Bypass Fat Supplement: రైతులు ఎక్కువగా వ్యవసాయంపైన ఆధారపడుతుంటారు. రైతే వ్యవసాయానికి వెన్నుముక, కానీ రైతు అప్పులో పుట్టి, అప్పులో పెరిగి, అప్పుతోనే మరణిస్తున్నాడు. ఆలోచన విధానం లేకుండా వారస్వతంతోనే పంటలను వేస్తున్నాడు. నానాటికి పెరిగిపోతున్న పెట్టుబడి ఖర్చులు రైతులకు గుది బండలా తయారుఅయ్యాయి. రైతు తన సాగు విధానాని, పంధాను మార్చుకుంటే కొంత మేర ఖర్చులను తగ్గించుకోవచ్చు. అన్నదాతకు వ్యవసాయం కలిసి రాకపోతే వ్యవసాయ అనుబంద రంగాలైన పాడి పరిశ్రమను ఎంచుకోవచ్చు..
ముఖ్యంగా పాడిపరిశ్రమ ద్వారా వచ్చే ఆదాయంతో కొంత మేర ఖర్చులను తగ్గించుకోవచ్చు. పాడికి మంచి దాణా సరఫరా చేస్తే మనం ఆధిక పాల దిగుబడులను పొందవచ్చు. ముఖ్యంగా అధిక పాల దిగుబడులు, అధిక వెన్న శాతం పొందడానికి దాణాలు అయినా బైపాస్ ప్రోటీన్లు, బైపాస్ ఫ్యాట్లు వాడకం పట్ల రైతులు మక్కువ చూపిస్తున్నారు. ఈరోజు మనం ఏరువాకలో పాల ఉత్పత్తికి బైపాస్ ఫ్యాట్, బైపాస్ ప్రోటీన్‌ల ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం..
పశువులకి బైపాస్ ప్రోటీన్లు అందించాలి..
ఆవులు, గేదెలలో ఎక్కువగా పాల దిగుబడికి నాణ్యత గల మాంసకృతులను కొవ్వు పదార్థాలను అందించవలసి ఉంటుంది. వీటిలో మనం బైపాస్ ఫ్యాట్ల గురించి చూస్తే ఇది పామ్ ఆయిల్, రేప్ సీడ్ ఆయిల్, వరి తవుడు, ప్రొద్దుతిరుగుడు గింజల ద్వారా సుమారు 8500 కిలో క్యాలరీల శక్తి లభ్యమవుతుంది. వీటిలో జీర్ణం అయ్యే పదార్థాలు 90% వరకు ఉంటాయి. పశువులకి బైపాస్ ప్రోటీన్లు అందించినప్పుడు రూమెన్‌లో జీర్ణం అవ్వకుండా నేరుగా చిన్న ప్రేగులోకి చేరి శక్తిగా మారి పాల దిగుబడికి పూర్తిగా సహకరిస్తుంది.
Also Read: Neem Cake Powder: పంట భూమిలో వేపపిండి వేసుకోవటం వల్ల కలిగే లాభాలు.!
ఇది రుచిగా ఉండటం వలన పశువులు ఎంతో ఇష్టంగా తింటాయి. బైపాస్ ఫ్యాట్స్ ని దాణాలో కలిపి పశువులకు అందించినట్లయితే పాల దిగుబడి పెరగడంతో పాటు పాలలోని వెన్న శాతం పెరిగే అవకాశాలుంటాయి, పాలలో మాంసకృత్తులు పెరుగుతాయి, చూడి కట్టే శాతం కూడా పెరుగుతుంది శరీర బరువు వృద్ధి చెందటం గమనించవచ్చు. ప్రతిరోజు మనం దీనిని పశువులకు పెట్టాలి..
దాణాలో మాంసకృత్తులు ఉండాలి..
ఇక బైపాస్ ప్రోటీన్ల లభ్యత వల్లన పాల దిగుబడులు పెరుగుతాయి. ప్రత్తిగింజల చెక్క, వేరుశనగ చెక్క, పొద్దుతిరుగుడు విత్తనాల చెక్క, మొదలగు పదార్థాలలో మాంసకృత్తులు బైపాస్ ప్రోటీన్ల లక్షణాలు కలిగి ఉంటాయి. అందువలన దాణాలో కలిపి పశువులకు అందించినట్లయితే పాల దిగుబడి పెరుగుతుంది. అంతేకాకుండా మనకు మార్కెట్లో కూడా దొరుకుతున్నాయి… వీటి వలన పాల ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది. పడ్డలు, పెయ్యలు కూడా పెరుగుతాయి.. బైపాస్ ప్రోటీన్లు, బైపాస్ ఫాట్స్ తో కూడిన ఫీడ్ సప్లిమెంట్ వాడటం వలన ఉత్పాదక శక్తి సామర్థ్యం పొందే అవకాశాలు మొండుగా ఉన్నాయని పశుసంవర్ధక శాస్త్రవేత్త డా. అర్చన అన్నారు..
Also Read: Oil Palm Cultivation: మీకు తెలుసా? ఒక్కసారి నాటితే 40 సంత్సరాలు దిగుబడి వచ్చే పంట