Panchagavya: మితిమీరిన రసాయినిక ఎరువులను, పురుగు మందులను వాడుట వలన భూమిలో ఉన్న ఉపయోగకరమైన సూక్ష్మ జీవులు నశిస్తాయి ,ఇంతే కాకుండా భూమి యొక్క సారం కూడా క్రమేపి తగ్గుతూ వస్తుంది. ఇటువంటి కారణాల వలన మనం తినె ఆహారం కూడా కలుషితం అవుతున్నది తద్వారా ఎన్నో అంతుచిక్కని రోగాలకు బలి అవుతున్నాం. వీటన్నిటికీ పరిహారం గా మనం చేయవలసిందే మన పూర్వీకులు నాటి ప్రకృతి ప్రియమైన సేంద్రీయ వ్యవసాయం.
ప్రకృతి వ్యవసాయంలో ఎటువంటి హానికార రసాయనాలు ఉపయోగించకుండా వాటికి ప్రత్యంనయంగా సహజ సిద్ధమైనటువంటి వేప ఆకు, ఆవు పేడ ,ఆవు మూత్రం ,శనగపిండి, బెల్లం, అరటిపండు, నెయ్యి, పెరుగు, పాలు మొదలగు వాటిని ఉపయోగిస్తారు.
సేంద్రియ వ్యవసాయంలో ఉపయోగించే ‘ పంచగవ్య ‘ తయారీకి కావలసిన పదార్థాలు – 5కేజీ.ల ఆవు పేడ,3 లీటర్లు ఆవు మూత్రం,2 లీటర్లు ఆవు పాలు,2 కేజీ.ల ఆవు పెరుగు, 500 గ్రాములు ఆవు నెయ్యి,3 లీటర్లు చెరుకు రసం,3 లీటర్లు లేత కొబ్బరి నీళ్లు, ఒక డజను బాగా ముగ్గిన అరటి పండ్లు, 2 లీటర్లు తాటికల్లు లేదా ఈత కళ్ళు,
తయారీ విధానం – ముందుగా వెడల్పాటి మట్టి పాత్ర లేదా ప్లాస్టిక్ బకెట్ను తీసుకొని అందులో ఆవు పేడను, నెయ్యిను వేసి మూడు రోజులపాటు పొద్దున్న సాయంత్రం మెత్తగా కలియబెట్టాలి, నాలుగోవ రోజున ఈ మిశ్రమానికి ఆవు మూత్రాన్ని, ఆవు పాలని, ఆవు పెరుగుని, లేత కొబ్బరి నీళ్లను ,తాటి కల్లును, అరటి పండ్లను, చెరుకు రసాన్ని ఒకదాని తరువాత ఒకటిగా వేసుకుంటూ బాగా కలియ తిప్పాలి. ఈ మిశ్రమాన్ని 18 రోజులపాటు పొద్దున్న, సాయంత్రం కలియబెట్టి త్రిప్పి పాత్ర యొక్క మూతను గట్టిగా బిగించి ఉంచవలెను. ఇలా తయారుచేసిన పంచగవ్య ఆరు నెలల వరకు నిల్వ ఉంటుంది. పంచగవ్య
ఉపయోగాలు – ఈ రసాయనాన్ని పిచికారి చేయడం వల్ల పంట పెరుగుదల మరియు వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది,ఇది క్రిమి సంహారిణిగా కూడా పనిచేస్తుంది.
Recommended Video:
Suggested Video: