Milking Methods in Dairy Cattle: పాడి పశువుల సంఖ్యను బట్టి పాలను ఈ క్రింది పద్ధతుల ద్వారా పాలను పిండుతుంటారు. చేతి ద్వారా పాలు పిండు విధానo :- మన దేశంలో ఎక్కువ మంది రైతులు ఈ పద్ధతి ద్వారానే పాలు పిండుతుంటారు. దీనికి ప్రధాన కారణం రైతుల వద్ద పాడి పశువులు తక్కువ సంఖ్యలో ఉండటం మరియు తక్కువ పాలనిచ్చు దేశవాళి లేదా సంకరజాతి పశువులుండటంతో ఈ పద్ధతిని ఎక్కువగా అవలంభిస్తుంటారు. చేతి ద్వారా పాలు పిండు విధానములు ఈ క్రింది విధంగా ఉంటాయి.
అ) ఫుల్ హ్యాండ్ పద్ధతి
ఆ) స్టెప్పింగ్ పద్దతి
ఇ) సకలింగ్ పద్ధతి
అ) ఫుల్ హ్యాండ్ పద్ధతి :- ఈ పద్ధతిలో రెండు చేతుల యొక్క వేళ్లతో చనులను పట్టుకొని పాలను పిండుతారు. ఈ పద్ధతిని ఎక్కువగా గేదెల్లోను మరియు పొడవైన చనులు కలిగి యున్న పాడి పశువులకు ఉపయోగిస్తుంటారు.
ఈ పద్ధతి వలన లాభాలు: ఈ పద్ధతి ద్వారా పాడి పశువు యొక్క పొదుగుకు సక్కిలింగ్ రిఫ్లెక్స్ (సేపు) త్వరగా వస్తుంది. ఫలితంగా పాలను త్వరగా పిండవచ్చు.
నష్టాలు: ఈ పద్ధతి ద్వారా పాలను ఎక్కువ సేపు పిండలేము. ఫలితంగా పాలను ఆగి, ఆగి పిండవలసి ఉంటుంది మరియు పొదుగు నుండి పూర్తి పాలను పిండుటకు వీలు కాదు. చివరిలో స్ట్రిపింగ్స్ చేయాలి.
Also Read: Dairy Animals: పాడి పశువుల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు.!
ఆ) స్ట్రిప్పింగ్ పద్ధతి ద్వారా పాలను పిండుట: ఈ పద్దతిలో చనులను బ్రొటన వ్రేలు మరియు చూపుడు వ్రేలుతో కొద్ది కొద్దిగా వత్తుతూ క్రిందకు పిండుతారు. చిన్న సైజు పశువులలో మరియు చిన్న సైజు చనులు కలిగిన పాడి పశువులలో ఈ పద్ధతి ఉపయోగకరంగా ఉంటుంది.
ఈ పద్ధతి ద్వారా కలుగు లాభాలు: ఈ పద్ధతిలో పాలు పిండేటప్పుడు సమయం వృధా కాకుండా ఉంటుంది మరియు పాలను సులభంగా పిండవచ్చు.
నష్టాలు: ఈ పద్ధతి ద్వారా పాలు పిండునప్పుడు పశువులకు నొప్పిగా ఉంటుంది, ఫలితంగా పాడి పశువులు పూర్తి సామర్ధ్యం మేర పాలను ఇవ్వలేవు మరియు నొప్పి మూలంగా పశువులు అటు ఇటు కదులుతూ ఉంటాయి.
ఇ) సకలింగ్ పద్ధతి ద్వారా పాలను పిండుట: ఈ పద్ధతిలో ఆవు యొక్క చనును, ఒక వైపు చిన బొటన వ్రేలుతో పట్టుకొని, మరొక వైపు మిగిలిన నాలుగు వ్రేళ్ళతో పట్టుకొని పాలు పిండుతారు. ఈ పద్ధతిని ఎక్కువగా పెద్ద సైజు గేదెలలోనూ మరియు పెద్ద చనువులు కలిగిన పాడి పశువులలోను ఉపయోగిస్తారు.
ఈ పద్ధతి ద్వారా కలుగు లాభాలు: ఈ పద్ధతి ద్వారా పాలను తొందరగా పిండవచ్చు. ఒక సారి పాలు పిండడం ప్రారంభించిన తరువాత పాలు పిండడం పూర్తి అయ్యే వరకు చేయి వదలకుండా పాలను పూర్తిగా పిండడము చేయవలసి ఉంటుంది. పొదుగుకు గాయాలు అయ్యే అవకాశాలు చాలా తక్కువ.
నష్టాలు: ఈ పద్ధతి ద్వారా పాలు పిండునప్పుడు పశువులు ఒత్తిడికి గురి అవుతుంది.
Also Read: Reproductive System Of Dairy Cattle: పాడి పశుపులలో పునరుత్పత్తి ఎలా జరుగుతుంది.!