పశుపోషణ

Importance of Fodder : పశుగ్రాసాల ప్రాముఖ్యత.!

0
Animals Eating Fodders
Animals Eating Fodders

Importance of Fodder: పాడికి ఆధారం పచ్చి మేత. పచ్చి మేత  మేపిన  పశువులు ఆరోగ్యం గా ఉంటాయి. పశుగ్రాసాలను పుష్కలంగా  మేపడం వల్ల 25% పాల దిగుబడి పెరుగుతుంది.పశుగ్రాసాలలో మాంసకృత్తులు, పిండి పదార్ధాలు, కొవ్వు పదార్ధాలు  అధికంగా లభ్యమవుతాయి. కాబట్టి పశుగ్రాసాల వాడకం వల్ల  ఖరిధైన సమీకృత దాణాపై  ఖర్చు తగ్గి పాడి పరిశ్రమ  లాభదాయక మవుతుంది. పశుగ్రాసాల సాగును ఆహార ధాన్యాలకు, వాణిజ్య పంటలకు అంతరాయం కలుగకుండా చేపట్టవచ్చు.

Types of Fodders

Types of Fodders

పశుగ్రాసాల సాగుకు ప్రత్యేకంగా స్థలం కేటాయించలేనివారు, కూరగాయలు సాగు చేయువారు, తోటలున్నవారు, బీడుభూములున్న వారుకూడా సాగు చేయడానికి  అనువైన  పశు గ్రాసాలు అందుబాటులో  ఉన్నాయి. పశుగ్రాసాలను వాణిజ్యపరంగా పెద్ద ఎత్తున సాగు చేసి , అమ్మి ఆదాయం పొందే  అవకాశాలున్నాయి. పశుగ్రాసాల వాడకం వల్ల పశువుల్లో పునరుత్పత్తి ప్రక్రియ ఉంటుంది. ప్రత్యేకంగా  పశుగ్రాసాలకు భూమి  కేటాయించలేని వారు ఇతర  పంటల సాళ్ళ మధ్య  మిశ్రమ  పంటగాను, పండ్ల తోటల సాళ్ళ మధ్య  పశు గ్రాసం పండించడం  అలవాటు  చేసుకోవాలి. వాతావరణం, నీటి వనరులను బట్టి వ్యవసాయంతో పాటు పచ్చిమేతలు సాగు చేసుకోవడం  మంచిది. ఈ  విధంగా  చేయడం వల్ల  పశుగ్రాసాల కొరత తగ్గించవచ్చు.

పశుగ్రాస రకాలు : పశుగ్రాసాలు పంట కాలం  బట్టి ఏకవార్షికలు, బాహు వార్షికలు విభజించవచ్చు. ఒక  సంవత్సరం కాలంలో పంట పూర్తి అయి ఒకటి అంతకు మించిన  కోతలలో పశుగ్రాస దిగుబడినిచ్చే రకాలను ఏకవార్షికలు  అంటారు. బాహు వార్షికలు అనగా  ఒకసారి నాటితే 4-5  సంవత్సరాల పాటు పలు కోతలలో దిగుబడి ఇచ్చే రకాలు.

Also Read:Fodder Beet: పశుగ్రాసం కోసం పోషకాలతో కూడిన దుంప సాగు

పశుగ్రాసాల ఎంపిక : ఒకటి లేదా  రెండు పాడి పశువులు గల  సన్న మరియు చిన్నకారు రైతులు తమ పొలం  మరియు ఇంటి చుట్టూ సుబాబుల్ లేదా అవిస లాంటి పశుగ్రాసపు  చెట్టు వేస్తె సంవత్సరం పొడవునా  రోజుకు 10-12 కిలోల  పచ్చి మేత  లభిస్తుంది. అర ఎకరం భూమిలో  నీటి ఆధారంగా పండించే పశుగ్రాసాలతో  రెండు పాడి పశువులను లాభసాటిగా పోషించవచ్చు.పశుగ్రాస ఎంపికలో  నీటి వసతి  ముఖ్య పాత్ర వహిస్తుంది. నీటి పారుదల   సక్రమంగా  ఉండి  భూమిని కేవలం  పశుగ్రాసాల  సాగుకి కేటాయించినచో  బహువార్షికలు వేసుకోవాలి. పశువులకు  పచ్చి మేత  వేసేటప్పుడు గడ్డి జాతి  పశుగ్రాసం సాగు చేసే వారు. 

Importance of Fodder

Importance of Fodder

పచ్చి మేతకు సద్వినియోగం: పాడి పశువులకు రోజుకు 30-40 కిలోల  పచ్చి మేత అవసరం ఉంటుంది. పచ్చి మేత పుష్కలంగా అందిస్తే 5  లీటర్ల పాల దిగుబడి ఎలాంటి దాణా అవసరం లేకుండా పొందవచ్చు. పశు గ్రాసాన్ని ముక్కలుగా కత్తిరించి మేపాలి. దీని వల్ల పశువులకు 10-15 % ఎక్కువ గ్రాసాన్ని సంగ్రహిస్తాయి.దీని వల్ల 70% మేరకు మాత్రమే తిని కండలను తొక్కి మల, ముత్రాలతో పాడు చేస్తాయి. చిన్న చిన్న ముక్కలుగా   కాండాలను  కత్తిరించి మేపితే 90% మేత సద్వినియోగం అవుతుంది. అనేక రకాల  పశు గ్రాసాలను కలిపి  వృధా కాకుండా ఒకేసారి వినియోగపడే నట్లు చేయవచ్చు. ముక్కలుగా కత్తిరించిన గ్రాసాన్ని బస్తాలో నింపి సులభంగా  తక్కువ స్థలంలో నిల్వ చేయవచ్చు. రవాణా  చేయడం  కూడా సులభంగా ఉంటుంది. ముక్కలు చేసిన  పశుగ్రాసాలలో విటమిన్లు, ఖనిజ లవణాలు, మోలాసిస్ వంటివి  తేలికగా  కలపవచ్చు. రుచి కూడా పెరుగుతుంది. కాబట్టి ఎక్కువ పశువులున్నా రైతులు  చాప్ కట్టర్  యంత్రంతో  పచ్చి మేతను కత్తిరించాలి.

Also Read:Sweet Potato Vines as Fodder: పశుగ్రాసంగా చిలగడ దుంప.!

Also Watch:

Leave Your Comments

Cultivation of Carrot : క్యారెట్ సాగు..!

Previous article

Management of Dairy Cattle by Farmers: రైతులచే పాడి పశువుల నిర్వహణ.!

Next article

You may also like