. ప్రస్తుతం ప్రపంచంలోని అన్ని దేశాలతో పాటు మన దేశంలోని కుక్కలలో కూడా ఈ వ్యాధిని కనుగొనడం జరిగిoది. ఈ వ్యాధిలో ప్రధానంగా 2 నెలల లోపు కుక్కలలో వాంతులు, విరోచనాలు ఉంటే అధికంగా మరణిస్తుంటాయి.

వ్యాధి కారకం:- ఇది పార్వో విరిడే కుటుంబానికి చెందిన పార్వోవైరస్ వలన కలుగుతుంది. ఇది single standard, DNA, Non Enveloped వైరస్. ఇది సుమారు 18-26 nm పరిమాణం కలిగిన అతి చిన్న వైరస్ కాని అత్యధిక ప్రభావవంతమైoది. ఏ విధమైన భౌతిక మార్పులు మరియు రసాయనాలు ఈ వ్యాధి కారకాన్ని త్వరగా చంపలేవు.

వ్యాధి బారిన పడు పశువులు:- 2 నెలలలోపు కుక్కలు, పిల్లులు ఈ వ్యాధి బారిన అధికంగా పడుతుంటాయి. మార్బిడిటీ 100 శాతం వరకు ఉంటే, మోర్టాలిటీ కొన్ని సందర్భాలాలో 100 శాతం వరకు ఉంటుంది. డాబర్ మెన్, లాబర్ డార్ కుక్కలలో ఈ వ్యాధి మూలంగా అధిక మరణాలు సంభవిస్తుంటాయి.

వ్యాధి వచ్చు మార్గo:- ఈ వ్యాధి సోకిన కుక్కలు విడుదల చేసిన మల మూత్రాలతో కలుషితం అయిన ఆహారం మరియు నీటిని మరొక ఆరోగ్యవంతమైన కుక్క నోటి ద్వారా తీసుకోవడం వలన ఈ వ్యాధి ఆరోగ్యంగా ఉన్న కుక్కలకు వ్యాపిస్తుంటుంది.

Also Read: Infectious Canine Hepatitis in Dogs: పెంపుడు కుక్కలలో కెన్లైన్ హెపటైటిస్ వ్యాధి ఎలా వస్తుంది.!

Parvo Viral Disease

Parvo Viral Disease

లక్షణాలు:- తీవ్రమైన జ్వరం ఉంటుంది. రక్తంతో కూడిన విరోచ నాలు మరియు వాంతులు ఉంటాయి. ఫలితంగా డిహైడ్రేషన్ లక్షణాలు ఉండి కుక్క పిల్లలు అధికంగా చనిపోతుంటాయి.10 వారాల వయస్సు గల కుక్కలలో ఈ రకమైన లక్షణాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. గుండె కండరాలు పాడైపోవుట వలన కుక్కలలో బి.పి, డిస్ప్నియా వంటి లక్షణాలు ఉండి చనిపోతుంటాయి.రక్త పరీక్ష చేసి అందులో న్యూట్రోఫిల్స్ మరియు లింపోసైట్స్ కణాలు వాటి సంఖ్య కన్నా తక్కువగా ఉంటాయి. ప్రేగులు మరియు గుండె కండరాలు విచ్చిన్నం అయి ఉండటం గమనించవచ్చు.

వ్యాధి వ్యాప్తి:- పై మార్గాల ద్వారా వైరస్లో కలుషితం అయిన ఆహారం మరియు నీటిని ఆరోగ్యవంతమైన కుక్కలు తీసుకోవడం వలన వైరస్ పొట్ట మరియు ప్రేగులలో చేరి ఎంటిరైటిస్ను కలుగజేస్తుంది. ఫలితంగా కుక్కలలో వాంతులు మరియు విరేచనాలు కలుగుతాయి. దీని వలన కుక్కలు అధికంగా నీటిని మరియు ఎలెక్ట్రోలైట్స్ను కోల్పోయి, శరీరం చల్లబడి పోయి, డీహైడ్రేషన్కు గురి అయి చనిపోతుంటాయి.

కొన్ని సందర్భాలలో వైరస్ ప్రేగుల ద్వారా రక్తంలో చేరి, రక్తం ద్వారా గుండె యొక్క కండరాలలో చేరి మయోకార్డైటిస్ను కలుగజేస్తుంది. ఫలితంగా గుండెకు రక్త సరఫరా సరిగ్గా జరగక కుక్కలు షాక్కు గురి అయి చనిపోతుంటాయి. ఈ వైరస్ లింఫోసైట్ కణాలలో కూడా పెరుగుట వలన వ్యాధి నిరోధక శక్తి తగ్గి, కుక్కలకు ఇతర వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువ.

Also Read:Rabies Disease in Dogs: పెంపుడు కుక్కలలో రేబిస్ వ్యాధి ఎలా వస్తుంది.!

Leave Your Comments

Intercrops in Mango Orchard: మామిడి తోటలో అంతర పంటలు మరియు నీటి యాజమాన్యం.!

Previous article

Contingency Crop Planning: కాల వైపరీత్యాలను ఎదుర్కొనడానికి ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక ఎలా చెయ్యాలి.!

Next article

You may also like