పశుపోషణ

మరోసారి బర్డ్ ఫ్లూ కలకలం

0
Bird Flu Cases in Kerala 2021

High Alert in Kerala After Bird Flu Detection దేశంలో కరోనా కొత్తరకం వేరియంట్ ఒమిక్రాన్ చాపకింద నీరులా వ్యాప్తి చెందుతుండగా.. మరోవైపు కేరళలో బర్డ్‌‌ఫ్లూ విజృంభించడం ఆందోళన కలిగిస్తోంది. అవును కేరళ ప్రాంతంలో మరోసారి బర్ద్ ఫ్లూ విజ్రంభించింది. కేరళలోని కుట్టనాడ్ ప్రాంతంలోని తకాజి ​​పంచాయతీ నుంచి పరీక్షల నిమిత్తం పంపిన పక్షుల శాంపిల్స్‌లో బర్డ్‌ఫ్లూ పాజిటివ్‌గా తేలిందని సంబంధిత అధికారులు వెల్లడించారు. వచ్చిన నివేదికల ప్రకారం పక్షులకు H5N1 ఇన్ఫ్లుఎంజా వైరస్ సోకిందని తేలింది. ఈ మేరకు పరీక్ష కోసం, నమూనాలను భోపాల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హై-సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ National Institute of High-Security Animal Diseases  (ICAR)కి పంపించారు.

Bird Flu Detection

అలప్పుజ జిల్లాలో బర్డ్‌ఫ్లూ కేసులు నిర్ధారణ కావడంతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం.. బాతులు, కోళ్లను చంపాలని నిర్ణయించింది. మాంసం విక్రయాలపై నిషేధాజ్ఞలు విధించారు. వ్యాధి సోకిన ప్రాంతానికి కిలోమీటరు పరిధిలో ఉన్న పక్షులను గుర్తిస్తామని జిల్లా కలెక్టర్ అలెగ్జాండర్ Alexander అన్నారు. ఇప్పటికే పది బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ ప్రాంతంలోని 13 పంచాయతీల్లో కోళ్లు, గుడ్లు, మాంసం విక్రయాలు, తరలింపులపై కూడా ఆంక్షలు విధించామని చెప్పారు. కాగా..క్రిస్మస్ సీజన్ సమీపిస్తున్న సమయంలో ఇది బాతు రైతులకు తీరని నష్టమని అన్నారు. Bird Flu Detection In Kerala

Bird Flu Detection

అయితే కుట్టనాడ్ లో వ్యాధి నిర్ధారణ కావడం ఇది రెండవ సారి. ఇన్‌ఫ్లుయెంజా A వైరస్ యొక్క H5N8 జాతి వల్ల కలిగే బర్ద్ ఫ్లూ కుట్టనాడ్‌లోని ఆరు ప్రాంతాల్లో కనుగొన్నారు. కొట్టాయం జిల్లాలోని నెడుముడి, తకజీ, పల్లిప్పాడ్, కరువట్ట, కైనకరి మరియు నీందూర్ లలో ఈ ఏడాదిలోనే రెండు సార్లు నిర్ధారించారు. గత రెండు వారాల్లో 10,000 వేలకు పైగా పక్షులను చనిపోయాయి. ఇది రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చింది. Kerala Bird Flu Cases

Bird Flu Detection

2014లో H5N1 వైరస్ వల్ల వేలాది బాతులు చనిపోయాయి. కుట్టనాడ్‌లో H5N8 వైరస్ వల్ల కలిగే ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజా 2016లో బాతులలో కనుగొన్నారు. నిజానికి బర్డ్ ఫ్లూని ఏవియన్ ఫ్లూ అని కూడా పిలుస్తారు, ఇది ఒక రకమైన ఇన్ఫ్లుఎంజా. ఇది గాలి ద్వారా వ్యాపిస్తుంది . పక్షులపై దీని ప్రభావం విపరీతంగా ఉంటుంది. దీని ప్రభావం మనుషులపై చాలా తక్కువగా ఉంటుంది. పరిశోధకుల ప్రకారం ఈ తరహా వైరస్ లో అనేక జాతులు ఉన్నాయి. ఇక H7N9 వైరస్ అత్యంత ప్రమాదకరమైనది. Bird Flu Cases in Kerala 2021

Leave Your Comments

30 లక్షల రైతు ఖాతాల్లోకి పంట నష్టపరిహారం

Previous article

రైతులందరికీ ప్రధాని మోడీ ఆహ్వానం

Next article

You may also like