పశుపోషణ

Infectious Bronchitis in Chickens: కోళ్ళలో ఇన్ ఫెక్ష్యూయస్ బ్రాంకైటిస్ వ్యాధి ఎలా వస్తుంది.!

0
Infectious Bronchitis Disease in Chickens
Infectious Bronchitis Disease in Chickens

Infectious Bronchitis in Chickens: ఇది కోళ్ళలో కలుగు అతి తీవ్రమైన వైరల్ అంటు వ్యాధి. ఈ వ్యాధిలో బ్రేకియల్ రేల్స్, దగ్గు, ముక్కు రంధ్రాల నుండి నీరు కారుతుండడం వంటి లక్షణాలతో గ్రుడ్లు పెట్టె కోళ్లలో గ్రుడ్ల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోవడంతో పాటు, పేపర్ షెల్ ఎగ్స్, మిస్ షేప్ ఎగ్స్ వంటి లక్షణాలను గమనించవచ్చు. ఈ వ్యాధి చాలా దేశాలలో విస్తరించి ఉంది.

ఈ వ్యాధిని మనదేశంలో 1964 వ సంవత్సరంలో కనుగొనగా, మన రాష్ట్రంలో 1978 వ సంవత్సరంలో మొట్టమొదటి సారిగా గుర్తించడం జరిగిoది.ఈ వ్యాధి కరోనా విరిడే కుటుంబానికి చెందిన కరోనా వైరస్ వలన కలుగుతుంది. ఇది ఒక సింగల్ స్టాండర్డ్, RNA వైరస్. ఈ వైరస్ పరిమాణం సుమారు 80-100 నానో మీటర్లు ఉంటుంది. ఇది ఒక ఎన్వలప్డ్ వైరస్. ఈ వైరస్ లో 4 రకాల స్ట్రెయిన్స్ కలవు. వీటిలో మాసెక్టికట్ రకoను వ్యాక్సిన్ తయారు చేయుటకు ఉపయోగిస్తారు.

ఈ వ్యాధి యుక్త వయస్సులో ఉన్న అన్ని రకాల పక్షులలో కలుగుతుంటుంది. ఫారం లో ఉన్న అన్ని రకాల లేయర్స్, బ్రాయిలర్స్ మరియు ఇతర పక్షులలో (టర్కీ, రింగ్ నెక్కి పావురాలు) కూడా ఈ వ్యాధి కలుగుతుంటుంది.

Also Read: Rice Milling Machine: ధాన్యం మిల్లు పట్టు యంత్రం ఎలా పనిచేస్తుందో తెలుసుకోండి.!

Infectious Bronchitis in Chickens

Infectious Bronchitis in Chickens

వ్యాధి వచ్చు మార్గం:- ముక్కు నుండి వచ్చే స్రావాలలో ఈ వ్యాధి కారక వైరస్ అధికంగా ఉంటుంది. ఫలితంగా ఈ స్రావాలతో కలుషితమైన ఆహారం తీసుకోవడం వలన లేదా వ్యాధి కారక క్రిమితో కలుషితమైన కోళ్ళ ఫారము పరికరాల ద్వారా, అటెండర్స్ ద్వారా ఈ వ్యాధి ఆరోగ్యంగా ఉన్న కోళ్ళకు వ్యాపిస్తుంటుంది. వ్యాధి బారిన పడిన కోళ్ళు, వ్యాధి నుండి కోలుకున్న కోళ్ళు వైరస్ ను 30 రోజుల వరకు వాటి యొక్క స్రావాల ద్వారా బయటి వాతావరణంలోకి విడుదల వేస్తుంటాయి.

వ్యాధి వ్యాప్తి చెందు విధానం:- వైరస్ తో కలుషితమైన గాలిని ఆరోగ్యంగా ఉండే కోళ్ళు పీల్చడం ద్వారా ఈ వైరస్ వాటి ఊపిరితిత్తులలోకి చేరి, న్యూమోనియాను కలిగిస్తుంది. తరువాత రక్తంలోకి చేరి, ప్రత్యుత్పత్తి వ్యవస్థ అవయవాలను నాశనం చేయుట ద్వారా లేయర్ కోళ్ళలో గ్రుడ్లు ఉత్పాదన గణనీయంగా తగ్గడంతో పాటు, వాటి నాణ్యత కూడా తగ్గిపో తుంది. ఈ వైరస్ మూత్రాశయ వ్యవస్థను కూడా ఎఫెక్ట్ చేయుట ద్వారా కోళ్ళలో నెఫ్రైటిస్ లక్షణాలను కూడా కలిగిస్తుంది.

Also Read: Green House Structure: హరిత గృహాల రకాలు మరియు వాటి నిర్మాణాల గురించి తెలుసుకోండి.!

Leave Your Comments

Rice Milling Machine: ధాన్యం మిల్లు పట్టు యంత్రం ఎలా పనిచేస్తుందో తెలుసుకోండి.!

Previous article

African Swine Fever: పందులలో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్.!

Next article

You may also like