పశుపోషణ

Fowl Typhoid in Chickens: కోళ్ళలో ఫౌల్ టైఫాయిడ్ వ్యాధి.!

2
Fowl Typhoid in Chickens
Fowl Typhoid in Chickens

Fowl Typhoid in Chickens: ఈ వ్యాధిని సాల్మోనెల్లా గాలిసీరమ్ మరియు ఇన్ఫెక్షియస్ ల్యూకేమియా అని కుడా అంటారు.ఈ వ్యాధి ఇంటి వద్ద పెంచు పక్షులలో మరియు టర్కీలలో తీవ్ర స్థాయిలో ఉండి, అధిక మరణాలు కలిగిస్తుంటుంది. ఇది ఒక సెప్టిసీమిక్ వ్యాధి. మన దేశంలో కోళ్ళ పరిశ్రమకు శ్రీపమైన ఆర్థిక నష్టాన్ని కలిగించే వ్యాధులలో ఇది ఒకటి. ఈ వ్యాధిని మొదట భారతదేశంలో కోఫర్ మరియు నాయక్ 1931వ సంవత్సరంలో కనుగొన్నారు. మన దేశంలో యూ.పి, పంజాబ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర మరియు కర్ణాటక రాష్ట్రంలోని పక్షులలో ఈ వ్యాధిని అధికంగా గుర్తించుట జరిగిoది. ఈ ప్రాంతాల్లో కాక ఇతర ప్రాంతాలలోని పక్షులలో కూడా అప్పుడప్పుడు గమనించుట జరుగుతుంటుంది.

Fowl Typhoid in Chickens

Fowl Typhoid in Chickens

ఈ వ్యాధి సాల్మొనెల్లా గాలిసేరియం అనే GM-ve బ్యాక్టీరియా ద్వారా వస్తుంది. ఇవి 1-2 మైక్రో మీటర్ పొడవు, మరియు 1-1-8 మై.మీ వెడల్పు కలిగి ఉంటుంది. వీటికి కదలిక వుండదు. ఈ వ్యాధి వచ్చిన పక్షులు వేసిన రెట్ట ద్వారా లిట్టర్ లో సుమారు 4 వారాలు వరకు జీవించి ఉంటాయి. చనిపోయిన పక్షులలో 3 నెలల వరకు ఈ వ్యాధి కారకం జీవించే ఉంటుంది.కోళ్ళు, టర్కీలు, గినీ ఫౌల్, పి పాల్ మరియు బాతు పిల్లలలో సహజంగా ఈ వ్యాధి కారకం ఉంటుంది, పావురాలు ఈ వ్యాధికి నిరోధకంగా ఉంటాయి. పిసంట్స్, స్వాన్, పిచుకలు, మరియు ఆస్టివ్ – వంటివి ఈ వ్యాధి బారిన ఎక్కువగా పడుతుంటాయి. బాతులు, గీస్ మరియు టర్కీలు ఈ వ్యాధిని తట్టుకోగలవు.

ఈ వ్యాధి రెండు మార్గాల ద్వారా వచ్చును. అవి ఒకటి వర్టికల్ పద్ధతి. రెండొవది హారిజంటల్ పద్ధతి-

 పర్టికల్ పధ్ధతి:- ఈ పద్దతిలో క్రీడర్స్ యొక్క గుడ్డు ద్వారా పిల్లలకు వ్యాధి వస్తుంది.

 హారిజాంటల్ పద్ధతి : – కలుషితమైన పాత్రల ద్వారా, దాణా మరియు నీటి ద్వారా ఒక పక్షి నుండి మరోక పక్షికి వ్యాప్తి చెందుతుంది. వ్యాధి వచ్చిన పక్షుల ద్వారా, చనిపోయిన కోడిపిల్లల ద్వారా, కలుషితమైన గ్రుడ్లు ద్వారా, కెనబాలిజమ్ ద్వారా, పర్యాటకుల ద్వారా, ఈగల ద్వారా కూడా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. పెద్ద పక్షులు లక్షణాలు చూపించవు కానీ, అవి ఈ వ్యాధికి క్యారియర్స్ ఉంటు, ఫారములో ఈ వ్యాధి వ్యాప్తి చెందుటకు దోహదం చేస్తుంటాయి.

