Mediterranean Chickens: ఈ క్లాస్ నందు leg horn, Minorca మరియు Ancona కోళ్ళ జాతులు కలవు.
ప్రధాన లక్షణాలు: వీటి శరీరం తేలికగా ఉంటుంది. వీటి చెవి తమ్మెలు తెల్లగా ఉంటాయి మరియు వీటి కూంబ్స్ పెద్దగా ఉంటాయి. ఇవి త్వరగా పెరుగుతాయి మరియు వీటి గ్రుడ్ల పెంకు తెలుపు రంగులో ఉంటుంది. వీటిని ఎక్కువగా గ్రుడ్ల ఉత్పాదనకు ఉపయోగిస్తారు.వీటికి పొదిగించు గుణాలు తక్కువ.
లెగ్ హార్న్ (LEG HORN): ఈ జాతి ఇటలీ దేశానికి చెందినది.ఈ జాతిలో చాలా వెరైటీస్ కలవు. అయితే వాటిలో Single comb white, second Buff, thirdlight brown వెరైటీస్ చాలా ప్రసిద్ధి చెందినవి.
జాతి లక్షణాలు: ఈ జాతి కోళ్ళు చిన్నగా మరియు కంప్యాక్ట్ గా ఉంటుంది.వీటి తల, ముక్కు చిన్నగా ఉంటుంది. వీటి వీపు పొడవుగా మరియు ఎత్తైన ఛాతీ ఉంటుంది. వీటి చర్మం పసుపు రంగులో ఉంటుంది. Well set Comb and Wattles.
ఉపయోగాలు (UTILITY): ఈ క్లాస్ నందు ఉన్న అన్ని కోళ్ళ కంటే ఈ జాతి కోళ్ళ గ్రుడ్ల ఉత్పాదన ఎక్కువ. ఈ జాతి పుంజులు 2.6 కేజీల పెట్టలు 2 కేజీల శరీర బరువు తూగుతుంది.
Also Read: American chickens Types and Characteristics: అమెరికన్ కోళ్ళ రకాలు మరియు వాటి లక్షణాలు.!
మినోర్క (MINORCA): ఈ జాతి స్పెయిన్ దేశానికి చెందినవి.ఈ జాతి యందు Red faced. Black వెరైటీస్ మెడిటేరియన్ బ్రీడ్స్ అన్నింటిలో కన్నా పొడవుగా,లావుగా ఉంటాయి.
జాతి లక్షణాలు: వీటి కూంబ్ పెద్దగా మరియు వాటిల్స్ పొడవుగా ఉంటాయి.వీపు పొడవుగా మరియు ముక్కు, వ్రేలు, తొడలు సలుపు రంగులో ఉంటాయి.వీటి చర్మం తెలుపు రంగులో ఉంటుంది.Tail- Moderate & elevated. వీటి శరీరం శక్తివంతంగా కనిపిస్తుంది.
ఉపయోగాలు (UTILITY): ఈ జాతి కోళ్ళు తెల్లని పెంకు గల గ్రుడ్లను ఎక్కువగా ఉత్పత్తి చేస్తాయి. పుంజులు సగటున 4.1 కేజీల, పెట్టలు 3 కేజీల బరువు తూగుతాయి.
(III) ఆంకోనా (ANCONA): ఈ వాతి కోళ్ళు, లెగ్ హార్న్ నుండి అభివృద్ధి చేయబడింది. ఈ జాతి లెగ్ హార్న్ కన్నా తక్కువ ప్రసిద్ధి చెందినది.ఈ జాతిలో సింగిల్, రోబ్ కూంబ్ వెరైటీస్ కలవు.
జాతి లక్షణాలు: వీటి శరీరపు రంగు స్టస్ బ్లాక్ (lustrous black) రంగులో ఉంటుంది. వీటి తొడలు, వ్రేలు పసుపు రంగులో ఉంటాయి. Back is thin ఉపయోగాలు (UHLITY): పుంజులు సగటున 2.4 కేజీల, పెట్టలు 2 కేజీల శరీర బరువు తూగుతాయి.వీటి గ్రుడ్ల ఉత్పాదన మధ్యస్తంగా ఉంటుంది.
Also Read: Infectious Anaemia in Chicken: కోళ్ళలో ఇన్ ఫెక్ష్యూయస్ అనిమియాను ఇలా నివారించండి.!