పశుపోషణ

Kadaknath Hen: ఈ కోడి మాంసం కిలో 1200 రూపాయలు.!

2
 Kadaknath Hen
 Kadaknath Hen Farming

 Kadaknath Hen: కరోనా తర్వాత అందరూ ఉద్యోగం కన్నా వ్యాపార చేసుకోవడమే మేలు అన్ని అనుకుంటున్నారు. సొంత గ్రామంలో ఉండి అక్కడే వ్యాపారం చేసుకోవడానికి అందరూ ఇష్ట పడుతున్నారు. గ్రామంలోనే ఉంటూ లక్షల్లో లాభాలిచ్చే బిజినెస్ ఐడియాలతో వ్యాపారం చేయాలి అనుకున్న వారికి కడక్‌నాథ్ కోళ్ల వ్యాపారం మార్కెట్లో ఈ మధ్య కాలంలో బాగా సందడి చేస్తుంది. కడక్‌నాథ్ కోళ్లు నలుపు రంగులో ఉండి, వాటి రక్త మాంసాలు కూడా నల్లగానే ఉంటాయి.

కడక్‌నాథ్ కోళ్ళలో కొలెస్టరాల్ తక్కువగా ఉండటం వల్ల హార్ట్, షుగర్ పేషెంట్ల ఈ కోళ్లను తిన్నడం ఆరోగ్యానికి మంచిది. ఈ కడక్‌నాథ్ కోళ్ళలో ఐరన్, ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. కడక్‌నాథ్ కోళ్లను తిన్నడం వల్ల శరీరానికి చాలా పోషకాలు లభిస్తాయి. అందువల్ల మార్కెట్లో ఈ కోళ్ళకి మంచి డిమాండ్ ఉంది.

మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కడక్‌నాథ్ కోళ్లను ఎక్కువగా పెంచుతున్నారు. ఈ ప్రాంతాల్లో కోడక్‌నాథ్ కోళ్లను కాలీమాసీ అని అంటారు. ఈ రాష్ట్రాల్లో కోడక్‌నాథ్ కోళ్ళకి మంచి డిమాండ్ ఉండటంతో కృషి విజ్ఞాన కేంద్రాలు కడక్‌నాథ్ కోడి పిల్లలను అందిస్తుంది. ఈ కడక్‌నాథ్ కోళ్లు మధ్యప్రదేశ్‌లోని ఝబువా జిల్లాలో పుట్టడం వల్ల ఆ కడక్‌నాథ్ కోళ్లుకు జిఐ ట్యాగ్ కూడా ఇచ్చారు.

Also Read: Safflower Cultivation: సాఫ్ట్ వేర్ ఉద్యోగాలకి బై బై.. వ్వవసాయానికి వెల్కమ్.!

 Kadaknath Hen

Kadaknath Hen

ఈ కడక్‌నాథ్ కోళ్ల వ్యాపారాన్ని మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాలు సబ్సిడీలు, పథకాలు ఇస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో కడక్‌నాథ్ కోళ్ల వ్యాపారానికి 53,000 పెట్టుబడి అవుతుంది. ఈ 53,000 పెట్టుబడిని ప్రభుత్వ అకౌంట్లో డిపాజిట్ చేస్తే, ప్రభుత్వమే 1000 కోడిపిల్లలు, 30 కోళ్ల జాలీ, 6 నెలల పాటు ఉచిత దాణాను ఇచ్చి టీకా, ఆరోగ్య సంరక్షణ బాధ్యతను కూడా ప్రభుత్వమే తీసుకుంటుంది. ఈ కోళ్ల మార్కెటింగ్ కూడా ప్రభుత్యం సహాయం చేస్తుంది.

ఒక్క కడక్‌నాథ్ కోడిపిల్ల 70-100 రూపాయలు ఉంటుంది. ఈ కడక్‌నాథ్ కోడి గుడ్డు 20-30 అమ్ముతున్నారు.ఇతర రాష్ట్రలో 1000 కడక్‌నాథ్ కోడిపిల్లలతో వ్యాపారికి షెడ్ నిర్మించడానికి, కేజ్‌లల్లో పెంచడానికి, దాణా, ఇతర ఖర్చులు 4 లక్షలు వరకి పెట్టుబడి అవుతుంది. ఈ కడక్‌నాథ్ కోడిపిల్లలలు మూడు నాలుగు నెలల్లో అమ్ముకోవచ్చు.

ఒక్క కడక్‌నాథ్ కోడి రెండు కిలోల వరకి పెరుగుతుంది. ఒక కిలో కడక్‌నాథ్ కోడి 1000-1200 వరకు మార్కెట్లో అమ్ముతున్నారు. ఈ కోళ్ల వ్యాపారం ఆన్లైన్ ద్వారా కూడా చేస్తున్నారు. ఆన్లైన్లో ఒక కోడి 800 వరకి అమ్ముతున్నారు. 1000 కోడి పిల్లలతో వ్యాపారం చేస్తే 9 లక్షల వరకి లాభాలు వస్తాయి.

Also Read: Papaya Farming: బొప్పాయి పంట సాగు.. రైతులకి మంచి లాభాలు.!

Leave Your Comments

Safflower Cultivation: సాఫ్ట్ వేర్ ఉద్యోగాలకి బై బై.. వ్వవసాయానికి వెల్కమ్.!

Previous article

Ridge Gourd Cultivation: బీరకాయ పంటతో రైతులకి ఒక నెలలో లక్ష రూపాయల ఆదాయం.!

Next article

You may also like