వ్యాధి వ్యాప్తి: ఇది ఎండోటాక్సిన్ అనే విషపదార్థాన్ని విడుదల చేస్తుంది. ఈ టాక్సిన్ ఎర్రరక్తకణాల మీద పని చేసి, వాటిని విచ్చిన్నం చేయుట వలన, కోళ్ళలో రక్త హీనత కలుగుతుంది. ఈ బాక్సిన్ మూలంగా కోళ్ళలో శరీర బరువు తగ్గుతుంది.

Also Read: Infectious Anaemia in Chicken: కోళ్ళలో ఇన్ ఫెక్ష్యూయస్ అనిమియాను ఇలా నివారించండి.!

లక్షణాలు :- ఈ వ్యాధిలో పక్షులు ఎటువంటి లక్షణాలు చూపించకనే చనిపోతుంటాయి. యుక్త వయస్సు పక్షుల్లో పుల్లోరం వ్యాధి లక్షణాలను గమనించవచ్చు. పెద్ద వాటిలో వ్యాధి సోకినప్పటికి లక్షణాలు ఎక్కువగా చూపించవు.అవుట్ బ్రేక్ వచ్చినప్పుడు మరణాల శాతం ఎక్కవగా ఉంటుంది. గ్రుడ్లు ఉత్పత్తి తగ్గుతుంది. పక్షుల్లో ఈ వ్యాధి తీవ్ర లేదా దీర్ఘకాలిక దశలుగా ఉంటుంది. కోళ్ళు ఒక్క చిక్కిపోయి వుంటాయి. ఆకు పచ్చ రంగులో లేదా పసుపు రంగులో పారుకుంటూ వుంటాయి. ఈ వ్యాధి బారిన పడిన కోళ్ళలో ఈకలు రాలిపోవుట, ఈకలు రవుల్డ్ గా తయారు అయి మండుటను గమనించవచ్చు. కుంబ్ మరియు వ్యాటిల్స్ పాలిపోయి ఉంటాయి.స్కెలిటల్ మజిల్స్ డార్క్ కలర్లో ఉంటుంది. కాలేయం, గుండె కండరాలలో నెక్రోసిస్ లక్షణాలు గమనించవచ్చు. పెరికార్డియమ్ పొరలో క్రైసుపు రంగులో నీరు కన్పిస్తుంది. గుండె చుట్టూ ఫైబ్రస్ పోర అతుక్కుని ఉంటుంది. అండాశయంలో పుటికలు తయారు కావు మరియు అండాలు వివిధ ఆక్రుత్తులలో ఉంటాయి.

చికిత్స :- ఈ వ్యాధికి ఆంటిబయోటిక్ సెన్సిటివిటీ పరీక్ష చేసి దానికి సరిపోయే ఆంటిబయోటిక్ ఔషధం సెలక్ట్ చేసి ఉపయోగించుట మంచిది. ఫుల్లోరం వ్యాధి చికిత్స ఉపయోగించిన అన్ని రకముల ఔషధాలను ఉపయోగించవచ్చు.

Vaccination in chicken

Vaccination in chicken

ఈ వ్యాధికి కూడా టీకాలు లేవు, అబెమా్యూఎటెడ్ వాక్సిన్ ఒకటి ఉన్నప్పటికీ అది అంతగా వెలుగులోకి రాలేదు. దీనిని  ఈ క్రింది విధంగా ఉపయోగించవచ్చు. 8 వారాలు వున్న కోళ్లకు ఒక మి.లీ చొప్పున చర్మం క్రింద ఇవ్వాలి. పుల్లోరం వ్యాధిలాగా జాగ్రత్తలు తీసుకొని ఈ వ్యాధి వ్యాప్తిని అరికట్టాలి.

-Rakesh Jhadi
Ph.D. Research Scholar , Department of Agronomy
Bidhan Chandra Krishi Viswavidhyalaya
Contact no:9505410171

Also Read: Diarrhea in Chickens: కోడి పిల్లలలో పుల్లోరం వ్యాధి ఎలా వస్తుంది.!

Must Watch:

Leave Your Comments

Uses of Methi Water: మెంతులు నానబెట్టిన నీటితో ఆరోగ్య ప్రయోజనాలు.!  

Previous article

Theileriosis in cattle: పశువులలో వచ్చే థైలేరియాసిస్ వ్యాధి.!

Next article

You may also like